విచిత్రం వివాహం: వధువు మెడలో తాళి కట్టిన మరదలు.. Its not same sex marriage, but groom's sister ties knot to the bride

Its not same sex marriage but groom s sister ties knot to the bride

Azharuddin, sophia, marriage, groom sister ties knot to bride, padmanabhapuram, traffic jam, muslim marriage, muslim customs, kanyakumari, tamil nadu, saudi

Its not same sex marriage, but groom's sister ties knot to the bride, this incident took place in Tamilnadu Kanyakumari as groom Azharuddin misses his flight from Dubai to attend his marriage.

విచిత్రం వివాహం: వధువు మెడలో తాళి కట్టిన మరదలు..

Posted: 01/28/2017 12:57 PM IST
Its not same sex marriage but groom s sister ties knot to the bride

వధువు మోడలో మరో మహిళ తాళి కట్టింది. అదేం విచిత్రం.. ఈ మధ్యకాలంలో ఈ పైపరిత్యాలు పెరిగిపోయాయి అంటూ నిట్టూర్చుతున్నారా..? కానీ ఇధి ఎంత మాత్రం స్వలింగ సంపర్కుల మధ్య పెళ్లి కాదు. కానీ వధువు మెడలో తాళి మాత్రం కట్టింది మరో మహిలే. ఏంటీ విచిత్రం..? ఎందుకలా..? అంటూ వివరాలు చెప్పమంటున్నారు కదూ..  తమిళనాడులోని కన్యాకుమారీ జిల్లాలో ఇలా వరుడు లేకుండానే పెళ్లి జరిగిపోయింది. అదెలా? అంటారా.. భారీ సంఖ్యలో బంధుమిత్రులు రాగా, మత పెద్దల సమక్షంలో అట్టహాసంగా వివాహం జరిగింది.

వివరాల్లోకి వెళ్తే.. పద్మనాభపురానికి చెందిన సోఫియాకు, పేచ్చిపారైకి చెందిన అజారుద్దీన్‌కు కొద్ది రోజులకు ముందు ముస్లిం సంప్రదాయం ప్రకారం నిశ్చితార్థం జరిగింది. అజారుద్దీన్ సౌదీలో ఓ ప్రైవేటు సంస్థలో కంప్యూటర్‌ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు. క్రితం రోజు పద్మనాభపురంలోని ఓ కళ్యాణ మండపంలో వీరిరువురి పెళ్లికి ఏర్పాట్లు జరిగాయి. గురువారం అజారుద్దీన ఇండియాకు వచ్చేందుకు సౌదీ విమానాశ్రయానికి కారులో బయలుదేరాడు. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా సకాలంలో విమానాశ్రయానికి చేరుకోలేకపోయాడు.

దీంతో ఫ్లైట్‌ మిస్సయ్యాడు. పెళ్లి ముహూర్తానికి వరుడు అజారుద్దీన్ రాలేడని తెలుసుకున్న ఇరువైపు బంధువులు నిరాశ చెందలేదు. వరుడు లేకపోయినా పర్వాలేదు.. పెళ్లి జరిపి తీరుతామంటూ ప్రకటించారు. ఆ మేరకు వధువు సోఫియా మెడలో అజారుద్దీన్ చెల్లెలు సూత్రధారణ చేసింది. పెళ్లికి విచ్చేసినవారంతా వధువుకు ఆశీర్వచనాలు, కానుకలు అందజేశారు. ముస్లిం మత సంప్రదాయం ప్రకారం వధువు, వరుడు అంగీకార పత్రాలపై సంతకాలు పెడితేనే సగం పెళ్లయినట్లని, కనుక సోఫియాకు జరిగింది పెళ్లిగానే పరిగణిస్తామని పెద్దలు పేర్కొన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles