తెలుగు రాష్ట్రాలలో ఘనంగా గణతంత్ర వేడుకలు.. governor narasimhan hoisted flags in telugu states

Governor narasimhan speech on republic day

Republic day celebrations, Governeor Narasimhan, Vijayawada, Chandrababu, chief minister, AP ministers, Andhra Pradesh,

Andhra pradesh governor ESL Narasimhan hoisted national flag at priyadarshini municipal stadium in vijayawada as a part of india republic day celebrations.

గణతంత్ర వేడుకలలో రెపరెపలాడిన మువ్వన్నెల జెండా..

Posted: 01/26/2017 09:19 AM IST
Governor narasimhan speech on republic day

ఆంధ్రప్రదేశ్లో 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన గణతంత్ర వేడుకల్లో భాగంగా గవర్నర్ నరసింహన్ జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. రాష్ట్ర ప్రజలకు గవర్నర్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ సర్వతోముఖాభివృద్ధి చెందుతుందన్నారు. విద్య, వైద్య, సంక్షేమ రంగాల్లో మంచి ఫలిచాలు సాధిస్తున్నామని చెప్పారు.

విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వేడుక‌ల  సంద‌ర్భంగా నిర్వ‌హించిన శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. గ‌ణతంత్ర వేడుక‌ల‌ను చూసేందుకు విద్యార్థులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు.  ఈ కార్యక్రమానికి వేడుక‌ల  సంద‌ర్భంగా నిర్వ‌హించిన శ‌క‌టాల ప్ర‌ద‌ర్శ‌న ఆక‌ట్టుకుంది. గ‌ణతంత్ర వేడుక‌ల‌ను చూసేందుకు విద్యార్థులు, ప్ర‌జ‌లు పెద్ద సంఖ్య‌లో హాజ‌ర‌య్యారు. వేడుకలకు హాజరైన వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, పోలీసులు గట్టి భద్రతా చర్యలు తీసుకున్నారు.   

అనంతరం గవర్నర్ సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన తెలంగాణ గణతంత్ర దినోత్సవ వేడుకలలో పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేదల సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రాష్ట్రం బంగారు తెలంగాణ దిశగా ముందుకెళ్తుందన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలతో తెలంగాణ అభివృద్ధిలో దూసుకెళ్తుందని స్పష్టం చేశారు. మిషన్‌భగీరథ, మిషన్ కాకతీయ దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.పేదల సొంతింటి కల తీర్చేందుకు డబుల్ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణం చేపడుతున్నది. డిసెంబర్‌లో నర్సన్నపేట, ఎర్రవల్లిలో డబుల్ బెడ్‌రూం ఇండ్లు ప్రారంభమయ్యాయని గవర్నర్ తెలిపారు.

31జిల్లాలతో తెలంగాణ పరిపాలన సాగుతోందని గవర్నర్ తెలిపారు. కోటి ఎకరాలను మాగాణంగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని పేర్కొన్నారు. మిషన్‌కాకతీయతో చెరువులకు పునర్జీవం వస్తుందన్నారు. రాష్ర్టాన్ని సస్యశ్యామలం చేసేందుకు పెద్ద ఎత్తున ప్రాజెక్టుల నిర్మాణం చేపడుతున్నట్లు వెల్లడించారు. ఇంటింటికి సురక్షిత మంచి నీళ్లు అందించేందుకు మిషన్ భగీరథను అమలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  రాష్ట్రవ్యాప్తంగా నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నట్లు గవర్నర్ తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles