రెస్టారెంటుకు వెళ్లి.. వంటలు రుచిగా లేవంటే.. Chilli Powder on Customer for Complaining about Food

Chef throws chilli powder on customer for complaining about food

Chef, customer, blinded, chilli, chilli powder, restaurant, Kamrul Islam, David Evans, Prince of Bengal, food, Watford, Tonypandy, UK, London

David Evans had gone out to eat with his wife at the Prince of Bengal restaurant in Watford, UK, where they found that the meat served to them was far from perfect

ITEMVIDEOS: వంటలు రుచిగా లేవంటే.. ఇలా కూడా జరగోచ్చు..

Posted: 01/24/2017 02:37 PM IST
Chef throws chilli powder on customer for complaining about food

వీకెండ్ రోజునో లేక ఏదైనా విశేషమున్న రోజునో మీ కుటుంబంతో పాటు మంచి రెస్టారెంటుకు వెళ్లి.. తృప్తిగా భుజించి వద్దామనుకుంటున్నారా..? మీ స్నేహితులకు బర్త్ డే స్పెషల్ గా రెస్టారెంట్ లో ఫుడ్ పార్టీ ఇద్దామనుకుంటున్నారా..? మీ ప్రియురాలిని తీసుకుని సరదాగా రెస్టారెంట్ కు వెళ్లి బోజనం చేద్దామనుకుంటున్నారా..? సరే విశేషమేమైనా, విషయం మాత్రం అర్థమైంది కదా..? అదేనండీ రెస్టారెంట్ కు వెళ్లి బోజనం చేయాలను భావించే వాళ్లు మాత్రం తస్మాత్ జాగ్రత్త.

రెస్టారెంట్లు, వాటితో పనిచేసే స్టీవార్డ్లు, లేక చెఫ్ లు చేసే వంటలపై ఇప్పటికే సోషల్ మీడియాలో ఎన్నెన్నో జోకులు పేలుతుంటాయి. ఆదే సమయంలో వారు సాగించే దాదాగిరిపై కూడా ఇటు సినిమాలలోనూ అటు సోషల్ మీడియాలలోనూ చాలా సన్నివేశాలే వున్నాయి. అయితే ఆ జాబితాలో చేరాల్సిన ఈ వీడియోను చూశారా..? రుచి, పచి లేకుండా వంటలు వండటంపై మండిపడ్డ ఓ కస్టమర్ ను కిచెన్ డోర్ వద్ద సన్మానించాడు ఓ చెఫ్. అదెలా అంటారా.. కారంపోడిని కళ్లలో కొట్టి. అందుకనే రెస్టారెంట్ కు వెళ్లి అర్డర్ చేసిన బోజనం ఎలా లాగించేయాల్సిందే.. లేకపోతే ఇలా కూడా జరగోచ్చు.

వివరాల్లోకి వెళ్తే.. లండన్ లోని సౌత్ వేల్స్ టోనీపాండేకు చెందిన డేవిడ్ ఇవాన్స్ తన భార్య మిచ్చెలీతో కలసి ఈ నెల 21 శనివారం వీకెండ్ సందర్భంగా బయట బోజనం చేద్దామని డిసైడ్ అయ్యాడు. రాత్రి పదిన్నర గంటల సమయంలో ఆయన తన సతీమణితో కలసి టోనిపాండేలోని ప్రిన్స్ అఫ్ బెంగాల్ రెస్టారెంట్ కు వెళ్లాడు. తాము అర్ఢర్ చేసిన మటన్ ముదురిపోవడంతో పాటు రబ్బరు మాదిరిగా సాగుతుందని డేవిడ్ ఇవాన్స్ స్టివార్డుకు పిర్యాదు చేశాడు.

దీంతో స్టివార్డు వెళ్లి ఆ వంటకం చేసిన ఛెఫ్ ను పిలుచుకుని వచ్చాడు. దీంతో డేవిడ్ ఇవాన్స్.. సగం ఉడికిన మటన్ ను మాకు ఎందుకు చేసి పెట్టావ్ అని నిలదీశాడు. దీంతో మండిపడి ఛెఫ్ వారి టేబుల్ దగ్గరే ఆ దంపతులపై తిట్ల పురానాన్ని అందుకున్నాడు. అలా తిడుతూనే కిచెన్ లోకి వచ్చేశాడు. ఇది రుచించని డేవిడ్ ఇవాన్స్.. కుక్ వెంట కిచెన్ వరకు వచ్చి.. నిర్లక్ష్య ధోరణితో తిట్ల పురాణం అందుకున్న ఛెఫ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. అక్కడ మరో ఛెఫ్ అడ్డు వచ్చినా.. అతడ్ని తోసి ముందుకు వచ్చిన చెఫ్ డేవిడ్ ఇవాన్స్ కళ్లలో కారం పోడి చల్లాడు. అంతే ఇక డేవిడ్ ఇవాన్స్ తన కళ్ల కింద ఐస్ పెట్టుకుని తన కళ్లకు కలిగిన మంటను చల్లార్చుకోవాల్సి వచ్చింది. ఎలాగో మీరే చూడండీ..

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chef  customer  blinded  chilli  chilli powder  restaurant  Kamrul Islam  David Evans  Prince of Bengal  food  Watford  Tonypandy  UK  London  

Other Articles