సిద్దూకే సీఎం పీఠం.. మర్మమేమిటో చెప్పిన కెప్టెన్..!. Sidhu for CM posters surface in east Amritsar

Navjot singh sidhu for cm posters surface in east amritsar

Navjot Singh Sidhu, Captain Amarinder Singh, Congress, Parkash Singh Badal, Punjab polls, shiromani akali dal, BJP, AAP, Punjab

The bitter-sweet relationship between party's Punjab face Captain Amarinder Singh and Sidhu has been a matter of concern for the party. Captain wasn't a part of the meeting announcing Sidhu's arrival into the party.

సిద్దూకే సీఎం పీఠం.. మర్మమేమిటో చెప్పిన కెప్టెన్..!

Posted: 01/24/2017 01:28 PM IST
Navjot singh sidhu for cm posters surface in east amritsar

ఎన్నికల వేళ.. ప్రత్యర్థుల కుయుక్తులను, కుట్రలను తట్టుకోవాల్సిన అవసరం అన్ని రాజకీయ పార్టీలకు తప్పక ఏర్పడుతుంది. సరిగ్గా ఇలాంటి అవసరం ఇప్పుడు పంజాబ్ లో కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. బీజేపీ పార్టీకి తిలోదకాలు ఇచ్చి.. ఆ పార్టీ ఇచ్చిన రాజ్యసభ సభ్యత్వాన్ని కూడా వదులుకున్న క్రికెటర్ నుంచి రాజకీయ నేతగా మారిన నవజ్యోత్ సింగ్ సిద్దూ.. తొలుత అప్ లో  చేరనున్నారని, ఆయనే  ముఖ్యమంత్రి అభ్యర్థిగా కొనసాగనున్నారని వార్తులు వచ్చినా.. ఆ తరువాత మాత్రం కాంగ్రెస్ లో చేరి పంజాబ్ ఎన్నికల సభలలో వేడి రగల్చుతున్నారు.

ఆయన బీజేపికి రాజీనామా చేసి.. స్థబ్దుగా వున్ నసమయంలో పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడు అమరిందర్ సింగ్ మాత్రం సిద్దూ కాంగ్రెస్ లో చేరుతున్నారని, ఆయన తండ్రిది కూడా కాంగ్రెస డీఎన్ఏ అని చెప్పారు. అంతేకాదు.. సిద్దూను కాంగ్రెస్ పార్టీలోకి తీసుకురావడంలో అమరిందర్ కీలక సాత్ర పోషించారు. తనకు సిద్దూ సొంత కొడుకు లాంటి వాడని కూడా చెప్పుకోచ్చారు. అందరిలా తమ బంధం కొనసాగదని.. తమకు తండ్రీ కొడుకుల బంధమని అటు రాజకీయ సభల్లోనూ ప్రచారం చేశారు.

ఇంతవరకు బాగానే వున్నా.. ఇక్కడే వుంది అసలు ట్విస్టు.. తాజాగా పంజాబ్‌లో కొత్త ప్రచారం మొదలైంది. ‘నవజ్యోత్‌ సింగ్‌ సిద్దూను ముఖ్యమంత్రిని చేయడానికి కాంగ్రెస్‌ పార్టీకి ఓటేయండి..’ అని సందేశమిస్తున్న రాష్ట్రమంతటా పోస్టర్లు వెలుస్తున్నాయి. పార్టీ అధిష్ఠానం నిర్ణయించిన ముఖ్యమంత్రి అభ్యర్థి కెప్టెన్‌ అమరీందర్ సింగ్ వయసు ప్రస్తుతం ‌75 ఏళ్లు. ఎన్నికల్లో గెలిచి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే వృద్ధాప్యం సాకుతో అమరీందర్‌ను పక్కన పెడతారని, సిద్దూను సీఎం చేస్తారని కూడా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇక సిద్దూను పార్టీలోకి తీసుకువచ్చిన అమరీందర్ కు ఆయన హాని చేయరని, అయితే ఇది విపక్షాల కుట్ర అని కూడా కాంగ్రెస్ శ్రేణులు అంటున్నారు.

ఇక ఇలాంటి ప్రచారాలు జోరందుకున్న నేపథ్యంలో వీటన్నింటిపై పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు కెప్టెన్‌ అమరీందర్‌ మీడియాకు వివరణ ఇచ్చారు.‘సిద్దూ సీఎం అవుతారంటూ వెలసిన పోస్టర్లకు, కాంగ్రెస్‌ పార్టీకి ఎలాంటి సంబంధంలేదు. బీజేపీ, ఆమ్‌ఆద్మీపార్టీలే వాటిని అంటిచాయి. తద్వారా కాంగ్రెస్‌లో ఏదో జరుగుతోందన్న ప్రచారం చేయాలన్నది ఆ పార్టీల పన్నాగం. ఇక సిద్దూ పిల్లాడిగా ఉన్నప్పటినుంచీ నాకు తెలుసు. వాళ్ల నాన్న మా అమ్మ దగ్గర సెక్రటరీగా పనిచేశారు. క్రికెట్‌లో ఎంతో పేరు తెచ్చుకున్న అతను.. బేషరతుగా కాంగ్రెస్‌ పార్టీలో చేరాడు’ అని కెప్టెన్‌ వివరించారు.

అయితే గెలిచినా, ఓడినా తాను పోటీ చేసే చివరి ఎన్నకలు మాత్రం ఇవేనని స్పష్టం చేశారు అమరీందర్‌ సింగ్‌. ‘ఇప్పుడు నాకు 75 ఏళ్లు. వచ్చే ఎన్నికల నాటికి 80ఏళ్లు నిండుతాయి. అసలే మనది యువతరం నిండినదేశం కాబట్టి నేను తప్పుకోక తప్పదు’ అని కెప్టెన్‌ చెప్పారు. కాంగ్రెస్‌- అకాళీదల్‌ మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు పాల్పడుతున్నారన్న ఆప్‌ అధినేత కేజ్రీవాల్‌ వ్యాఖ్యలను అమరీందర్‌ ఖండించారు. గెలుపుపై ధీమా ఉంది కాబట్టే నేరుగా సీఎం ప్రకాశ్‌ సింగ్‌ బాదల్‌ను (లాంబి నియోజకవర్గంలో) ఢీకొంటున్నానని గుర్తుచేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles