రైలు ప్రమాదం ఘటన మృతులకు పరిహారం ప్రకటన Railway, Andhra announces compensation for Hirakhand train victims

Railway andhra announces compensation for hirakhand train victims

Government compensation, Hirakhand Express, Jagdalpur Bhubaneswar Express, Hirakhand Express Accident, Hirakhand Express train derail, vizianagaram train derail, andhra pradesh train tragedy, Train accident, train derailmen

The Andhra government announced Rs 5 lakh each for the next of kin of 36 persons who died in the Hirakhand Express derailment in Vizianagram district.

రైలు ప్రమాదం ఘటన మృతులకు పరిహారం ప్రకటన

Posted: 01/22/2017 11:56 AM IST
Railway andhra announces compensation for hirakhand train victims

ఆంధ్రప్రదేశ్లో విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించినవారి కుటుంబాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్స్గ్రేషియా ప్రకటించాయి. విజయనగరం జిల్లా కొమరాడ మండలం కూనేరు సమీపంలో శనివారం రాత్రి హీరాఖండ్‌ ఎక్స్‌ప్రెస్‌ పట్టాలు తప్పడంతో.. అందులో ప్రయాణిస్తూ అసువులు బాసిన 39 మంది మృతుల కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షలు, ఏపీ ప్రభుత్వం రూ.5 లక్షలు ఎక్స్గ్రేషియాగా ప్రకటించాయి. ఈ ప్రమాదంలో గాయపడ్డవారికి 100 మందికి పైగా ప్రయాణికులకు కేంద్రం తరఫున 50 వేల రూపాయల చొప్పున పరిహారం అందజేస్తామని రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభు తెలిపారు.

రైలు ప్రమాదం కారణంగా పలు రైళ్ల సమయాల్లో, వెళ్లే మార్గాల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. కొన్ని రైళ్లు మొత్తానికే రద్దుకాగా మరికొన్ని రైళ్లను దారి మళ్లిస్తున్నారు. ధన్‌బాద్‌ అలెప్పీ ఎక్స్‌ప్రెస్‌, హతియ యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లను టిట్టాగఢ్‌-రాయ్‌పూర్‌-నాగ్‌పూర్‌ మీదుగా దారిమళ్లించగా.. నాందేడ్‌-సంబల్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ను కుర్టా రోడ్డు-అంగుల్‌ మీదుగా దారి మళ్లించారు. ఇక రాయ్‌గఢ్‌-విశాఖ ప్యాసింజర్‌, విశాఖ-కోరాపుట్‌, సంబల్‌పూర్‌-నాందేడ్‌ రైళ్లు రద్దు చేశారు.

మరోపక్క, కోరాపుట్‌-విశాఖ రైలును రాయగఢ్‌ వరకే పరిమితం చేశారు. అయితే, ట్రాక్‌ పనులపై డీఆర్‌ఎం చంద్రలేఖ ముఖర్జీ వివరణ ఇచ్చారు. సాయంత్రానికి ట్రాక్‌ పనులు పునరుద్ధరిస్తామని చెప్పారు. రైలు ప్రమాదంపై ఎలా జరిగిందన్న విషయమై రైలు ప్రమాదం విచారణ కమిటీ వేసినట్లు వివరించారు. ప్రమాదంపై ఇంకా ప్రాథమిక నిర్ధారణకు రాలేదని ఆయన అన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles