నగ్న ఫోటోలతో ప్రయుడ్ని బాక్ల్ మెయిల్ చేసిన యువతి woman blackmails boyfriend with nude photos

Bengaluru woman blackmails boyfriend with nude photos

archana, prem kumar, nude photos, blackmail, nude photos, money demand, girl arrested, rasipuram womens police station, bengaluru, crime news

bengaluru woman blackmails boyfriend with nude photos arrested for demanding one crore ruppees

నగ్న ఫోటోలతో ప్రియుడ్ని బాక్ల్ మెయిల్ చేసిన యువతి

Posted: 01/21/2017 03:33 PM IST
Bengaluru woman blackmails boyfriend with nude photos

ధనం మూలం ఇదం జగత్ అని పెద్దలు ఏనాడో చెప్పారు. అయితే డబ్బే పరమావధిగా భావించి ఏకంగా ప్రియుడ్నే బ్లాక్ మెయిల్ చేసింది ఓ యువతి. బెంగళూరులో వెలుగుచూసిన ఈ ఘటనలో అమెకు పోలీసులు అరదండాలు వేయడంతో కథ సుఖాంతమైంది. వినడానికే విచిత్రంగా వున్నా.. ఇది నిజం. ప్రియుడ్ని ఏకంగా కోటి రూపాయల మేర డిమాండ్ చేయడంతో అతను దిక్కుతోచని పరిస్థితులలో పోలీసులను అశ్రయించాడు. యువతి, ప్రియుడి నగ్న ఫోటోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనపై స్థానిక పోలీసులు కూడా అశ్చర్యపోయారు.

సాధారణంగా ఏకాంతంగా గడిపిన ఫోటోలను, వీడియోలను నెట్ లో అప్ లోడ్ చేస్తామని బెదిరించి.. వారిపై మరోమారు అత్యాచారాలకు తెగబడటం.. లేదా వారిని బలవంతంగా వ్యభిచార  కూపంలోకి దింపడం వంటి ఘటనలు చూసిన పోలీసులు.. ఈ కేసును దర్యాప్తు చేసి.. మాయలేడిని కటకటాల వెనక్కి నెట్టారు. వివరాల్లోకి వెళ్తే..  తమిళనాడులోని నామక్కల్‌ జిల్లా, రాశిపురం ప్రాంతానికి చెందిన ప్రేమ్‌ కుమార్‌(26) బెంగళూరులోని ఓ ఐటీ సంస్థలో పని చేస్తున్నాడు. ఖాళీ సమయంలో స్నేహితులతో ఫేస్ బుక్ లో చాటింగ్ చేసే ప్రేమ్ కుమార్ కు బెంగళూరుకు చెందిన అర్చన (22) తో ఫేస్‌బుక్‌ ద్వారా పరిచయం ఏర్పడింది.

పరిచయం కాస్తా హద్దులు దాటి ఏకంగా వారి మధ్య ప్రేమకు దారితీసింది. దీంతో ఇరువురూ కొంతకాలం ఫేస్ బుక్ ద్వారా చాటింగ్ చేసుకున్నారు. ఆ తరువాత ఒకరినోకరు కలవాలని భావించారు. అలా వారు అనుకున్న రోజు వచ్చింది. ఇద్దరు కొంతకాలం ఇలానే చాటుమాటు ప్రేమతో ఆనందంగా గడిపారు. చనువు పెరగడంతో ఇద్దరు హద్దులు కూడా దాటారు. అయితే తాము ఏకంతంలో వున్న సమయంలో ప్రేమ్‌కుమార్‌ నగ్నంగా ఉన్న ఫోటోలను అతనికి తెలియకుండా తీసింది అర్చన. ఇద్దరి మధ్య కొంతకాలానికి దూరం పెరిగింది. అంతే ప్రేమ్ కుమార్ నగ్న ఫొటోలు చూపి అతడి వద్ద నుంచి లక్షల రూపాయలు వసూలు చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles