మంచులో తడిసి ముద్దైన కాశ్మీరం.. స్థంభించిన జనజీవనం Fresh Snowfall Disrupts Life In Kashmir Valley

Fresh snowfall disrupts life in kashmir valley

Kashmir Valley, Srinagar-Jammu National Highway, Bannihal and Patnitop sectors, 300 km long road, Gulmarg winter, Batote, Katra, Jammu, heavy snowfall, kashmir temperature, kashmir freezing, freezing kashmir, kashmir weather, weather kashmir, kashmir cold, cold kashmir, kashmir electricity, electricity kashmir, india news

After nightlong intermittent snowfall, the Kashmir Valley on Wednesday remained cut off from the rest of the country as road, rail and air traffic got disrupted.

మంచులో తడిసి ముద్దైన కాశ్మీరం.. స్థంభించిన జనజీవనం

Posted: 01/18/2017 01:53 PM IST
Fresh snowfall disrupts life in kashmir valley

శీతాకాంలో అదీ పర్యాటక ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు.. ఆయా ప్రాంతాలలో మంచు కురుస్తుంటే.. మంచు కురిసే వేళలో మల్లె విరిసేదెందుకో మల్లె విరిసే మంచులో మనసు మురిసేదెందుకో ఎందుకో ఏ విందుకో అంటూ తమ నిచ్చెలిని తోడుగా తీసుకుని ఈ యువళగీతాన్ని అలపిస్తుంటారు. ఇలాంటి అరుదైన అనుభూతిని పోందాలని అనేక మంది పర్యాటక ప్రేమికులు ప్రత్యేకంగా అనేక శీతల ప్రాంతాలకు వెళ్లి మరీ అక్కడ తాత్కాలిక విడిది ఏర్పాటు చేసుకుని మరీ నివసిస్తుంటారు. ఇలా కాశ్మీరులోని పర్యాటక ప్రాంతాలకు వెళ్లే వారి సంఖ్య కూడా తక్కువేం కాదు.

అయితే తాము వెళ్లిన పర్యాటక ప్రాంతాల్లో చలి మరీ విపరీతంగా వుంటే.. ఆయన ప్రాంతం మొత్తం మంచు గుప్పెట్టో ముద్దగా మారితే.. ఇప్పుడు అదే పరిస్థితి కాశ్మీర్ లో ఏర్పడింది. కశ్మీర్‌ లోయలో రాత్రి ఉష్ణోగ్రతలు బాగా పడిపోయాయి. రాత్రంతా తధేకంగా మంచుకురవడంతో బుధవారం కూడా శ్రీనగర్‌- జమ్ము జాతీయ రహదారి మూతపడే ఉంది. దీంతో కాశ్మీర్ లో జనజీవనం స్థంభించిపోయింది. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. శ్రీనగర్ తో ఇతర జిల్లా కేంద్రాలకు వున్న రోడ్డు మార్గాలు కూడా మంచుతో కప్పేయడంతో రవాణ వ్యవస్థ పూర్తిగా స్థంభించిపోయింది.

విమానయానానికి కూడా బ్రేకులు పడ్డాయి. మంచును తొలగించే యంత్రాలతో ప్రభుత్వ యంత్రాంగం చూపట్టిన చర్యలు నత్తనడకన సాగుతుండటంతో పట్టనాలకు గ్రామీణ ప్రాంతాలకు మధ్య కూడా రవాణ వ్యవస్థకు అడ్డుంకుటు ఏర్పడ్డాయి. దీనికి తోడు అరకోర విద్యుత్ సరఫరాతో ప్రజలు తీవ్ర అవస్థలు పడ్డారు. విద్యుత్ సరఫరాను మెరుగుపర్చాలని ప్రజలు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. శ్రీనగర్‌లో రాత్రి మైనస్‌ 1.9 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రత నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. స్కీయింగ్‌ రిసార్ట్‌గా పేరొందిన గుల్మార్గ్‌లో ఉష్ణోగ్రత ఇంకా పడిపోయి మైనస్‌ 10.2 డిగ్రీలు నమోదైంది.

 కశ్మీర్‌లోయ ప్రాంతంలో ప్రస్తుతం ఈ రిసార్ట్‌ పట్టణమే అత్యంత చలి ప్రదేశంగా ఉంది. దక్షిణ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రకు బేస్‌ క్యాంపుగా పనిచేసే పహల్‌గావ్‌లో 5 మి.మీ. లకు పైగా మంచు కురిసింది. దాంతో ఉష్ణోగ్రత మైనస్‌ 12 డిగ్రీలకు పడిపోయింది. సరిహద్దు ప్రాంతమైన లద్దాఖ్‌ మొత్తం రాష్ట్రంలోనే అత్యంత శీతల ప్రాంతంగా రికార్డైంది. అక్కడ మైనస్‌ 13.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు అధికారులు తెలిపారు. మరో రెండు, మూడు రోజులు ఇవే పరిస్థితులు నెలకొనవచ్చని వాతావరణ శాఖ అధికారులు పేర్కోన్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Kashmir Valley  Srinagar  Jammu National Highway  Jammu  heavy snowfall  minus temperatures  

Other Articles