బాలయ్య కోపం.. నిండు కొలువులో అభిమానికి పరాభవం.. Balakrishna Throws Away Fan Iphone At Gautamiputra Satakarni Premier

Balakrishna throws away fan iphone at gautamiputra satakarni premier

Balakrishna serious, balakrishna real behavior, Ballayya attitude, balayya fan i phone, balayya abusing, balayya blasts fan, balayya at gautamiputra satakarni, Telugu Movies Telugu Gossips, Tollywood New Movies2016, bollywood2016, hitsongs, GSK, bala krishna, balayya, fan, attitude, tollywood

A set back to Nandamuri Fan, who attempted to take a selfie with Bala krishna at a priemier show of Gautamiputra Satakarni in hyderabad was shocked, as the nata simham #Balakrishna Throws Away Fan's Iphone

ITEMVIDEOS: బాలయ్య కోపం.. నిండు కొలువులో అభిమానికి పరాభవం..

Posted: 01/13/2017 07:35 PM IST
Balakrishna throws away fan iphone at gautamiputra satakarni premier

వందో చిత్రంగా వచ్చిన గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమాకు మంచి పాజిటివ్ టాక్ రావడంతో బాలకృష్ణ అభిమానులు మంచి సంతోషంగా ఉన్నారు. థియేటర్లలో సందడి చేస్తున్నారు. కొన్ని థియేటర్లకు స్వయంగా బాలకృష్ణ కూడా వెళ్లడంతో ఇక అభిమానుల సంతోషానికి పట్టపగ్గాలు లేకుండా పోతున్నాయి. ఎలాగైనా బాలయ్య బాబును దగ్గర నుంచి చూడాలని, ఆయనతో కలిసి సెల్ఫీలు తీసుకోవాలని పలువురు యువకులు ఉత్సాహపడుతున్నారు. కానీ.. సరిగ్గా ఇలాగే సరదా పడిన ఓ అభిమానికి చేదు అనుభవం ఎదురైంది.

అభిమానుల మధ్య వున్నానన్న సంగతి మర్చిపోయి ఓ అభిమాని చేసిన చర్య చిరాకు తెప్పించడంతో అభిమాన హీరో కొపాన్ని సదరు అభిమాని చవిచూడాల్సి వచ్చింది. అయితే నందమూరి అభిమానులకు నేను అండగా వుంటాను. వారి సంక్షేమాన్ని కాంక్షిస్తాను అంటూ అభిమానులను గొలుచుకునే నందమూరి సీనియర్ నటుడి బాలయ్యే.. అ మాటలకు విలువనీయకుండా అభిమాని పట్ల దురుసుగా ప్రవర్తించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

‘ఓ అభిమాని బాలయ్యకు అతి సమీపానికి వచ్చి సెల్ఫీ తీసుకోవడానికి ప్రయత్నిస్తుండగా.. అతడి చేతిని బాలయ్య నెట్టేయడం.. ఫోన్ కిందపడడం’ ఆ వీడియోలో కనిపిస్తుంది. దీంతో ఫాన్స్ అతనిపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు. ఓ రేంజ్ లో బాలయ్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. స్వర్గీయ ఎన్టీయార్ నటవారసుడిగా బాలయ్య తన అసలైన నైజాన్ని అభిమానులకు శతచిత్రం ద్వారా రుచి చూపించాడని కొందరు ఎద్దేవా చేస్తున్నారు.

థియేటర్‌ లోపల ఓ అమ్మాయి అడిగితే కాదనకుండా లేచి, నిలబడి మరీ ఫొటోలకు ఫోజులిచ్చిన బాలయ్య.. థియేటర్ బయట ఓ అబ్బాయి సెల్ఫీ తీసుకుంటుండగా ఇలా చేయడమేంటని అడుగుతున్నారు. చాలామంది నెటిజన్లు కూడా బాలయ్య ఇలా చేసుండకూడదని చెబుతున్నారు. అభిమాని ఫోన్ పడేసిన తరువాత కొంత సేపు అభిమానిపై ఫైర్ అవుతూ అక్కడే నిల్చున్న బాలయ్య.. అదే సమయాన్ని అభిమానితో కేటాయిస్తే.. అభిమానుల అభిమానం మరింత పెరిగేదని, వారు సంతోషాలకు అవధులు వుండేవి కాదని కూడా కొందరు కామెంట్లు పెడుతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gautamiputra satakarni  bala krishna  balayya  fan  attitude  tollywood  

Other Articles