కోడిపందాల రాయుళ్లకు ఈ సారి పండగే.. SC refuses urgent hearing on ban on cockfights

Sc refuses urgent hearing on ban on cockfights

Gauri Maulekhi, Cockfight ban, Cockfight, Andhra Pardesh, Supreme Court, Hyderabad High Court, Animal Welfare Board, AWB, Makar Sankranti

Cockfights will continue to remain banned in Andhra Pradesh as the Supreme Court on Friday refused to pass any order regarding the matter.

కోడిపందాల రాయుళ్లకు ఈ సారి పండగే..

Posted: 01/13/2017 12:53 PM IST
Sc refuses urgent hearing on ban on cockfights

సంక్రాంతి వచ్చిదంటే చాలు ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలు తారాస్థాయిలో నిర్వహిస్తారు. ఈ పందెలలో వేల కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయని జాతీయ మీడియా కూడా కథనాలు ప్రచురించినా మన వాళ్లలో మాత్రం మార్పు రాదు. అయితే పందెలా పేరుతో మూగజీవాలైన కోళ్లకు కత్తులు కట్టి వాటి ప్రాణాలపై పందేలా నిర్వహిస్తుంటారని వాటిని నిలిపివేసేలా తక్షణం అదేశాలను జారీ చేయాలని జాతీయ జంతు సంరక్షణ విభాగం దేశ సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

హైకోర్టు ఆదేశాలను అతిక్రమించి ఆంధ్రప్రదేశ్‌ లో కోడి పందాలు నిర్వహిస్తున్నారని పిటిషన్‌ దాఖలు చేసింది. కోడిపందాలపై ఏపీ హైకోర్టు స్టే ఇచ్చినప్పటికీ కొందరు వాటిని నిర్వహించేందుకు సిద్ధపడ్డారని తన పిటిషన్‌ లో పేర్కొంది. జంతు సంరక్షణ విభాగం సభ్యురాలు గౌరీ వేసిన పిటిషన్‌ను పరిశీలించిన సుప్రీంకోర్టు.. కోడిపందాలను ఆపాలని ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వడానికి నిరాకరించింది. ఈ విషయంలో ఇప్పటికిప్పుడు ఉత్తర్వులు ఇవ్వలేమని చెబుతూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. దీంతో కోడి పందాల రాయుళ్లకు వెయ్యి ఏనుగుల బలం వచ్చి.. ఇక నిజమైన పండగను జరుపుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles