జైలుకెళ్లడం ఇష్టం లేదంటూ.. బీజేపి ప్రభుత్వానికి పొంత మంత్రి ఝలక్ Jharkhand Minister Saryu Rai Opposes His Own Government

Jharkhand minister saryu rai opposes his own government

Jharkhand politics, BJP govt, Jharkhand, Saryu Rai, Mining rights Jharkhand, Fodder scam

The ruling BJP in Jharkhand is facing an embarrassing revolt by a senior minister who walked out of a cabinet meeting, objecting to the renewal of mining contracts

జైలుకు వెళ్లనంటూ.. బీజేపి ప్రభుత్వానికి పొంత మంత్రి ఝలక్

Posted: 01/12/2017 03:56 PM IST
Jharkhand minister saryu rai opposes his own government

అధికారంలోకి వచ్చాం.. మంత్రి పదవిని దక్కించుకున్నాం.. ఎంత వెనకేసుకున్నాం అని అలోచించే నేటి నేతలకు కొదవలేని ప్రస్తుత రోజుల్లో సీనియర్ నాయకుడు.. జార్ఖండ్ పార్లమెంటరీ వ్యవహరారాలు, అహార, పౌరసరఫరాల విభాగానికి ఇంచార్జ్ గా వ్వవహరిస్తున్న మంత్రి సరయు రాయ్ మాత్రం అధికారంలో వున్న సోంత పార్టీ, ప్రభుత్వానికే ఝలకిచ్చారు. రాష్ట్రంలోని కంపెనీలకు మైనింగ్‌ హక్కులు పునరుద్ధరించే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్‌ సమావేశం కాగా ఆయన హాజరై మధ్యలో వెళ్లిపోయారు.

కంపెనీలకు మైనింగ్‌ హక్కులు దారాదత్తం చేస్తే అవి అక్రమాలకు పాల్పడుతున్నాయని విచారణలో తేలిందని, ఈ విషయం కోర్టులో కూడా ఉండటంతోపాటు నిలుపుదల చేసినందున తాను ఈ నిర్ణయానికి మద్దతివ్వలేనని, అలా చేస్తే జైలుకు వెళ్లాల్సి వస్తుందని ఆయన కుండబద్ధలు కొట్టి వెళ్లిపోయారు. గతంలోనే ఈ అంశాన్ని ఆలోచించినప్పటికీ ఈ నిర్ణయాన్ని సవరించాలని, అలాగే మైనింగ్‌ శాఖ కచ్చితంగా న్యాయశాఖను కలిసి వివరాలు తెలుసుకోవాలని సరయు రాయ్‌ ప్రతిపాదించారు.

ఇలా చేయకుంటే ఈ మొత్తం వ్యవహారంపై ఏదో ఒకరోజు సీబీఐ విచారణ చేస్తుందని, నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిసి జైలుకు పంపిస్తుందని హెచ్చరించి మరీ వెళ్లారు. ఈ మంత్రికి గతంలో అవినీతికి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తిగా, బిహార్‌లో చోటు చేసుకున్న దాణా కుంభకోణాన్ని బయటపెట్టిన వ్యక్తిగా మంచి పేరుంది. అధికారంలోని మంత్రి ఇలా కేబినెట్‌ మీటింగ్‌ మధ్యలో వెళ్లిపోవడం ప్రతి పక్షాలకు మంచి ఊతం ఇచ్చినట్లు అవుతుందని అధికార బీజేపీ ఆవేదన చెందుతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Jharkhand politics  BJP govt  Jharkhand  Saryu Rai  Mining rights Jharkhand  Fodder scam  

Other Articles