ఉత్కంఠ రేపుతున్న యూపీ రాజకీయం.. అమర్ సింగ్ భావోద్వేగం.. We Practically Raised Akhilesh, Says Amar Singh

Akhilesh yadav was 4 we practically raised him says amar singh

Amar Singh, Mulayam Singh, Akhilesh Yadav, Samajwadi Party, UP Assembly Elections, Uttar Pradesh elections, ram gopal yadav, shivpal yadav, UP polls, political news

Amar Singh, SP lawmaker went on an emotional track when asked about CM Akhilesh Yadav reportedly asking father Mulayam Singh Yadav to dump him to enable a truce.

ఉత్కంఠ రేపుతున్నయూపీ రాజకీయం.. అమర్ సింగ్ భావోద్వేగం..

Posted: 01/07/2017 01:08 PM IST
Akhilesh yadav was 4 we practically raised him says amar singh

ఉత్తర్ ప్రదేశ్ లో అధికార సమాజ్ వాదీ పార్టీలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఎన్నికల షడ్యూలు విడుదల అయిన తరువాతైనా సద్దుమణుగుతుందని భావించినా.. రాను రాను మరింత జఠిలంగా మారుతుందా..? అన్నట్లుగా తయారైంది పరిస్థితి. పార్టీ పరిస్థితిపై మీడియా సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పిన పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్.. అంతలోనే మనస్సును మార్చుకున్నారు. తాను మీడియా సమావేశాన్ని రద్దు చేసుకున్నట్లు ప్రకటించారు. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందన్న ఉత్కంఠ కార్యకర్తలు, శ్రేణల్లో ఉత్కంఠ రేపుతుంది.

ఇదే సమయంలో పార్టీలో క్రియాశీలక నేత అమర్ సింగ్ తాజాగా ముఖ్యమంత్రి అఖిలేశ్‌ యాదవ్ తనపై పెట్టిన నిబంధనలు విని ఒక్కసారిగా బావోద్వేగానికి గురయ్యారు. తాను నిక్కర్లు వేసుకున్న వయసు నుంచి తనకు తెలుసునని..  అతని చదువులు, ఎదుగుదల, వ్యక్తిగత జీవితం.. అన్నింటిలోనూ తోడ్పడ్డానని అన్నారు. కానీ ఇప్పుడు ‘నా’ అనుకున్నవాళ్లే మనల్ని ద్వేషిస్తే, మనల్ని వద్దనుకుంటే ఎంత బాధపడతామోకదా! ప్రస్తుతం నాదీ అలాంటి పరిస్థితే. అఖిలేశ్‌ నా గురించి మాట్లాడేవన్నీ వింటే నా గుండె బరువెక్కిపోతుంది..’ అంటూ భావోద్వేగానికి గురయ్యారు సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ అమర్‌సింగ్‌.

పార్టీ సుప్రిమో ములాయం సింగ్‌ యాదవ్‌తో కలిసి ఢిల్లీ నుంచి లక్నో వచ్చిన అమర్‌సింగ్‌.. ఎయిర్‌పోర్టులో విలేకరులతో మాట్లాడారు. ‘మరో మాట లేకుండా నన్ను పార్టీ నుంచి గెంటేయాలని అఖిలేశ్‌ డిమాండ్‌ చేయడం బాధాకరం. సొంతవాళ్లే మనని ద్వేషిస్తూ ఆ బాధ వర్ణనాతీతం. నిజానికి నాకున్నవి రెండే రెండు కోరికలు. ఒకటి పార్టీలో పెద్దాయనే(ములాయమే) సుప్రీంగా ఉండాలి. రెండు, అఖిలేశ్‌ రాజకీయాల్లో ఇంకా ఉన్నతస్థానానికి ఎదగాలి. ఇంతకు మించి నాకేదీ అక్కర్లేదు’ అని అమర్‌సింగ్‌ అన్నారు.

ఇదిలాఉంటే, ఢిల్లీ నుంచి తిరిగివస్తోన్న తండ్రి(ములాయం)కి లక్నో ఎయిర్‌పోర్టులో స్వాగతం పలుకుదామనుకున్న సీఎం అఖిలేశ్‌.. చివరి నిమిషంలో మనసు మార్చుకున్నారు. ములాయం వెంట అమర్‌సింగ్‌ కూడా ఉండటమే అందుకు కారణమని, ‘శకుని మామ వెంటుంటే మనమెలా వెళతాం?’అని అఖిలేశ్‌ వ్యాఖ్యానించినట్లు ఆయన అనునాయులు పేర్కొన్నారు. తండ్రి ప్రాపకంతో తనకు వ్యతిరేకంగా ఎత్తులు వేస్తోన్న అమర్‌సింగ్‌ను అఖిలేశ్‌ ‘శకుని మామ’గా అభిర్ణించడం పార్టీలో అందరికీ తెలిసిందే అయినా.. పరిస్థితులు ఇలాగే కొనసాగితే పార్టీ చేజేతులా అధికారానికి దూరమవుతుందన్న వాదనలు కూడా తెరపైకి వస్తున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amar Singh  Mulayam Singh  Akhilesh Yadav  Samajwadi Party  UP polls  

Other Articles