గోవాలో అధికార బీజేపికి షాక్.. తెగదెంపులు చేసుకున్న మిత్రపక్షం MGP Withdraws Support To BJP-Led Goa Govt

Maharashtrawadi gomantak party withdraws support to bjp led goa govt

maharashtrawadi gomantak party,bjp,bharatiya janata party,goa,goa government,bjp-led govt in goa,mgp withdraws support to bjp,assembly polls 2017,goa polls 2017,assembly elections 2017, bjp, goa, assembly polls 2017, Sudin Dhavalikar, CM candidate

The ruling ally Maharashtrawadi Gomantak Party (MGP) withdrew support to the BJP-led Goa Government and declared Sudin Dhavalikar as its chief ministerial candidate.

గోవాలో అధికార బీజేపికి షాక్.. తెగదెంపులు చేసుకున్న మిత్రపక్షం

Posted: 01/05/2017 09:52 PM IST
Maharashtrawadi gomantak party withdraws support to bjp led goa govt

గోవాలో బీజేపీకి మిత్రపక్షం మహారాష్ట్ర వాదీ గోమంతక్ పార్టీ (ఎంజీపీ) మద్దతు ఉపసంహరించుకుంది. గోవా శాసనసభ ఎన్నికల తేదీలను ఈసీ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఎంజీపీ మద్దతు ఉపసంహరించు కోవడంతో బీజేపీకి ఎదురుదెబ్బతగిలింది. అంతటితో ఆగని ఎంజీపీ, త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ నుంచి ముఖ్యమంత్రి అభ్యర్థిగా సుదిన్‌ ధవలికర్‌ ను అప్పుడే ప్రకటించేసింది. ఇదే విషయాన్ని తెలుపుతూ గవర్నర్‌ మృదులా సిన్హాకు లేఖ కూడా రాసింది. దీంతో బీజేపీతో చర్చలకు సిద్ధంగా లేనట్టు స్పష్టంగా చెప్పినట్టైంది. దీంతో పాటు కూటమి నుంచి తక్షణం వైదొలుగుతున్నామని ఆ లేఖలో తేల్చేసింది.

కాగా, గోవాలో మొత్తం 40 స్థానాలకు ఫిబ్రవరి 4న పోలింగ్‌ జరుగనుంది. దీనికి సంబంధించి నోటిఫికేషన్ ఈ నెల 11న విడుదల కానుంది. దీనికి సంబంధించి నామినేషన్ల దాఖలుకు ఈ నెల 18 చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన 19 వరకు, నామినేషన్లు ఉపసంహరణకు ఈ నెల 21 వరకు ఈసీ గడువు విధించింది. ఈ నేపథ్యంలో మిత్రపక్షం హ్యాండివ్వడం బీజేపీకి ఎదురుదెబ్బే అనడంలో సందేహం లేదు. కాగా, గోవాలో బీజేపీకి 'ఆప్' గట్టిపోటీ ఇస్తున్న సంగతి తెలిసిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maharashtrawadi gomantak party  bjp  goa  assembly polls 2017  Sudin Dhavalikar  CM candidate  

Other Articles