బహిరంగ లైంగికదాడి ఘటనపై స్పందించిన అమాత్యులు Bengaluru molestation a conspiracy to defame city

Bengaluru molestation a conspiracy to defame city karnataka home minister

karnataka, home minister, silicon valleym national commission for women, parameshwara Rao, new Year eve, banglore mass molestation, NCW

While promising a safer Bengaluru, the top minister termed the entire episode an a conspiracy to defame the state's Congress government and the IT city in particular.

బహిరంగ లైంగికదాడి ఘటనపై స్పందించిన అమాత్యులు

Posted: 01/05/2017 07:36 PM IST
Bengaluru molestation a conspiracy to defame city karnataka home minister

న్యూఇయర్ వేడుకలలో భాగంగా బెంగళూరు సిలికాన్ వ్యాలీలో యువతులపై అరాచకశక్తుల ముఠా జరిగిన బహిరంగా లైంగిక వేధింపుల ఘటనపై తాను చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక హోంమంత్రి జీ పరమేశ్వర వివరణ ఇచ్చారు. తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆయన ఇవాళ స్పందించారు. తాను అన్న మాటలను సందర్భోచితంగా తీసుకోకుండా కేవలం తాను ఘటనను తేలిగ్గా చేసి చూపానన్నది మాత్రం పెద్దగా చేసి చూపారని అయన అన్నారు. ఎందుకని ఈ వ్యాఖ్యలను తాను చేయాల్సి వచ్చిందో అలా కాకుండా మరో కోణంలో వాటిని తీసుకున్నారన్నారు.

'నేను దేనిని ఉద్దేశించి అన్నానో అలా నా మాటలు తీసుకోలేదు. ఆ రోజు జరిగింది ఓ దురుదృష్టకర సంఘటన. యువతులు కించపర్చాలన్నది నా అభిమతం కాదు. ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నా.. ఇది కేవలం బెంగళూరు సిటీకి ప్రతిష్టను దెబ్బతీసేందుకు జరుగుతున్న కుట్ర. నాకు జాతీయ మహిళా కమిషన్‌ సమన్లు పంపించింది ఇచ్చింది. వాటికి నేను వివరణ ఇస్తాను. అలాగే, గవర్నర్‌ ఈ ఘటనకు సంబంధించి నా నుంచి వివరణ కోరారు. దానికి కూడా నేను సమాధానం ఇస్తాను' అని ఆయన మీడియాకు బదులిచ్చారు.

నూతన సంవత్సరం వేడుకల సందర్భంగా బెంగళూరులోని ఎంజీ రోడ్డులో మహిళలు, యువతులపై లైంగిక వేధింపులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనపై నాడు మంత్రిని వివరణ కోరగా ఆయన పోలీసులను వెనుకేసుకు రావడమే కాకుండా అక్కడి వచ్చిన యువత అంతా కూడా పాశ్చాత్య సంస్కృతిని అనుసరిస్తున్నవారని, వారిలాగే దుస్తులు వేసుకున్నవారని, ఇలాంటి సందర్భాల్లో అలాంటివి జరుగుతుంటాయని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసందే. దీనిపై జాతీయ మహిళ కమిషన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోపక్క, బెంగళూరులోని ఓ వీధిలో న్యూఇయర్‌ శుభాకాంక్షల పేరిట ఓ అమ్మాయిపై లైంగిక వేధింపులకు పాల్పడి సీసీటీవీ కెమెరాకు చిక్కిన ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురు వ్యక్తుల్ని అరెస్టు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles