ప్రశంసలు కాదు ప్రోత్సాహకాలు ప్రకటించండీ ప్రధాని గారూ.. bank employees letter to PM ti fullfill their demands

Bank employees demand benefits insteadof praise from pm

PM Modi, bank employees, bank union, bank employees letter, bank union letter to pm modi, bank employees pm narendra modi, Bank staff, rewards, NOBW,

bank employees demand benefits insteadof praises from Prime minister modi, writes a letter to pmo in this regard

ప్రశంసలు కాదు ప్రోత్సాహకాలు ప్రకటించండీ ప్రధాని గారూ..

Posted: 01/05/2017 05:18 PM IST
Bank employees demand benefits insteadof praise from pm

అవినీతి రూపుమాపడం కోసమే పెద్ద నోట్లను రద్దు చేశానని ప్రధాని నరేంద్రమోడీ ప్రజల్లోకి వెళ్లి విసృతంగా ప్రచారం చేస్తూనే మరోవైపు ఇందుకు పూర్తిగా సహకరించిన బ్యాంకు ఉద్యోగులపై కూడా ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో బ్యాంకు ఉద్యోగులు మాత్రం తమకు ప్రసంశలు కాదు, పైసలు కావాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. నూతన సంవత్సరం జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ, బ్యాంకు ఉద్యోగుల సేవలను కొనియాడిన సంగతి తెలిసిందే.

నోట్ల రద్దు తరువాత ఏర్పడిన పరిస్థితుల్లో బ్యాంకు ఉద్యోగులు కీలకపాత్ర పోషించారని, కష్టపడి పని చేశారని ప్రధాని ప్రశంసించారు. ఈ నేపథ్యంలో ప్రశంసలతో సరిపెట్టకుండా పైసలివ్వాలని బ్యాంకు ఉద్యోగులు డిమాండ్ చేశారు. తమ శ్రమకు తగిన ప్రతిఫలం వెంటనే ఇవ్వాలని బ్యాంకు ఉద్యోగుల సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. ఓవర్‌ టైమ్‌ డ్యూస్‌ తక్షణమే చెల్లించాలని జాతీయ బ్యాంకు ఉద్యోగుల సంఘం (ఎన్‌ఓబీడబ్ల్యూ) డిమాండ్‌ చేసింది. ఈ మేరకు ప్రధానమంత్రికి బ్యాంకు ఉద్యోగుల సంఘం లేఖను కూడా రాసింది.

బ్యాంకు ఉద్యోగులు బాగా పని చేశారని ప్రధాని మోదీ మెచ్చుకుని ప్రశంసించారని.. అయితే బ్యాంకు ఉద్యోగుల సంక్షేమానికి కచ్చితమైన ప్రకటన మాత్రం చేయలేదని, ప్రశంసలతో తమ కడుపు నిండదని వారు లేఖలో పేర్కోన్నారు. అందులో చాలా బ్యాంకులు తమ ఉద్యోగులకు ఇంకా ఓవర్‌ టైమ్‌ డ్యూస్‌ చెల్లించలేదని పేర్కొంది. ఉద్యోగుల భద్రతకు యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం(ఏఐబీఈఏ) డిమాండ్‌ చేసింది. తమ డిమాండ్లను ప్రధాని దృష్టికి లేఖ ద్వారా తీసుకెళ్లామని, ఎన్ఓబీడబ్యూ ఉపాధ్యక్షుడు అశ్వనీ రాణా తెలిపారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles