కోహ్లీ కోసం గొప్ప త్యాగం చేశాడా? | Dhoni has made a great sacrifice for Virat Kohli.

Dhoni quits as captain of odi and t20 teams

Mahendra Singh Dhoni, MS Dhoni, Dhoni quits captaincy, Dhoni great sacrifice, Dhoni quits captaincy, Dhoni Kohli, MS Dhoni, Team India captain, India Wicket keeper Dhoni, Dhoni as ordinary player, Dhoni 2017, Dhoni shocks

MS Dhoni quits as ODI and T20 captain, but, wants to play the 2019 World Cup. Champions Trophy could decide his future as a player.

కెప్టెన్సీకి ధోనీ గుడ్ బై

Posted: 01/05/2017 08:58 AM IST
Dhoni quits as captain of odi and t20 teams

ధోనీ సారథ్య ప్రస్థానం ముగిసింది. ధనాధన్‌ ధోనీ హెలికాప్టర్‌ షాట్‌ లాంటి నిర్ణయంతో అందరికీ, ముఖ్యంగా అభిమానులకు కొత్త సంవత్సరం ఆరంభంలోనే షాకిచ్చాడు. వన్డే, టీ20 ఫార్మాట్‌లో సారథ్య బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందర్నీ విస్మయపర్చాడు..! దీంతో వచ్చే వరల్డ్ కప్‌(2019 వన్డే) వరకు పరిమిత ఓవర్ల ఫార్మాట్‌ కు ఈ జార్ఖండ్ డైనమైట్ కెప్టెన్ గా వ్యవహరిస్తాడన్న అంచనాలకు చెక్ పెట్టేశాడు.

నాయకత్వ వైఫల్యంతో ఓటమి రావటం, ఆపై విమర్శలు, ఎప్పుడు బాధ్యతల నుంచి తప్పుకుంటాడనే ప్రశ్నలు మిగతా కెప్టెన్ లా లాగా ధోనికి కూడా ఎదురయ్యాయి. మరోవైపు టెస్ట్ కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించిన కోహ్లీ దూకుడు ప్రదర్శిస్తూ వరుస విజయాలు అందుకోవటంతో ధోని తప్పించి విరాటుడికి పగ్గాలు అప్పజెప్పాలనే డిమాండ్‌ మళ్లీ మొదలైంది. అయితే వీటిపై మీడియా ప్రశ్నలు అడిగినప్పుడల్లా పట్టించుకోకుండా ధోని తన పని తాను చేసుకుంటూ పోయాడు.

ఇబ్బందులు ఎన్ని ఉన్నా బోర్డు పెద్దలలో అతని నాయకత్వ ప్రతిభపై ఎవరికీ సందేహాలు లేవు. కాబట్టి వెంటనే అవమానకరంగా తొలగిస్తారనే సంకేతాలు అందలేదు. రాబోయే కొన్ని సిరీస్‌ల ఫలితాలు ఎలా ఉన్నా కనీసం ఈ ఏడాది జూన్‌లో జరిగే చాంపియన్స్‌ ట్రోఫీ వరకు అయినా అతను కొనసాగుతాడని అంతా భావించారు. అయితే టెస్టు టీమ్‌ అద్భుతాలు చేసిన వెంటనే వన్డేల్లో వచ్చిన సాధారణ ఫలితాలు వద్దన్నా పోలికను తెవటం సహజమే. ఇవన్నీ ఒక్కసారిగా మహేంద్రుడిపై ఒత్తిడి తెచ్చాయనే అనుకోవచ్చు.

వచ్చే వరల్డ్‌ కప్‌ కోసం వచ్చే రెండేళ్ల కాలంలో కోహ్లి నేతృత్వంలో జట్టు సిద్ధమవుతుందని అనుకున్నారు. కానీ ధోని మాత్రం మరోలా ఆలోచించాడు. తాను తప్పుకునే సమయం ఆసన్నమైందని భావించాడు. 2019లో ఇంగ్లండ్‌లో జరిగే ప్రపంచ కప్‌ కోసం సన్నాహకం 2017లో ఇంగ్లండ్‌ సిరీస్ వేదిక కావాలని అతను భావించాడు. అందుకే ఇతరులకు అవకాశం ఇవ్వకుండా తనంతట తానుగా నిష్క్రమించాడు.తన నిర్ణయాన్ని బీసీసీఐకు తెలిపాడు. ఈ విషయాన్ని బీసీసీఐ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొంది. అయితే, జట్టు నుంచి తొలగడం లేదని, వన్డే, టీ-20లకు కెప్టెన్సీ బాధ్యతల నుంచి మాత్రమే తాను తప్పుకుంటున్నానని తెలిపాడన్నారు. ఇంగ్లండ్ తో వన్డే, టీ-20 సిరీస్ కు ధోనీ అందుబాటులో ఉంటాడని పేర్కొంది. కాగా, ఇంగ్లండ్ సిరీస్ కు విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తాడని, ఇకపై అన్ని ఫార్మాట్లకూ కెప్టెన్ గా కోహ్లీనే కెప్టెన్ గా ఉంటాడని బీసీసీఐ స్పష్టం చేసింది.

కాగా, 199 వన్డేలకు, 72 టీ ట్వంటీ మ్యాచ్ లకు ధోనీ సారధ్య బాధ్యతలు వహించాడు. మూడు ఫార్మట్ లలో టీమిండియాను జగత్ విజేతగా నిలబెట్టడమే కాదు, అత్యధిక మ్యాచ్ లలో గెలిపించిన సారథిగా రికార్డు క్రియేట్ చేశాడు. కాగా, కెప్టెన్సీకి గుడ్ బై చెప్పటంతో ఇకపై సాధారణ ప్లేయర్ గా, వికెట్ కీపర్ గా మైదానంలో ధోనీ దర్శనమివ్వనున్నాడు.  గత ఏడాది టి20 ప్రపంచ కప్‌ సెమీ ఫైనల్‌ తర్వాత అతను చేసిన వ్యాఖ్యలు చూస్తే 2019 వరకు కూడా కొనసాగే ఉద్దేశం ఉందని అర్థమైంది. కానీ ఎంత ఫిట్‌గా ఉన్నా... కొత్త కుర్రాళ్లతో వచ్చే వరల్డ్‌ కప్‌పై దృష్టి పెట్టిన జట్టులో అతను తన స్థానం కాపాడుకోవాలంటే అద్భుతాలు చేయాల్సిందే.

ట్విట్టర్ లో కామెంట్లు...

ప‌రిమిత ఓవ‌ర్ల క్రికెట్‌, టీ20 ఫార్మాట్లలో కెప్టెన్సీ నుంచి త‌ప్పుకున్న ధోనీపై స‌ర్వ‌త్ర ప్ర‌శంస‌ల జ‌ల్లు కురుస్తోంది. ధోనీ నిర్ణ‌యంతో షాక్‌కు గురైన అభిమానులు సామాజిక మాధ్య‌మాల ద్వారా ధోనీపై కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆయ‌న ఫొటోలు పెట్టి త‌మ అభిమానాన్ని చాటుకున్నారు. ధోనీ లాంటి కెప్టెన్ మ‌రొక‌రు లేరంటూ ప్ర‌శంస‌లు కురిపించారు.

టీమిండియా మాజీ కెప్టెన్ క‌పిల్‌దేవ్ అయితే భార‌త్ క్రికెట్‌కు ధోనీ చేసిన సేవ‌లను ప్ర‌స్తుతించాడు. భార‌త్‌కు ఎన్నో విజ‌యాలు అందించి క్రికెట్‌ను ఎంతో ముందుకు తీసుకెళ్లాడ‌ని కొనియాడాడు. 'థ్యాంక్యూ ధోనీ సాబ్' అని పేర్కొన్నాడు.

మాజీ కామెంటేట‌ర్ హ‌ర్షా భోగ్లే కూడా ధోనీని ఆకాశానికి ఎత్తేశాడు. ధోనీ నాయ‌కత్వంలో భార‌త్‌కు చిర‌స్మ‌ర‌ణీయ విజ‌యాలు అందాయ‌ని పేర్కొన్నాడు. ధోనీని ప్ర‌తి ఒక్క‌రు అభినందించాల‌న్న హ‌ర్ష 2019 క్రికెట్ వ‌ర‌ల్డ్ క‌ప్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు కోహ్లీకి అప్ప‌గించే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ట్వీట్ చేశాడు.

క్రికెట్ గాడ్ సచిన్‌ టెండూల్కర్‌ ధోనీ గురించి ట్వీటుతూ... ‘ధోనికి శుభాకాంక్షలు. భారత్‌కు రెండు (టి20, వన్డే) ప్రపంచకప్‌లు అందించాడు. నేను చూసిన అత్యుత్తమ కెప్టెన్‌లలో మహి ఒకడు. అతని నిర్ణయాన్ని మనమంతా గౌరవించాలి’ అని పేర్కొన్నాడు.

‘అతని అంకితభావం మనందరికి తెలుసు. ఉన్నతమైన ఆలోచనలతో జట్టును నడిపించాడు. ఇపుడు కెప్టెన్సీపై కూడా ఆలోచించే నిర్ణయం తీసుకున్నాడని భావిస్తున్నా’ అని సెలక్షన్‌ కమిటీ చైర్మన్‌ ఎమ్మెస్కే ప్రసాద్‌ తెలిపాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mahendra Singh Dhoni  Team India Captain  quit  

Other Articles