కేటీఆర్ పిలుపు ఇచ్చాడు.. కమల్, రానా, మంచులక్ష్మీ స్పందించారు.. దేనికోసం? | celebs quik reaction on KTR tweet.

Celebs reaction on ktr handloom call

Minister KTR, Telangana handloom ambassador, KTR Kamal Hassan, Manchu Lakshmi KTR, KTR Handloom tweet, KTR Rana tweets, India Today Rajdeep Sardesai Handloom, Telangana Minister KTR, KTR celebs twitter, celebs reaction to KTR tweet

Minister KTR asks to wear Handloom cloths once in a week to celebrities. Kamal Haasan, Rana, Manchu Lakshmi and Rajdeep Sardesai supports KTR's initiative.

కేటీఆర్ ట్వీటా మజాకానా!

Posted: 01/04/2017 04:42 PM IST
Celebs reaction on ktr handloom call

ఉద్యమ దశలో సెలబ్రిటీలకు ఆయన పరిచయం అంతంత మాత్రమే. కానీ, ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. పైగా ఐటీ మంత్రి కావటం, హైదరాబాద్ బాధ్యతలు ఆయన చేతిలో ఉండటంతో మోస్ట్ వాంటెడ్ గా మారిపోయాడు కేటీఆర్ . రాంచరణ్, రానా లాంటి టాలీవుడ్ హీరోలతోనే కాదు, అడపా దడపా కోలీవుడ్, బాలీవుడ్ స్టార్లతోనూ, సచిన్ లాంటి క్రీడా దిగ్గజాలతోనూ ఫ్రెండ్ షిఫ్ చేస్తూ ఆయా కార్యక్రమాలను సక్సెస్ చేస్తున్నాడు. దీంతో ఆయనేం చేసినా స్పెషల్ అయిపోతుంది.

తాజాగా దుర్భర జీవితాలను గడుపుతున్న చేనేత కార్మికుల కోసం ఓ పిలుపునిచ్చాడు. ఒకప్పుడు నేతలంటే ఖద్దరు ట్రెండ్ నడిచేదని చెప్పిన ఆయన ప్రస్తుతం ఆ పరిస్థితి లేదంటూ, దీంతో కార్మికులకు ఆదరణ కరువైపోయిందని పేర్కొన్న ఆయన వారంలో ఒక్క రోజైనా ఖద్దరూ లో రావాలంటూ పిలుపునిచ్చాడు. అంతేనా సోమవారం కార్యాలయానికి వచ్చిన ఆయన చేనేత దుస్తులు ధరించి, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్‌ తో కలిసి ఓ సెల్ఫీ దిగి ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. పైగా కమల్, మహేష్, నాగార్జున, రానా, సానియా, వివేక్ ఒబెరాయ్, రాజ్ దీప్ సర్దేశాయ్, మంచులక్ష్మీ, పీవీసింధు, సమంత లాంటి ప్రముఖులకు నేను ధరించాను. మరి మీరో? అంటూ పిలుపునిచ్చాడు కూడా.

 

అంతే ఆ పిలుపుకు సెలబ్రిటీలంతా ఒక్కోక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా రానా స్పందిస్తూ తాను ధరిస్తున్నానంటూ ట్వీట్ చేయగా, ఫోటో ఏదని కేటీఆర్ ప్రశ్నించాడు. అనంతరం యూనివర్సల్ హీరో కమల్ హాసన్ స్పందించారు. చేనేతకు అండగా నేను సైతం అన్నారు. అలాగే అందరూ చేయూతనివ్వాలని పిలుపునిచ్చారు. తన తండ్రి జీవితకాలమంతా చేనేత వస్త్రాలే ధరించారన్నారు. చేనేతకు అండగా నిలబడదామన్నారు.

ఇక ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ సంతోషం వ్యక్తం చేయగా, నటి మంచులక్ష్మీ తన మద్ధతుని ప్రకటించింది. మొత్తానికి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ చేనేతకు చేయూతనిచ్చేందుకు కేటీఆర్ చేస్తున్న యత్నానికి సెలబ్రిటీల నుంచి మంచి స్పందనే వస్తోంది.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Telangana  Minister KTR  Handloom tweet  Rana  Manchu lakshmi  Rajdeep Sardesai  

Other Articles