కుదిరిన రాజీ: అఖిలేష్, రాంగోపాల్ సస్సెన్షన్ ఎత్తివేత SP revokes akhilesh, ram gopal yadav suspension

Sp revokes akhilesh ram gopal yadav suspension

samajwadi party,Ram Gopal Yadav,Akhilesh Yadav,SP family feud,mulayam takes akhilesh back,Mulayam Singh Yadav,akhilesh yadav expelled

Samajwadi Party's Uttar Pradesh Chief Shivpal Yadav today said the expulsion of Uttar Pradesh Chief Minister Akhilesh Yadav and party strategist Ram Gopal Yadav has been revoked

కుదిరిన రాజీ: అఖిలేష్, రాంగోపాల్ సస్సెన్షన్ ఎత్తివేత

Posted: 12/31/2016 01:09 PM IST
Sp revokes akhilesh ram gopal yadav suspension

ఉత్తర్ ప్రదేశ్ అధికార సమాజ్ వాదీ పార్టీలో ఏర్పడ్డ సంక్షోభం తారాస్థాయికి చేరి.. ఇక వేరు కుంపట్లు తప్పదన్న స్థాయికి చేరుకుని ఆ వెనువెంటనే పాలపొంగులా పొంగి చల్లబడ్డాయి. మరో రెండు మూడు మాసాల్లో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న అధికారిక పార్టీలో ఇదివరకే ఒకటి రెండు పర్యాయాలు చెలరేగిన అంతర్గత విభేదాలు.. నిన్న రాత్రి తీవ్రస్థాయికి చేరకున్నాయి. నిన్న ఉదయం సీఎం అఖిలేష్ యాదవ్ కే షోకాజ్ నోటీసులు పంపిన పార్టీ సాయంత్రానికి అతడ్ని ఏకంగా పార్టీ నుంచే సస్పెండ్ చేసి.. పార్టీలో తీవ్ర కలకలానికి కారణమైంది.

అంతలా పార్టీలో తుఫానులా మారిన ఈ వివాదం.. మరుసటి రోజు మధ్యాహ్నానికి చల్లారిపోయింది. పార్టీ అధినేత ములాయం సింగ్ యాదవ్, ముఖ్యమంత్రి అఖిలేష్ సింగ్ యాదవ్ ల మధ్య రాజీ కుదిరింది. అఖిలేష్, ఆయన బాబాయ్ రామ్ గోపాల్ యాదవ్ లపై నిన్న విధించిన ఆరేళ్ల సస్పెన్షన్ ను ఎత్తివేసి, మళ్లీ వారిని పార్టీలోకి తీసుకున్నారు. దీంతో, పార్టీలో నెలకొన్న హైడ్రామాకు తెరపడింది. ఎస్పీ వివాదాస్పద నేత ఆజం ఖాన్ చొరవ తీసుకుని... తండ్రీ కుమారులిద్దరితో సమావేశం నిర్వహించారు.  అధికార సమాజ్‌వాదీ పార్టీలో సంక్షోభం ముగిసింది. దీంతో కొన్ని గంటలుగా కొనసాగుతున్న యాదవ్‌ పరి'వార్‌' హైడ్రామాకు తెరపడింది.

నిట్టనిలువునా చీలిపోయేందుకు సిద్ధపడిన ఎస్పీ.. తండ్రి-కొడుకుల రాజీతో కుదురుకుంది. తండ్రి ములాయం, కొడుకు అఖిలేశ్‌లతో ఎస్పీ సీనియర్‌ నేత, మంత్రి ఆజంఖాన్‌ నెరిపిన దౌత్యం ఫలించింది. దీంతో అఖిలేశ్‌ యాదవ్‌, రాంగోపాల్‌ యాదవ్‌పై ఆరేళ్ల సస్పెన్షన్‌ను ఎస్పీ ఎత్తివేసింది. వారిద్దరిని తిరిగి పార్టీలోకి తీసుకుంటున్నట్టు ప్రకటించింది. అంతకుముందు తనను బహిష్కరించడంతో సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలతో తన నివాసంలో భేటీ నిర్వహించారు. ఈ భేటీకి అనూహ్యమైన స్పందన వచ్చింది. ఏకంగా ఎస్పీ 190 మంది ఎమ్మెల్యేలు, 35మందికి పైగా ఎమ్మెల్సీలు ఈ భేటీకి హాజరై అబ్బాయికి జైకొట్టారు.

తనకు మద్దతునిచ్చే ఎమ్మెల్యేల జాబితా తీసుకొని చివరి ప్రయత్నంగా అఖిలేశ్‌ ములాయం ఇంటికి వెళ్లారు. అప్పటికే అక్కడున్న సీనియర్ మంత్రి ఆజంఖాన్‌ ఇటు ములాయంతో, అటు అఖిలేశ్‌తో వేర్వేరుగా సమావేశమై.. ఇద్దరి మధ్య రాజీ కుదిర్చారు. దీంతో అఖిలేశ్‌పై, రాంగోపాల్‌ యాదవ్‌పై సస్పెన్షన్‌ ఎత్తివేసేందుకు ములాయం అంగీకరించారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని సీఎం అఖిలేశ్‌ను, ఆయన సన్నిహితుడు రాంగోపాల్‌ యాదవ్‌ను పార్టీ చీఫ్‌ ములాయం ఆరేళ్లు బహిష్కరణకు ఇక తెరపడినట్టే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : samajwadi party  Ram Gopal Yadav  Akhilesh Yadav  mulayam Singh Yadav  shivpal yadav  

Other Articles