పెట్రల్ @300, గ్యాస్ @3000.. మణిపూర్ లో స్థంబించిన జనజీవనం Miscreants set ablaze government buildings in Manipur

Manipur civil society calls for ending economic blockade

manipur crisis, manipur violence, manipur economic blockade, united naga council, manipur-nagaland, manipur civil society, Manipur, oil, United Naga Council, Mizoram, YMA stops six oil trucks to Manipur market, india news, latest news

The meeting also agreed that all CSOs of both the hills and valley should work together to resolve the existing issues and restore normalcy in the state.

పెట్రోల్ @300, గ్యాస్ @3000.. మణిపూర్ లో స్థంబించిన జనజీవనం

Posted: 12/24/2016 03:13 PM IST
Manipur civil society calls for ending economic blockade

మణిపూర్ లో రేగిన అందోళనలు, నిరసనల నేపథ్యంలో రాష్ట్ర రహదారులు నిర్భందం కోనసాగుతున్న తరుణంలో జనజీవనం పూర్తిగా స్థంభించింది. గత 50 రోజులుగా కొనసాగుతున్న ఆర్థిక కార్యకలాపాల దిగ్బంధనంతో ఇంఫాల్ కు వెళ్లే ట్రక్కులన్నీ జాతీయ రహదారులు 37, 2పై నిలిచిపోయాయి. పరిస్థితిని చక్కదిద్దేందుకు అర్మీని రంగంలోకి దించుతామని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజ్జు కూడా ప్రకటించారు. పరిస్థితిని సాధ్యమైనంత త్వరగా సాధరణానికి తీసుకువస్తామని చెబుతున్నా అందోళన కారులు మాత్రం తమ బెట్టువీడటం లేదు.

అయితే అందోళనకు రాజకీయ రంగు పులుముకోవడం కారణంగానే నిరసన సెగలు ఇంకాస్త జఠిలంగా మారయన్న వార్తలు కుడా వినిపిస్తున్నాయి. కాగా యంగ్ మిజో అసోసియేషన్ అధ్వర్యంలో మిజోరంకు వెళ్లే రహదారులను అందళనకారులు నిలివివేయడంతో అక్కడి నిత్యావసరాలను రవాణా చేస్తున్న లారీలు కూడా నిలిచిపోయాయి. దీంతో అక్కడ నిత్యావసర ధరలకు మునుపెన్నడూ లేని ధరలు పలుకుతుంది. లీటర్ పాలు 60 నుంచి 70 రూపాయల ధర పలుకుతుండగా, కూరగాయలు, నిత్యావసర సరుకుల ధరలకు కూడా మూడునాలుగింతలుగా రెక్కలు వచ్చాయి. ఇక లీటర్ పెట్రోల్ రూ.300... గ్యాస్ సిలిండర్ రూ.3,000 ధర పలుకుతుంది.

నాగాలు, ఇతర వర్గాల మధ్య జాతి ఘర్షణలు ఈ ప్రాంతంలో ఎప్పటి నుంచో ఉన్నవే. ఈ రాష్ట్రంలో నాగాల జనాభా 20 శాతం కాగా, మీతీస్ 65 శాతంగా ఉన్నారు. కుకి చిన్ వర్గం జనాభా 13 శాతం. కొత్తగా ఇంఫాల్ తూర్పు జిల్లాలోని జిరిబామ్ ప్రాంతాన్ని, సేనాపతి జిల్లాలోని కంగ్ పోక్పి లను రెండు కొత్త జిల్లాలుగా చేయనున్నట్టు గత అక్టోబర్లో మణిపూర్ ప్రభుత్వం ప్రకటించింది. ఇది నాగాలకు రుచించలేదు. సేనాపతి జిల్లా తమ పూర్వీకుల స్వస్థలమని, దాన్ని విడగొట్టడానికి వీల్లేదంటూ వారు డిమాండ్ చేశారు. ప్రభుత్వ చర్యకు వ్యతిరేకంగా నవంబర్ 1న నాగా కౌన్సిల్ ఆర్థిక దిగ్బంధనానికి దిగింది.

అయినప్పటికీ ప్రభుత్వం దిగిరాలేదు. డిసెంబర్ 8న ఏడు కొత్త జిల్లాలను ప్రభుత్వం ప్రకటించేసింది. దీంతో ఇంఫాల్ వ్యాలీలో ఘర్షణలు తలెత్తాయి. ఫలితంగా ఈ నెల 18న కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది. నాగాల దిగ్బంధనంతో మొత్తం ఏడు జిల్లాల్లో ప్రజా జీవనానికి తీవ్ర విఘాతం నెలకొంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం  కేంద్ర ప్రభుత్వ సాయం కోరింది. అదనపు బలగాలను పంపాలని కోరింది. అయితే కేంద్రం కూడా కాస్త వేచిచూసే ధోరణినిన అవలంభిస్తుందన్న విమర్శలు వున్నాయి. గత పక్షం రోజులుగా అందోళనలు తీవ్రమైనా కేంద్రం ఎందుకు చర్యలకు ఉపక్రమించలేదన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కాగా ఈ ఆందోళన ప్రభావం పవిత్ర క్రిస్మస్ వేడుకలపైన కూడా పడే ప్రభావం వుందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles