గుజరాత్ ఛాయ్ వాలా వద్ద రూ.650 కోట్లు.. IT seizes Rs 650 crore from tea seller

Surat snack vendor kishore bhajiawala worth rs 650 cr i t department

Kishore bhajiawala, surat snack vendor, gujarat chaiwala, it raid at surat tea vendor, demonetisation of currency, Diamond city, people 's cooperative bank, Income Tax, Financial Intelligence Unit, Black Money

Income Tax officials searching wealth of Surat-based tea and snacks vendor-turned-financier Kishore Bhajiawala have in all unearthed property worth Rs 650 crore.

గుజరాత్ ఛాయ్ వాలా వద్ద రూ.650 కోట్లు పైమాటే..

Posted: 12/20/2016 04:08 PM IST
Surat snack vendor kishore bhajiawala worth rs 650 cr i t department

పెద్దనోట్ల రద్దు తరువాత ఏకంగా కోటి రూపాయల మేర తన బ్యాంకు అకౌంటులో వేయడంతో అదాయపన్ను శాఖ దృష్టి సారించి దాడులు చేపట్టడంతో ఏకంగా గుజరాత్ లోని ఒక చాయ్ వాలా  కిషోర్ భజియావాలా వద్ద 650 కోట్ల రూపాయల విలువైన అస్తులు బయటపడ్డాయి. గత వారం రోజులుగా ఇతని అస్తుల వివరాలపై తనీఖీలు చేస్తున్న అదాయశాఖ అధికారులకు తవ్విన కోద్దీ అస్తులు బయటపడుతున్నాయి. దీంతో తొలుత వంద ఆ తరువాత నాలుగు వందలు, ప్రస్తుతం 650 కోట్ల రూపాయలకు పైగానే అతని వద్ద అస్తులున్నాయని అధికారులు కనుగోన్నారు.

అయితే ఈ ఆస్తులన్నింటినీ అతను కేవలం చాయ్ తో పాటుగా స్నాక్స్ అమ్ముతూనే సంపాదించానని, గత మూడు దశాబ్దాలుగా.. డైమండ్ సిటీగా పేరొందని సూరత్ నగరశివార్లలోని ఉద్నాలో ఛాయ్, స్నాక్స్ అమ్ముతూ కూడబెట్టుకున్నానని చెబుతున్నాడు. సుమారు దశబ్దమున్నర కాలం నుంచి టీ స్టాల్ తో పాటు ఫైనాన్స్ రంగంలోనూ అడుగుపెట్టిన  కిషోర్ భజియావాలా రెండు చేతులా సంపాదిస్తున్నాడు. అయితే మాత్రం తన వద్దనున్న కోటి రూపాయల పాత నోట్లను ఏం చేయాలి..బ్యాంకులో వేస్తే తప్పేంటి..? అంతమాత్రాన అదాయశాఖ దాడులు చేస్తుందా..? అంటారా.?

ఇతగాడు చేసిన నేరమేమిటంటే.. రెండు చేతులా సంపాదిస్తున్నప్పుడు సక్రమంగా పన్నులు కడితే సరిపోయేది. అలా కాకుండా కక్కుర్తి పడి ఏడాదికి సుమారుగా 120 నుంచి 150 కోట్ల మేర వున్న తన అధాయాన్ని కేవలం కోటిన్నర రూపాయలుగా మాత్రమే చూపించడంతో అసలుకే ఎసరు వచ్చింది. అదాయ శాఖ అధికారుల దాడుల్లో ఏకంగా కోటాను కోట్ల రూపాయల అస్తులు బయటపడుతున్నాయి. ఇతడి వద్ద నుంచి 50 కిలోల వెండి, రూ. 1.39 కోట్ల విలువైన వజ్రాలు, రూ. 6.5 కోట్ల నగదు, కిలోల కొద్దీ బంగారాన్ని అధికారులు గుర్తించారు.

ఇవి చాలదన్నట్లు తనకు తన కుటుంబ సభ్యులకు చెందిన సుమారు 40 మేర బ్యాంకు అకౌంట్లు వున్నాయని, ఈ క్రమంలో రానున్న రోజుల్లో కిషోర్ భజియావాలా అస్తులు మరింత పెరగవచ్చని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాగా ఈ వ్యాపారి టీ స్టాల్ తో పాటు ఫైన్సాన్స్ ల వద్ద బీజేపికి చెందిన రాష్ట్ర నాయకులతో పాటు కేంద్రమంత్రి ఫోటో, హిందూ విశ్వపరిషత్ నేతలతో దిగిన ఫోటోలు కూడా వున్నాయి. అయితే బీజేపీతో కిషోర్ కు మంచి సంబంధాలున్నాయని కూడా తెలుస్తుందని సమాచారం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles