కార్మికులకు కార్లు గిఫ్ట్ ఇచ్చే వ్యాపారి.. అది మర్చి ఇలా.. Diamond baron who gifted cars to staff evaded paying EPF

Diamond baron who gave his employees cars and flats caught evading their provident fund

Surat diamond baron,Savjibhai Dholakia,issued notice,fund evasion allegation,Employee Provident Fund Organisation,car and flats as Diwali bonus, Hare Krishna Exports

A diamond baron, who stunned the corporate world by gifting hundreds of cars, flats and jewellery to his employees as Diwali bonus, is in news again. But this time, for the wrong reasons.

కార్మికులకు కార్లు గిఫ్ట్ ఇచ్చే వ్యాపారి.. అది మర్చి ఇలా..

Posted: 12/18/2016 11:48 AM IST
Diamond baron who gave his employees cars and flats caught evading their provident fund

ఉద్యోగుల్ని ఉద్యోగిగా కూడా గుర్తంచని యజమానులు వున్న ఈ రోజుల్లో ఉద్యోగులను కన్న బిడ్డల్లా చూసుకునే వ్యక్తి గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన వజ్రాల వ్యాపారి సావ్జీ దోలాకియా. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు దీపావళి కానుకగా కార్లు, ఫ్లాట్లు, బంగారు ఆభరణాలు ఇచ్చి కార‍్పొరేట్‌ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాడు. ఇలా అయన ప్రతీ ఏటా తన కార్మికులకు బహుమానాలు ప్రకటిస్తునే వుంటారు. అయితే వాటిలో ఇళ్లు, కార్లు మాత్రం అమ్మకాలలో ముందువరుసలో నిలచిన ఉద్యోగులకే చెందుతాయి. ఇలా ఆయన చేస్తున్న దీపావళి బోనస్ తో మీడియాలో ఆయన పేరు మార్మోగిపోయింది.

అయితే సావ్జీ తాజాగా మరోసారి వార్తల్లోకెక్కాడు. ఈ సారి దానగుణంతో గాక ఉద్యోగులను మోసం చేసినట్టు అపవాదు ఎదుర్కొన్నాడు. వినడానికి విచిత్రంగానే వున్నా ఇది నిజం. ఏకంగా ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ కు చెందిన సంస్థ నుంచి కూడా ఆయన ఈ మేరకు తఖీదులు అందుకున్నాడు. హరే కృష్ట ఎక్స్‌పోర్ట్స్‌ చైర్మన్‌ అయిన సావ్జీ.. తన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల ఈపీఎఫ్‌ ఖాతాల్లో జమచేయాల్సిన 16.66 కోట్ల రూపాయలను చెల్లించలేదు.

ఈపీఎఫ్‌ఓ సూరత్‌ బ్రాంచ్‌.. సావ్జీ కంపెనీకి ఈ మేరకు నోటీసులు పంపింది. 15 రోజుల్లోపు ఈ మొత్తాన్ని వడ్డీతో సహా  చెల్లించాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, కంపెనీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేస్తామని హెచ్చరించింది. సావ్జీ కంపెనీలో 3165 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. కాగా పీఎఫ్‌ ఎగవేసేందుకు నిబంధనలకు విరుద్ధంగా తక్కువ మంది పనిచేస్తున్నట్టు చూపినట్టు ఆరోపణలు వచ్చాయి. చాలా ఏళ్లుగా ఆయన కంపెనీలో పనిచేసే ఉద్యోగుల పీఎఫ్‌ చెల్లించడం లేదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Diamond baron  Savji Dholakia  Hare Krishna Exports  EPFO  provident fund organisation  

Other Articles