‘వ్యతిరేక’ వేధింపుల ఫలితమే రోహిత్ వేముల ఆత్మహత్య Pawan Kalyan question BJP on Rohit vemula suicide issue

Rohith vemula s protest was within democratic means pawan kalyan

pawan kalyan, rohit vemula, hcu university, PhD scholar, BJP, HRD Ministry, Smriti Irani, Dalit scholar, University of Hyderabad, Jana Sena Party, narendra modi, venkaiah naidu, vemula rohith, twitter, tweet, jana sena, cow slaughter, partiotism, demonetisation, special status to ap

Continuing his 'surgical strike' on BJP, Tollywood actor and Jana Sena Party Chief Pawan Kalyan hit out at the saffron party for its alleged treatment of Rohith Vemula, the PhD scholar in University of Hyderabad

‘వ్యతిరేక’ వేధింపుల ఫలితమే రోహిత్ వేముల ఆత్మహత్య: పవన్ కల్యాన్

Posted: 12/16/2016 04:08 PM IST
Rohith vemula s protest was within democratic means pawan kalyan

కేంద్రంలోని ప్రధాని నరేంద్రమోడీ ప్రభుత్వంపై మరోమారు తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ఫీలాసఫీకి చెందిన విద్యార్థి.. అంబేద్కర్ విద్యార్థి సంఘం నేత రోహిత్ వేముల అత్మహత్య అంశంపై ఆయన బీజేపి ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించారు. విద్యార్థుల విమర్శలను కూడా కేంద్రంలోని బీజేపి ప్రభుత్వం అంత సీరియస్ గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరముందా..? అని ప్రశ్నించారు. విద్యార్థి వ్యతిరేకతను వ్యక్తిగతంగా తీసుకోవడంతోనే రోహిత్ వేముల ఆత్మహత్యకు కారణమయ్యిందని పవన్ అరోపించారు.

దేశంలోని ఎంతో మంది వ్యతిరేకించినట్లుగానే రోహిత్ వేముల కూడా బీజేపి పార్టీని, పార్టీ విధానాలన్ని వ్యతిరేకించారు. అయితే ఆయన తన ఊహాజనితమైన సామ్యవాద సమాజం నుంచి బయటకు తీసుకువచ్చేందుకు మానవీయ కోణంలో అలోచించే ఓ విద్యార్థి కౌన్సిలర్ ను అతని చెంతకు పంపితే బాగుండేదని, అలా కేంద్రప్రభుత్వం వ్యవహరించి వుండి వుండి దేశానికి ఒక ఫిలాసఫీలో ఎంఫిల్ చేసిన ఓ నిపుణుడు సేవలందించేవాడని పవన్ అభిప్రాయపడ్డారు.

రోహిత్ వేముల ఆత్మహత్య కు పాల్పడటానికి కేంద్రం కారణమని అరోపించిన ఆయన విశ్వవిద్యాలయం నుంచి వెళ్లిపోమ్మని చెప్పడం, అంతకు ముదుగానే అతడ్ని తరగతుల నుంచి సస్పెండ్ చేయడం కూడా కారణాలుగా మారాయన్నారు. ఇక విశ్వవిద్యాలయ యాజమాన్య చర్యలతో మానసికంగా అందోళనకు గురైన రోహిత్ వేములకు తన వర్గానికి చెందిన వారి నుంచే మద్దతు లభించకపోవడం ఆయన మానసిక పరిస్థితిని మరింత దిగజార్చిందని పవన్ అన్నారు. దీంతోనే అయన ఆత్మహత్యకు పాల్పడ్డారని అన్నారు.

రోహిత్ వేముల ప్రజాస్వామ్య యుతంగానే బీజేపిపై తన వైఖరిని వ్యక్తపర్చినా దానిని నెపంగా తీసుకుని అతన్ని వేధించేందుకు మాత్రం ప్రభుత్వాలకు ఎవరూ లైసెన్సులు ఇవ్వలేదని పవన్ అన్నారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థి సంఘాల మధ్య చోటుచేసుకునే ఘటనను కేంద్రం పెద్ద మనస్సులో మారుతున్న విద్యార్థి లోకం ఐడియాలజీగా పరిగణించేందుకు బదులు పగబట్టి మరీ వేధించే చర్యలను పూనుకోవడం అసమంసమని అన్నారు. విద్యార్థి సంఘాలు యూనివర్సిటీలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించి సందర్బంలో తీసుకోవాల్సిన క్రమశిక్షణా చర్యలు.. ముందుగానే తీసుకోవడం కూడా రోహిత్ వేముల మరణానానికి కారణంగా పవన్ అభిప్రాయపడ్డారు.

రోహిత్ అత్మహత్య ఘటనపై బీజేపి వ్యతిరేక పార్టీలన్నీ తమ మైలేజీ కోసం పాకులాడుతుంటే.. బీజేపి మాత్రం అసలు రోహిత్ వేముల దళితుడా కాదా..? అన్న అంశాన్ని తేల్చడంలో తలమునకలై విమర్శలు ప్రతివిమర్శలలో మునిగాయే తప్ప.. బంగారు భవిష్యత్తు వున్న యువమేధావులను ఎలా పరిరక్షించుకోవాలన్న అలోచనను మాత్రం ఏ పార్టీలు చేయలేదని పవన్ ధ్వజమెత్తారు. ఏదో ఒక రోజు దేశంలోని విశ్వవిద్యాలయాలన్నీ ప్రస్తుతం కనిపించే విధంగా రాజకీయపార్టీలకు యుద్ద క్షేత్రాలుగా కాకుండా విజ్ఞాన బాండాగారాలుగా మారుతాయని, అ రోజు కోసం వేచి చూద్దామని అన్నారు.

 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  rohit vemula  hcu university  PhD scholar  BJP  HRD Ministry  Jana Sena Party  

Other Articles