చిత్తశుద్ది వుంటే బీజేపి పాలితరాష్ట్రాలలో గోవధను నిషేదించాలి.. Pawan Kalyan Makes Statements on Cow Slaughter

Pawan kalyan makes statements on cow slaughter

pawan kalyan, narendra modi, venkaiah naidu, vemula rohith, twitter, tweet, jana sena, cow slaughter, rohith vemula, partiotism, demonetisation, special status to ap

JanaSena Party chief and mega star Pawan Kalyan who had supported BJP and TDP in 2014 elections took on Twitter to communicate and expose BJP led central government on cow slaughter issue.

దమ్ముంటే గోవాలో గోవధను నిషేదించాలి.. బీజేపికి పవన్ సవాల్

Posted: 12/15/2016 07:30 PM IST
Pawan kalyan makes statements on cow slaughter

గత సార్వత్రిక ఎన్నికలో బేషరుత్తు మద్దుతు ఇచ్చి.. తన శక్తి మేరకు కేంద్రంలో బీజేపి ప్రభుత్వం వచ్చేందుకు శ్రమించి, ప్రచారం చేసిన జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఎన్నికల హామీలలో భాగంగా రాష్ట్రానికి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదాకు కేంద్రం తిలోదకాలు ఇవ్వడంతో.. ఇప్పుడా పార్టీతో పూర్తిగా తెగదెంపులు చేసుకునేందుకు రంగం సిద్దం చేసుకున్నట్లు కనబడుతుంది. ఇటీవల నిర్వహించిన తిరుపతి సభలో బీజేపీతో పోత్తు పెట్టుకోనని తెగేసి చెప్పిన పవన్.. ఇక ఆ పార్టీపై విమర్శనాస్త్రాలను ఎక్కుపెట్టారు.

సోషల్ మీడియా అనుసంధానమైన ట్విట్టర్ వేదికగా ఆయన బీజేపిపై తీవ్రంగా మండిపడ్డారు. గోవధ అంశంపై చిత్తశుద్ధి ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బీఫ్‌ను ఎందుకు నిషేధించలేదని జనసేనాని ప్రశ్నించారు. బీజేపికి నిజంగా దమ్ముంటే గోవాలో గోవధ నిషేధాన్ని అమలు పర్చవచ్చు కాదా..? అని ప్రశ్నించారు. దీంతో గో మాంసం తీనేవారికి..గోవును దైవ్యంగా అరాధించే వారికి మధ్య ప్రభుత్వమే చిచ్చుపెడుతున్నట్లు వుందని ఆయన అందోళన వ్యక్తం చేశారు.

బీజేపీ గోవధపై నానాయాగీ చేయకుండా వాళ్ల పార్టీకి చెందిన పార్లమెంటు సభ్యులను, అన్ని రాష్ట్రాల శాసనసభ్యులను లెదర్ బూట్లు, బెల్టులు వాడకూడదని అదేశాలు జారీ చేయవచ్చు కదా అని అయన ప్రశ్నించారు. ఇక గోవుపై అంత ప్రేమ కనబర్చే గో సంరక్షణ సమితీలు తమ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యులు, నాయకులు, కార్యకర్తలను గోవులను దత్తత తీసుకోవాలని అదేశాలను జారీ చేసి వుండవచ్చు కదా అని ఆయన ప్రశ్నించారు.

గోవధ జరిగిపోతుందంటూ నానా హైరానా చేసి, అమాయకులపై దాడులు జరిపి.. వారిచేత గోపంచకాన్ని తాగించడం, లాంటి హేయకరమైన చర్యలకు పాల్పడటం కంటే ఇలాంటి మార్గాల ద్వారా గోవధను అరికట్టవచ్చుకదా అని అయన సూచించారు. ఇప్పటికే పలుమార్లు బహిరంగ సభల్లో తీవ్ర విమర్శలు గుప్పించిన పవన్ బీజేపీపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు. గోవధ, రోహిత్‌ వేముల, దేశభక్తి, నోట్ల రద్దు, ఏపీకి ప్రత్యేక హోదా సహా ఐదు అంశాలపై ప్రశ్నించనున్నట్లు పవన్ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేశారు.

ఇకపై రోజుకో అంశంపై స్పందిస్తానని పవన్‌ స్పష్టం చేశారు. శుక్రవారం రోజున రోహిత్‌ వేముల అంశంపై స్పందిస్తానని ట్విట్టర్‌లో జనసేన అధినేత పవన్‌ వెల్లడించారు. దీంతో పవన్ అభిమానుల్లో, పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం రెట్టింపయ్యింది. ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్ ఆ పని చేయట్లేదన్న విమర్శలకు చెక్ పెట్టినట్లయింది. ఇప్పుడు పవన్ అసలు రూట్‌లోకి వచ్చారని రాజకీయ నిపుణులు చెప్పుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pawan kalyan  narendra modi  vemula rohith  twitter  jana sena  cow slaughter  

Other Articles