‘మాంజా’ దారంపై నిషేధం విధించారు | interim nationwide ban on manja.

Manja thread ban in india

NGT ban Manja, Manja thread, Manja Kites Thread, Kites Manja, Maanja Kites, Kites Festival Manja, Manja Kites, Kites Manja Ban, National Green Tribunal ban Manja, Interim ban Manja

NGT imposes interim nationwide ban on manja for flying kites.

ఆధా(దా)రం లేకుండానే గాలి పటాలు

Posted: 12/15/2016 10:32 AM IST
Manja thread ban in india

చిన్నా పెద్దా తేడాలేకుండా అన్ని వర్గాలు ఎంజాయ్ చేయగల ఆటల్లో ఒకటి గాలి పటాలు ఎగరేయటం. సంక్రాంతి సీజన్ వచ్చిందంటే చాలూ దేశ ప్రజలందరి దృష్టి ఆటోమేటిక్ గా వాటిపైకి మళ్లుతుంది. అందుకు తగ్గట్లే కైట్స్ ఫెస్టివల్స్ నిర్వహిస్తుంటారు. అదే టైంలో దాని మీద బిజినెస్ కూడా కోట్లలోనే జరుగుతుంటుంది. ఇక వాటికి ఉపయోగించే ప్రత్యేక తాడు ‘మాంజా’కైతే మరీను.

అయితే దేశ వ్యాప్తంగా ఆ దారంపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. ‘మాంజా’పై పూసే గాజు, లోహాల పొడి పూత మనుషులకు, జంతువులకు, పర్యావరణానికి చాలా హాని చేస్తుందని గ్రీన్ ట్రైబ్యునల్ పేర్కొంది. దుష్ప్రభావాలను కలగజేసే ‘మాంజా’ను నిషేధించాలని కోరుతూ న్యాయవాదులు సంజయ్ హెగ్డే, షాదన్ ఫరాసత్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రైబ్యునల్ చైర్మన్ స్వతంత్రకుమార్ ఆధ్వర్యంలోని బెంచ్ ఈ మేరకు ఆదేశాలిచ్చింది.

మాంజా దుష్ప్రభావాలపై జాతీయ కాలుష్య నియంత్రణ మండలికి ఒక నివేదిక అందజేయాలని భారత మాంజా సంఘాన్ని ఈ సందర్భంగా గ్రీన్ ట్రైబ్యునల్ ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చే ఏడాది ఫిబ్రవరి 1వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది. అయితే విచారణ మిగిలి ఉన్నందున ఈ నిర్ణయాన్ని తాత్కాలికంగానే భావించాల్సి ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manja Thread  Kites Festival  NGT Ban  

Other Articles