పార్లమెంటు ‘పాత’ ముచ్చట.. జనసభలో ‘నోట్ల’ ముచ్చట.. PM says Opposition won't let him speak in Lok Sabha, so he's addressing Jan Sabha

Pm says opposition won t let him speak in lok sabha so he s addressing jan sabha

BJP, Congress, Deesa, Demonetisation, Gujarat, India, Modi, parliament, Winter session, country, tolerate, black money, counterfeit currency,

PM Modi addressed a farmers' rally in Deesa, Banaskantha district in Gujarat, raised the issue of demonetisation and the lack of support from the Opposition in Parliament over this move.

పార్లమెంటు ‘పాత’ ముచ్చట.. జనసభలో ‘నోట్ల’ ముచ్చట..

Posted: 12/10/2016 05:46 PM IST
Pm says opposition won t let him speak in lok sabha so he s addressing jan sabha

పాత పెద్ద నోట్లను రద్దు చేసిన తరువాత ఈ అంశాన్ని పార్లమెంటులో చర్చించాలని తమ ప్రభుత్వం కృతనిశ్చయంతో వుందని, అందుకనే వారం రోజులు కూడా తిరక్కుండానే తాము పార్లమెంటు సమావేశాలు ఏర్పాటు చేశామని, అయితే పార్లమెంటులో విపక్షాలు చర్చను జరగనీయకుండా చేస్తున్నాయని దాంతో తాను ప్రజల్లోకి వచ్చి జన సభల్లో మాట్లాడుతున్నానని ప్రధానమంత్రి  నరేంద్రమోదీ అన్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఉభయ సభలు నోట్ల రద్దు అంశంపై ప్రతిరోజు స్థంభింపజేస్తున్న ప్రతిపక్షాలపై మండిపడిన అయన అది పాత ముచ్చటేనని, తాను తీసుకున్న నిర్ణయానికి జనామోదం వుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అవినీతి రహిత భారతావని కోసం తాను తీసుకున్న నిర్ణయాలను నేరుగా ప్రజల్లోకి వెళ్లి వెల్లడిస్తున్నానన్నారు. పేద‌ల వికాసం కోస‌మే పెద్దనోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేశారు. అవినీతికి వ్యతిరేకంగా, నల్ల డబ్బు వ్యతిరేకంగా, నకిలీ కరెన్సీకి వ్యతిరేకంగా  పోరాటం చేస్తున్నట్టు మోదీ చెప్పారు. గుజ‌రాత్‌లో బనస్కాంత జిల్లా పరిధిలోని  దీసాలో జరిగిన ఓ రైతుస‌భ‌లో మోదీ పెద్ద నోట్ల రద్దును పూర్తిగా సమర్థించుకన్నారు.  దేశాన్ని ప‌ట్టిపీడిస్తోన్న న‌ల్లధ‌నాన్ని నియంత్రించడానికే  ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ప్రజలు బ్యాంకులు, ఏటీఎంల ముందు నిల‌బ‌డి రైతులు, సామాన్యులు తమ స‌మ‌యాన్ని వృథా చేసుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని, బ్యాంకర్లు ఈ-వ్యాలెట్‌ల ద్వారా బ్యాంకుల‌నే మీ మొబైల్ ఫోన్ల‌లోకి తీసుకొచ్చారని చెప్పారు. వాటిని ఉపయోగించుకుంటూ నగదురహిత లావాదేవీలు జ‌ర‌పాల‌ని పిలుపునిచ్చారు. అయితే ప్రజల తక్షణ అవసరాల కోసం మాత్రం రూ.100నోట్లను సరఫరాను పెంచామని ప్రధాని చెప్పారు. ఇక న‌ల్లధ‌నం దాచుకున్న అక్రమార్కులు ఒక్కరు కూడా త‌ప్పించుకోవడానికి వీల్లేద‌ని ప్రజలు కోరుకుంటున్నార‌ని అన్నారు. తాము అధికారంలోకి వ‌చ్చాక రైతుల జీవితాల్లో మార్పులు తీసుకొచ్చామ‌ని అన్నారు.

ఈ నిర్ణయంతో అటు దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు కూడా తగ్గుముఖం పట్టాయని, ఇటు దేశ అంతర్గ భద్రతకు సవాలుగా పరిణమించిన మావోయిస్టులు కూడా దిక్కుతోచని పరిస్థిత్లో వున్నారని మోడీ అన్నారు. నల్లధనంపై పోరులో 50  రోజులు గడువు అడిగాం.. ఇపుడు ఎలాంటి మార్పులు వస్తున్నాయో మీరు చూస్తున్నారని మోదీ చెప్పారు. నకిలీ కరెన్సీని, అవినీతిని దేశం ఎట్టి పరిస్తితుల్లోనూ సహించదు. ఈ విషయంలో ప్రజల అశీర్వాదాలు కావాలంటూ ప్రజలనుద్దేశించి మోదీ కోరారు. ఇపుడు ప్రజల శక్తి బలం పెరుగుతోందని ప్రధాని అకాంక్షించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : BJP  Congress  Deesa  Demonetisation  Gujarat  India  Modi  parliament  

Other Articles