మరింత బలోపేతం అవుతున్న వార్ధ.. Vardah may cross close to Nellore or Ongole on Dec 12

Vardah may cross close to nellore or ongole on dec 12

Bay of Bengal, cyclonic storm, featured, Odisha, Warda, Vardah, India Meteorological Department, Depression, Warda cyclone, Andhra Pradesh, cyclonic storm, visakhapatnam, Nicobar islands, Port Blair

Cyclone Vardah will make landfall close to Nellore or Ongole on December 12, a red alert has been sounded for Kavali, Allur, Chinnaganjam and surrounding areas as they stand to be the most affected by the storm.

మరింత బలోపేతం అవుతున్న వార్ధ.. కలవరపడుతున్న కోస్తా

Posted: 12/10/2016 12:41 PM IST
Vardah may cross close to nellore or ongole on dec 12

‘వార్దా’ తుపాను సస్పెన్స్ థ్రిల్లర్ లా కొనసాగుతూ.. కోస్త్రా ప్రజలను మరింత కలవరపాటుకు గురిచేస్తుంది. గంట గంటకూ బలపడుతూ కోస్తాంధ్ర వైపు కదులుతున్న ఈ తుఫాను పెను తుఫానుగా మారుతోంది. తక్కువ వేగంతో పయనిస్తూ ఎక్కువ ప్రభావం చూపబోతోందని భారత వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఈ నెల 12న నెల్లూరు లేదా ఒంగోలు తీరప్రాంతాల్లో తీరం దాటే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో తుఫానుతో ప్రభావితం కానున్న ప్రాంతాల్లో రెడ్ అలర్డ్ ప్రకటించారు.

నెల్లూరు మచిలీపట్నం తీర ప్రాంతాల మధ్య వార్థా తీరం దాటే అవకాశముందని, దీంతో తీర ప్రాంతాలైన కావలి, అల్లూర్, చిన్నగంజాం పరిసర ప్రాంతాల్లో హై అలెర్ట్ ప్రకటించారని చెప్పారు. కాగా తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూర్, కడప, చిత్తూర్ జిల్లాలో అధికంగా వుండగా, అటు తమిళనాడులోని తిరువల్లూర్, కాంచీపురం, వెళ్లూర్ జిల్లాలకు కూడా వార్ధా ప్రభావానికి గురవుతాయని తెలిపారు. ఈ జిల్లాల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అధికారులు స్పష్టం చేశారు.

ఆగ్నేయ బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఈ తుపాను ప్రస్తుతం విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 950, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 1,050 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈ నెల 11 వరకు తీవ్ర తుపానుగానే కొనసాగుతుందని, అనంతరం కాస్త బలహీన పడుతూ కోస్తాంధ్ర తీరం వైపు వస్తుం దని తెలిపింది. 12న మధ్యాహ్నానికి లేదా సాయం త్రానికి ఆంధ్రప్రదేశ్‌లోని మచిలీపట్నం – నెల్లూరు మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వివరించింది. దీని ప్రభావంతో శని, ఆదివారాల్లో కోస్తాంధ్రలో గంటకు 90 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బలమై న పెను గాలులు వీయవచ్చని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఐఎండీ హెచ్చరించింది. సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని సూచించింది

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles