హైదరాబాదీ నల్లకుబేరుడి ‘ఉత్త’ ముచ్చట.. hyderabadi realtor ids declaration turns out a hoax

Hyderabadi realtor rs10000 crore ids declaration turns out a hoax

income tax, Rs10000 crore, ids declation, Banapuram Lakshman Rao, B Ramadevi, FilmNagar, Hyderabad, IT raids, BLR Builders and Developers, RTC Cross Roads, Ramanthapur, Devara Yamjal, Hakimpet, Telangana

The declaration of Rs10,000 unaccounted income by a city-based businessman under the Central government's Income Declaration Scheme (IDS) has turned out to be a hoax.

హైదరాబాదీ నల్లకుబేరుడి ‘ఉత్త’ ముచ్చట..

Posted: 12/07/2016 12:18 PM IST
Hyderabadi realtor rs10000 crore ids declaration turns out a hoax

తాంబూలాలిచ్చాం.. తన్నుకు చావండీ అన్నట్లు పలు సందర్భాలలో వ్యవహరించే ప్రభుత్వ అధికార వర్గాలకు అదే తరహాలో పంచ్ ఇచ్చాడు హైదరాబాద్ కు చెందిన ఓ రియల్టర్. తెలంగాణలోని హకీంపేటకు చేరువలో వున్న దేవర యంజాల్ కు చెందిన లక్ష్మణ్ రావు.. బిఎల్ అర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థకు ఎండీగా వున్నారు. ఈ సంస్థలో అయన సతీమణి రమాదేవీ కూడా డైరెక్టరుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దుతో ఆయన తన వద్దనున్న పెద్ద నోట్లను ఏం చేయాలో తెలియలేదు.

కేంద్ర చిట్టచివరి సారిగా అంటూ తాజాగా ప్రకటించిన స్వచ్చంధ అదాయ వెల్లడి ఫథకంలో భాగంగా తన వద్ద పది వేల కోట్ల రూపాయల నల్లధనం వుందని ఆయన ఏకంగా ఆదాయ పన్ను శాఖకు వెలువరించారు. అయితే, నిబంధనల ప్రకారం ఆ మొత్తానికి కట్టాల్సిన ట్యాక్స్ తొలి వాయిదాను ఇంతవరకు ఆయన చెల్లించలేదు. దీంతో, ఐటీ అధికారులు ఫిలింనగర్ లోని ఆయన ఇంటిపై దాడులు జరిపిన అనంతరం షాక్ గురయ్యారు. మంగళవారం రాత్రి నుంచి ఇవాళ ఉదయం వరకు జరిపిన దాడుల్లో ఆయన ఇళ్లు, కార్యాలయాల్లో అధికారులు దాడులు నిర్వహించారు.

బీఎల్ఆర్ బిల్డర్స్ అండ్ డెవలపర్స్ సంస్థ తో పాటు మరో మూడు కంపెనీలకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్న లక్ష్మణ్ రావు 2014 మార్చి 31న రిజిస్ట్రార్ ఆఫ్ కంపెనీస్ వద్ద తమ ఆస్తులను వారు ఫైల్ చేశారు. దాని ప్రకారం వారి ఆస్తి రూ. 1.42 లక్షలు మాత్రమే. అయితే సాధారణంగా ఐటీ అధికారుల సోదాల్లో ఆదాయానికి మించిన నగదు, ఆస్తులు బయటపడతాయి. కానీ, లక్ష్మణరావు నివాసంలో మాత్రం మొత్తం సీన్ రివర్స్ అయింది.

ఎందుకంటే తన వద్ద రూ. 10వేల కోట్లు ఉన్నాయని ప్రకటించిన వ్యాపారి లక్ష్మణ్ రావు నుంచి అదాయపన్ను శాఖ అధికారులు జరిపిన దాడుల్లో లెక్క తేలింది మాత్రం రూ. 1.42 లక్షలే. సరిగ్గా ఆయన 2014లో ప్రకటించినట్లుగానే. ఈ మొత్తం వుంది. దీంతో ఆయనతో పాటు అయన కార్యాలయాలకు చెందిన అధికారులను, బంధువులను కూడా అదాయపన్ను శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. దీంతో ఆయన వద్ద నల్లధనం వుందన్న ముచ్చట ఉత్తదేనని తేలిపోయింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : income tax  Rs10000 crore  ids declation  Banapuram Lakshman Rao  FilmNagar  Hyderabad  IT raids  

Other Articles