అమ్మ సలహదారుడు కూడా అపోలోనే చనిపోయాడు | A Day after Jayalalithaa's Death, Cho Ramaswamy Died at Age 82.

Cho ramaswamy passes away

Cho Ramaswamy, Tuglak Drama, Mohammed Bin Tuglak Editor, Tuglak Ramaswamy, Cho Ramaswamy Jayalalitha, Jayalalithaa Cho Ramaswamy, Actor Cho Ramaswamy, Journalist Cho Ramaswamy, Jayalalithaa adviser

Cho Ramaswamy passes away after prolonged illness at Chennai's Apollo Hospital.

‘తుగ్లక్’ రామస్వామి కన్నుమూత

Posted: 12/07/2016 07:44 AM IST
Cho ramaswamy passes away

సీనియర్ పాత్రికేయుడు, ప్రముఖ నటుడు చో రామస్వామి(82) మృతి చెందారు. అన్నాడీఎంకే అధినేత్రి, దివంగత జయలలిత క్లోజ్ ప్రెండ్ గానే కాదు, వ్యక్తిగత సలహాదారుడు ఈయనే. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అపోలో లో చికిత్స పొందుతూ బుధవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.

నటి రమ్యకృష్ణకు చో రామస్వామి స్వయానా మేనమామ. శ్రీనివాస్ అయ్యర్ ఆయన అసలు పేరు. తుగ్లక్ నాటకంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించుకోవటమేకాదు, మహ్మద్ బిన్ తుగ్లక్ పేరుతోనే స్థాపించబడిన ఓ పత్రిక ఎడిటర్ గా కూడా పని చేశాడు. ఎదుటివారు ఎవరైనా సరే ఉపేక్షించకుండా పదునైన విమర్శలు చేయటంలో ఆయన దిట్ట. తమిళనాడు మాజీ సీఎంలు జయలలిత, కరుణానిధి ఇద్దరితోనూ, మరో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయిన కామరాజ్ తోనూ ఆయనకు సన్నిహిత సంబంధాలున్నాయి. .

నాటకాల్లోకి రాకముందు ఆయన లీగల్ సలహదారుడిగా టీటీకే గ్రూప్ కు పని చేశారు. జయతో కలిసి ఆయన నాటకాల్లో, 57 సినిమాల్లో నటించారు. జయప్రకాశ్ నారాయణన్, ఎల్ కే అద్వానీ, చంద్రశేఖర్, నరేంద్ర మోదీ లాంటి రాజకీయ నేతలతో, రజనీకాంత్, కమల్ లాంటి దిగ్గజ నటులు ఆయన స్నేహితులు. జర్నలిజంలో ఆయన సేవలకు గానూ బీడీ గోయెంక అవార్డు కూడా దక్కింది. అంతేకాదు వాజ్ పేయి హయాంలో ఆయన రాజ్యసభకు కూడా ఎంపీగా నామినేట్ అయ్యాడు.తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న రామస్వామి కూడా అమ్మ చనిపోయిన అదే అపోలో ఆస్పత్రిలోనే చికిత్స పొందుతూ మృతి చెందడం గమనార్హం.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mohammed Bin Tuglak Editor  jayalalitha Adviser  Cho Ramaswamy Died  

Other Articles