అభిమానుల అశ్రునయనాల మధ్య అమ్మ అంతిమ యాత్ర Jayalalithaa last journey to merina beach

Jayalalithaa last journey from rajaji hall to merina beach

Jayalalithaa last journey, Jayalalithaa last rites, Jayalalithaa merina beach, Jayalalithaa last glimpse, president, pranab mukherjee, PM Modi, Narendra modi, Narendra modi pays tribute to jayalalithaa, jayalalithaa, pawan kalyan chennai, rajaji hall, pawan Kalyan, jayalalithaa demise

Jayalalithaa's body is now being taken to Marina Beach, a three-km journey from Rajaji Hall. She will be buried in a sandalwood casket and a sea of people has gathered already for the funeral.

అభిమానుల అశ్రునయనాల మధ్య అమ్మ అంతిమయాత్ర

Posted: 12/06/2016 04:21 PM IST
Jayalalithaa last journey from rajaji hall to merina beach

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అంతిమ యాత్ర అభిమానులు, నాయకులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషుల అశ్రునయనాల మధ్య సాగింది. చెన్నైలోని రాజాజీ హాలు నుంచి సుమారు మూడు కిలోమీటర్ల దూరంలో వున్న మెరినా బీచ్ వరకు లక్షలాధి మంది తరలిరాగా సాగింది. అమ్మను కడసారి చూపుకోసం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన లక్షలాధి మంది అభిమానులు వెంటరాగా, అమ్మ అంతిమ యాత్ర కోనసాగింది.

రాజాజీ హాలు నుంచి మెరినా బీచ్ వరకు రోడ్డుకు ఇరువైపులా వున్న లక్షలాధి మంది అభిమానులు అమ్మ అంతిమయాత్ర కోనసాగుతుండగా అమ్మ అమర్ రహే అంటూ దిక్కులు పిక్కటిల్లేలా నినాదాలు చేశారు. అమ్మ పార్థీవదేహాన్ని తరలిస్తున్న వాహనంపై పూలను జల్లారు. అమ్మ అంతియ యాత్ర నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం కూడా అమ్మ వాహనం వెంట కాలినడకన మెరినా బీచ్ కు చేరుకున్నారు.

అంతకుముందు ప్రజల సందర్శనార్థం జయలలిత పార్థీవ దేహాన్ని రాజాజీ హాలు వుంచగా, అమెకు ఘన నివాళులు అర్పించేందుకు ప్రధాని నరేంద్రమోడీ, రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, కేంద్ర మంత్రులు, గవర్నర్ కె విద్యాసాగర్ రావు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, జాతీయ స్థాయి రాజకీయ పార్టీలు నేతలు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫెడ్నావిస్, కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా ఎనమిది రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా అమ్మ కడసారి చూపుకు హాజరై శ్రధ్దాంజలి ఘటించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : PM Modi  jayalalithaa  last journey  merina beach  chennai  rajaji hall  Tamil Nadu  

Other Articles