విప్లవ నాయకి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత మరణం పట్ల సినీ నటుడు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. జయలలిత మరణం తనను తీవ్ర దిగ్భాంతికి గురి చేసిందని ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. అనారోగ్యంతో అస్పత్రిలో చేరిన ఆమె సంపూర్ణ ఆయురాగ్యాలతో తిరిగి ఇంటికి చేరుకుంటారని దేశ ప్రజలతో పాటు తానూ ఆశించానని.. అయితే అమె తిరిగిరాని లోకాలకు పయనమై అందరినీ తీవ్రదు:ఖంలో వదిలి వెళ్లారని ఆయన అన్నారు.
మూడు దశాబ్దాలకు పైగా తమిళనాడు, భారతదేశ రాజకీయాలపై జయలలిత చెరగని ముద్ర వేశారని అన్నారు. అమ్మ అనంతలోకాలకు వెళ్లడంతో తమిళ ప్రజలు ముఖ్యంగా పేద, బడుగు బలహీన వర్గాలు అనాధలయ్యారన్నారు. జయలలిత పేదల అభ్యున్నతి కోసమే అధికంగా శ్రమించారని, వారి ప్రగతే అశగా, శ్వాసగా జీవించారని.. అమె అములు పర్చిన సంక్షెమ పథకాలు సదా అనుసరణీయమని అయన అన్నారు.
‘అమ్మ’ మరణం తమిళనాడుకే కాక యావత్ దేశానికి తీవ్ర లోటు అని అన్నారు. అమ్మ లోటును ఎవరూ భర్తీ చేయలేనిదన్నారు, మరీ ముఖ్యంగా మహిళా శక్తికి ప్రభల నిదర్శనంగా అమ్మ నిలిచారని పేర్కోన్నారు. మహిళా అభ్యున్నతిని నిరంతరం కాంక్షిస్తూ అమె ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారన్నారు. ఆమెకు మన:పూర్వక అంజలి ఘటిస్తూ, పార్టీ తరపున సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more