మాయమైపోయాడమ్మా మనిషన్నవాడు.. చినిపోయినా పట్టించుకోరా..?! Demonetisation: Man dies in Bengal ATM queue

Kolkata man dies of cardiac arrest in bank queue

Hooghly district, Bandel, middle aged man, dead, Kallol Roy Chowdhury, demonetisation, ATM Queue line, Bank Queue lines, West Bengal

A middle-aged man who was standing in a queue outside an ATM in Hooghly district’s Bandel suffered sudden cardiac arrest and died on the spot.

మాయమైపోయాడమ్మా మనిషన్నవాడు.. చినిపోయినా పట్టించుకోరా..?!

Posted: 12/04/2016 10:59 AM IST
Kolkata man dies of cardiac arrest in bank queue

పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన కరెన్సీ కష్టాలు కొనసాగుతున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని ఓ నిండు గర్భిణీ తనకు నెలలు నిండినా.. అవసరానికి డబ్బులు కోసం రెండు రోజులు వరుసగా బ్యాంకుకు వెళ్లి అక్కడి పంజాబ్ నేషనల్ బ్యాంకులోనే క్యూలోని మహిళల సాయంతో పండంటి మగ బిడ్డను కన్న ఘటనను మరువక ముందే.. పశ్చిమ బెంగాల్ లో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకులు, ఏటీఎంల ముందు బారులు తీరుతూ ప్రజలు పడుతున్న కష్టాలు అసలు పట్టించుకోకుండా బ్యాంకులు అనుసరిస్తున్న విధానాలు సర్వత్రా విమర్శలు గుప్పుమంటున్నాయి.

సాధారణ అవసరాలకు సైతం చేతిలో డబ్బు అందుబాటులో లేకపోవడంతో సామాన్యుల సమయం గంటల కొద్ది క్యూ లైన్లలోనే గడిచిపోతుంది. ఇలాంటి పరిస్థితినే ఎదుర్కోని పశ్చిమ బెంగాల్‌లో ఓ వ్యక్తి విషాదంతం చెందాడు. హుగ్లీలో ఏటీఎం క్యూ లైన్లో నిలుచున్న ఓ 52 ఏళ్ల వ్యక్తి అక్కడే కుప్పకూలాడు. చాలా సమయం లైన్లో నిలుచున్న అతడికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో మృతి చెందాడు. బాధతో విలవిలలాడుతున్నా అతడితో పాటు లైన్లో ఉన్నవాళ్లు చూసీచూడనట్లుగా వదిలేసి.. డబ్బుకోసం ముందుకు కదిలారనే విమర్శలు వినిపిస్తున్నాయి.

దేశంలోని 80 శాతం ఏటీఎంలలో కొత్త నోట్లు ఉంచడానికి అవసరమైన మార్పులు చేశాం అని అధికారులు చెబుతున్నప్పటికీ కరెన్సీ కష్టాలు మాత్రం తీరడం లేదు. ఎక్కడ చూసినా మూసివేసిన, నో క్యాష్ బోర్డులు ఉంచిన ఏటీఎంలే కనిపిస్తున్నాయి. డబ్బు ఉన్న కొద్దిపాటి ఏటీఎంల వద్ద క్యూ లైన్లలో వృద్ధులు, మహిళలు నానా అవస్థలు పడుతున్నారు. నోట్టు రద్దు ప్రకటనలో 50 రోజులు కావాలని ప్రధాని అడిగగా, అందులోంచి సగం రోజులు గడిచిపోయినా.. పరిస్థితిలో ఎలాంటి మార్పు రాలేదన్నది వాస్తవమని ఈ ఘటన చాటిచెబుతున్నది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles