టాక్సీ డ్రైవర్ అకౌంట్లోకి మళ్లీ రూ.999 కోట్ల డబ్బు.. Cabbie Balwinder Singh Account Was Credited With Rs 999 Cr Again

Cabbie balwinder singh account was credited with rs 999 cr again

Taxi driver Balwinder Singh, Jan Dhan account, Rs 999 crore, State Bank of Patiala, Barnala, freak, taxi driver, Rs 98 billion, Rs 9806 crores, Pradhan Mantri Jan Dhan Yojana, punjab

Remember the cabbie whose account got credited with Rs 98,05,95,12,231 on 4th November? Well, his account is still citing an outstanding balance of Rs 999 crore.

టాక్సీ డ్రైవర్ అకౌంట్లోకి మళ్లీ రూ.999 కోట్ల డబ్బు..

Posted: 12/01/2016 11:23 AM IST
Cabbie balwinder singh account was credited with rs 999 cr again

బీజేపి ప్రభుత్వం పెద్ద నోట్ల రద్దు చేస్తూ తీసుకున్న చారిత్రక నిర్ణయంతో దేశంలోని అనేక మంది ప్రజలు డబ్బుల కోసం ఈ నెల 10 నుంచి నేటి వరకు వెంపర్లాడుతూనే వున్నారు. ఏటియంలలో డబ్బులు లేని మిషన్లు వెక్కిరిస్తూ కనబడటం.. ఇక బ్యాంకుల పెద్ద క్యూలలో నిల్చోని డబ్బులు తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అయితే ఈ నిర్ణయం ముందుగానే తెలిసి జాగ్రత్త పడ్డారో.. లేక బ్యాంకు పోరబాటో తెలియదు కానీ మొత్తానికి పంజాబ్ లోని ఓ టాక్సీ డ్రైవర్ ను మాత్రం ఏక్ దిన్ కా సుల్తాన్ గా మార్చేసింది. ఆ విషయం మాకు తెలుసు అంటున్నారా..? అక్కడికే వస్తున్నాం..

పంజాబ్‌లోని బర్నాలతో ప్రాంతంలో నివసించే టాక్సీ డ్రైవర్ బల్వీందర్ సింగ్..గుర్తున్నాడు కదూ.. అయనే నండి ఒక్క రోజులో 9వేల 8 వందల కోట్ల రూపాయలకు అధిపతిగా మారి.. మరుసటి రోజున మళ్లీ యధావిధిగా టాక్సీ డ్రైవర్ గా మిగిలాడు. అయితే తన అకౌంట్ లో ఇంత డబ్బు వుందని చూసుకుని మురిసే లోపు ఆయనకు తెలియకుండానే ఆ డబ్బంతా కనుమరుగైంది. ఇది ఈనెల 4న జరిగిన ఘటన. ఈ ఘటన మిగిల్చని అనుభూతితో ఇంకా షాల్ లోనే వున్న బల్విందర్ కు అలాంటిదే మరో ఘటన ఎదురైంది.

అయితే, తాజాగా ఆయ‌న అకౌంట్లోకి మ‌రో రూ.999 కోట్లు వచ్చిపడ్డాయి. అదెలా జరుగుతుంది. ఈ నెల 4న జరిగిన తప్పిదాన్ని బ్యాంకు అధికారులు సమరించిన పిమ్మట కూడా అదే తరహాలో మళ్లీ తప్పు దోర్లడం.. అదెలా సాధ్యం అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. అసలు జరిగిందేంటంటారా.. ఈ నెల 19న త‌న బ్యాంకు ఖాతాలో రూ.167 డిపాజిట్‌ అయినట్లు ఆయ‌న‌ మెసేజ్ అందుకున్నాడు.

అనంత‌రం త‌న‌ బ్యాంక్‌ బ్యాలన్స్ తెలుపుతూ మరో మెసేజ్ కూడా అందుకున్నాడు. దీంతో మ‌రోసారి షాక్ కి గుర‌య్యాడు. ఈ సారి ఆయ‌న ఖాతాలో రూ.999 కోట్లు ఉన్నట్లు తెలుసుకొని బ్యాంకు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లగా ఈసారి కూడా పొరపాటే జరిగిందని చెప్పారు. సాంకేతిక కారణాలతో ప‌దే ప‌దే ఆయ‌న ఖాతాలో కోట్ల కొద్దీ డ‌బ్బు ప‌డుతుండ‌డంతో తాత్కాలికంగా అతని బ్యాంక్‌ ఖాతాను మూసివేస్తున్న‌ట్లు బ్యాంకు అధికారులు చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles