సంపన్నుడైన టాక్సీ డ్రైవర్.. జన్ ధన్ ఖాతాలోకి 98 వేల కోట్లు.. taxi driver got Rs 9806 crore in his Jan Dhan account

Taxi driver got rs 9806 crore in his jan dhan account

Taxi driver Balwinder Singh, Jan Dhan account, State Bank of Patiala, Barnala, freak, taxi driver, Rs 98 billion, Rs 9806 crores, Pradhan Mantri Jan Dhan Yojana, punjab

Taxi driver Balwinder Singh was surprised beyond words when he woke up on November 4 to discover that a sum of Rs 98 billion had been credited into his State Bank of Patiala (account.

ITEMVIDEOS: సంపన్నుడైన టాక్సీ డ్రైవర్.. జన్ ధన్ ఖాతాలోకి 98 వేల కోట్లు..

Posted: 11/29/2016 10:03 AM IST
Taxi driver got rs 9806 crore in his jan dhan account

రెక్కాడితే కానీ డోక్కాడని కష్టజీవి.. బీజేపి ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా ఆయన స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలాలో అతడికి ప్రధానమంత్రి జనధన యోజన కింద ఒక అకౌంటు తెరిచాడు. అవసరానికి ఉపయోగపడతాయని తన ఖాతాలో సుమారు మూడు వేల రూపాయలను దాచుకున్నాడు. ఈ నెల 4న బ్యాంకు నుంచి ఆయనకు ఒక బ్యాంకు నుంచి ఎస్ఎంఎస్ వచ్చింది. తన ఖాతాలో ఏకంగా 98,05,95,12,231.00 డబ్బు జమైందని దాని సారంశం. ఏంటీ విచిత్రం.. అని తనలో తాను సంబ్రమాశ్చారానికి లోనైన సదరు టాక్సీ డ్రైవర్ కు ఇంకా నమ్మశక్యం కాలేదు. ఇలోగా తన సంతోషం హరించుకుపోయింది. దీంతో బ్యాంకు చుట్టూ తిరిగిన అతన్ని బ్యాంకు అధికారులు షాకుల మీద షాకులిచ్చారు.

వివరాల్లోకి వెళ్తే.. టాక్సీ డ్రైవర్ బల్వీందర్ సింగ్.. పంజాబ్‌లోని బర్నాలతో ప్రాంతంలో నివసిస్తూ.. స్థానికంగా టాక్సీ నడిపిస్తూ జీవనం సాగిస్తుంటాడు. ఈనెల 4న ఉన్నట్టుండి అతడి ఖాతాలోకి దాదాపు 9806 కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. తన సెల్‌ఫోనుకు వచ్చిన ఎస్ఎంఎస్‌ను పదే పదే చూసుకుని నమ్మలేని అతని, సంభ్రమాశ్చార్యానికి గురయ్యాడు. కాగా, ఎలా వచ్చిన సోమ్ము అలా పోతుంది అని పెద్దలు అన్నట్లుగా.. ఆ మొత్తం డబ్బంతా మర్నాడే ఖాతాలోంచి వెళ్లిపోయింది.
 
దీంతో బ్యాంకు వద్దకు వెళ్లి అరా తీసిన అతనికి బ్యాంకు అధికారులు షాక్ ఇచ్చారు. ఈ నెల 7న బ్యాంకుకు వెళ్లి అధికారులను వాకాబు చేయగా, తన పాత పాస్ బుక్ తీసుకుని కొత్త పాస్ బుక్ అతని చేతికిచ్చారు. అయితే అందులో ఈ 9806 కోట్ల రూపాయలకు సంబంధించిన ఎంట్రీ లేదని బల్వీందర్ చెప్పాడు. సాధారణంగా అయితే తన అకౌంటులో 3వేల రూపాయలు ఉంటుందని, ఆ మొత్తం తనది కానే కాదని స్పష్టం చేశాడు. దీనిపై బ్యాంకు మేనేజర్ రవీందర్ కుమార్‌ను వివరణ ఇచ్చేందుకు నిరాకరించారు.
 
లీడ్ బ్యాంకు మేనేజర్ సందీప్ గార్గ్ మాత్రం దీనిపై వివరణ ఇచ్చారు. అతడి అకౌంటులోకి రూ. 200 క్రెడిట్ ఎంట్రీ చేసేటప్పుడు ఒక అసిస్టెంట్ మేనేజర్ పొరపాటున బ్యాంకుకు చెందిన 11 అంకెల ఇంటర్నల్ బ్యాంకింగ్ జనరల్ లెడ్జర్ అకౌంటు నంబర్ కూడా వేసేశారని, అందువల్ల ఆ మొత్తం వచ్చినట్లు కనిపించిందని చెప్పారు. మర్నాడు ఈ తప్పును తెలుసుకుని మళ్లీ సరిచేశామని వివరించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Taxi driver  Balwinder Singh  Jan Dhan account  State Bank of Patiala  Barnala  punjab  

Other Articles