పంజాబ్ జైలుపై సాయుధుల దాడి, 4 ఉగ్రవాదుల పరారీ Punjab jailbreak: High alert in Northern states

Armed men storm nabha jail take away klf chief mintoo

Punjab, Nabha Jail, Patiala, Punjab jailbreak, 10 armed men, jail break, Nabha jail, Punjab, Khalistan Liberation Force, KLF chief Harminder Singh Mintoo, terrorist, gangsters

A group of armed men in police uniform attacked the Nabha Jail in Patiala on Sunday and fled with six prisoners including Khalistan Liberation Front chief Harminder Mintoo.

పంజాబ్ జైలుపై సాయుధుల దాడి, 4 ఉగ్రవాదుల పరారీ

Posted: 11/27/2016 01:58 PM IST
Armed men storm nabha jail take away klf chief mintoo

భోపాల్‌ కేంద్ర కారాగారం నుంచి ఇటీవల ఎనిమిది సిమీ ఉగ్రవాదులు తప్పించుకొని పారిపోతూ.. పోలీసుల ఎన్ కౌంటర్ లో హతాశులైన ఘటనను మరువకముందే పంజాబ్‌ జైలు నుంచి ఉగ్రవాలు తప్పించుకుని పారిపోయారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసు దుస్తుల్లో వచ్చిన సాయుధులు పంజాబ్‌లోని నభా జైలు అధికారులపై విరుచుకుపడి ఖలీస్థాన్‌ లిబరేషన్‌ ఫోర్స్‌ చీఫ్‌ హర్మిందర్‌ సింగ్‌ అలియాస్‌ మింటూతోపాటు మరో నలుగురిని విడిపించుకొని తీసుకెళ్లారు.

అయితే దుండగులు ముందస్తు ప్రణాళికలో భాగంగా అందరూ పోలీసుల దుస్తుల్లో జైలుపై తెగబడ్డారని తెలుస్తుంది. పోలీసుల దుస్తుల్లో వుండటంతో కొంత ఏమరుపాటుగా వున్న పోలీసులను గమనించి జైలుపై దాడి చేసి తమ వారినీ తప్పించారు. కాగా, ఉగ్రవాదుల దాడిలో పారిపోయిన మింటూతో పాటు గుర్‌ప్రీత్‌ సింగ్‌, విక్కీ గోండ్రా, నితిన్‌ డియోల్‌, విక్రమ్‌జీత్‌ సింగ్‌ అలియాస్‌ విక్కీలు కూడా గ్యాంగ్‌స్టర్లే కావడం గమనార్హం.

ఖలీస్థాన్‌ చీఫ్‌ను జైలు నుంచి విడిపించుకొని వెళ్లేందుకే ఈ దాడి జరిగినట్టు భావిస్తున్నారు. ఖలీస్థాన్‌ చీఫ్‌ జైలు నుంచి పరార్‌ కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. పంజాబ్‌లో వేర్పాటువాద చిచ్చును రగిలిస్తున్న ఖలీస్థాన్‌ చీఫ్‌ను 2014 నవంబర్‌లో ఢిల్లీ విమానాశ్రయంలో అరెస్టు చేశారు. పంజాబ్‌లో అల్లకల్లోలం సృష్టించేందుకు మింటూ పాకిస్థాన్‌ ఐఎస్‌ఐ నుంచి థాయ్‌లాండ్‌లో శిక్షణ పొందాడని పోలీసులు గుర్తించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles