పెద్దనోట్ల రద్దు, డబ్బు విత్ డ్రా పరమితులపై పవన్ కల్యాన్ అగ్రహం Why Not Our MPs Stand In Bank Queues? questions pawan kalyan

Why not our mps stand in bank queues questions pawan kalyan

Demonetisation, Pavan Kalyan retired employee, balaraju, heart attack,, kurnool, Andhra Pradesh, demonetisation, cash withdrawals, cash withdraw limits, Arun Jaitley, BJP MPs, Finance Ministry, Rs 2000 notes, Rs 2000 notes original, banks, ATMs, Rs 500, Rs 1,000, notes exchange, RBI, new Rs 500 notes, Currency Ban, notes ban

power star Pavan Kalyan was very much pained at the death of a retired employee who died of heart attack when he was standing in queue at the State Bank of India in Kurnool.

పెద్దనోట్ల రద్దు, డబ్బు విత్ డ్రా పరమితులపై పవన్ కల్యాన్ అగ్రహం

Posted: 11/26/2016 07:19 PM IST
Why not our mps stand in bank queues questions pawan kalyan

పెద్ద‌నోట్ల ర‌ద్దు నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం విధించిన విత్ డ్రా పరిమితులు, నగదు మార్పిడి పరిమితులతో దేశవ్యాప్తంగా అనేక మంది ప్ర‌జ‌లు ప‌డుతున్న క‌ష్టాలపై మనస్సున్న మనిషిగా ప్రముఖ సినీనటుడు, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాన్ మొద‌టిసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కర్నూలులోని ఓ ఎస్బీఐ శాఖ ముందు క్యూలో నిల‌బ‌డి బాలరాజు అనే వ్య‌క్తి మ‌ర‌ణించాడ‌ని ఆయ‌న‌ కుటుంబానికి సానుభూతి తెలిపుతున్నాన‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. నోట్ల రద్దు అంశం తెరపైకి రాగానే దేశవ్యాప్తంగా మరణించిన 80పైచిలుకు మంది మరణాలకు ఆయన సానుభూతి వ్యక్తం చేశాడు,

కేంద్రం తీసుకున్న నిర్ణయంపై విమర్శలను ఎక్కు పెట్టకుండానే.. ఆయన తనదైన శైలిలో సన్నాయి నోక్కులు నొక్కారు. ఈ మరణాలపై కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతో పవన్ మాత్రం తనదైన శైలిలో మరణాలపై స్పందించారు. కర్నూలు జిల్లాలో గుండెపోటుతో మరణించిన బాల‌రాజు ఫొటోను కూడా ప‌వ‌న్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. తన డబ్బులు తాను తీసుకోవడానికి బాల‌రాజు మూడు రోజులుగా ప్రయత్నించార‌ని, అయిన‌ప్ప‌టికీ డ‌బ్బు దొర‌క‌లేద‌ని చివ‌రికి బ్యాంక్‌లోనే మృతి చెందార‌ని చెప్పారు. పార్ల‌మెంటు స‌భ్యులు ప్రజల కష్టాలని ప‌ట్టించుకోవాల‌ని పవన్ అన్నారు.

ప్ర‌జ‌ల‌కి సంఘీభావం తెలపడానికి బీజేపి పార్లమెంటు సభ్యులు బ్యాంకుల దగ్గర క్యూలో నిలబడాల‌ని పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని బీజేపీ ఎంపీలు ప్ర‌జ‌ల‌తో పాటు ఏటీఎమ్‌లు, బ్యాంకు ముందు నిల‌బ‌డి, తమ మద్దతు ప్రకటిస్తే జ‌నాల‌కి ధైర్యంగా ఉంటుందని ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ యోధుడు, క్యూబా మాజీ అధినేత ఫెడల్ క్యాస్ట్రో మృతి పట్ల కూడా పవన్ సంతాపం తెలిపారు. గొప్ప నేత‌ ఫెడల్‌ క్యాస్ట్రో ఈ రోజు ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్లార‌ని, ప్రజల్లో స్పూర్తిని నింపిన ఆయ‌న‌కు త‌మ పార్టీ సెల్యూట్ చేస్తోందని ఆయ‌న ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. తాము అమితంగా అభిమానించే చెగువేరాతో క‌లిసి క్యాస్ట్రో చేసిన‌ పోరాటాన్ని గుర్తు చేసుకుంటున్నామని, క్యూబన్ల ప్రజారోగ్యం కోసం ఆయన అమితంగా కృషి చేశార‌ని పవన్ ట్విట్ట‌ర్‌లో పేర్కొన్నారు. క్యాస్ట్రో ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్న‌ట్లు ప‌వ‌న్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Demonetisation  Pavan Kalyan retired employee  balaraju  heart attack  kurnool  Andhra Pradesh  

Other Articles