యువరాజ్ కు కన్న తండ్రి షాక్.. పెళ్లికి రానుంటున్న యోగ్ రాజ్ సింగ్ Yograj to give son Yuvraj Singh's wedding a miss

Yuvraj singh s father yograj singh won t attend son s wedding

Yuvraj Singh, yuvraj singh wedding, yuvraj singh's father not to attend wedding, yuvraj singh's father yograj singh, Yuvraj Singh hazel keech wedding, yuvraj singh wedding details, Fatehgarh Sahib gurdwara, punjab

Indian cricketer Yuvraj Singh will tie the knot with model and Bollywood actress Hazel Keech on November 30 at a gurdwara in Fatehgarh Sahib in Punjab, without the presence of his father Yograj Singh.

పెళ్లికి నాలుగు రోజుల ముందు యువరాజ్ కు తండ్రి షాక్..

Posted: 11/26/2016 04:53 PM IST
Yuvraj singh s father yograj singh won t attend son s wedding

మరో నాలుగు రోజుల్లో బాలీవుడ్ నటి హజల్ కీచ్ తో వివాహం చేసుకునేందుకు అన్ని ఏర్పాటు పూర్తి చేసుకుని పెళ్లి కోడకు అలంకారకృతుడవుతున్న టీమిండియా డాషింగ్ ఓపెనర్ యువరాజ్ సింగ్ కు ఆయన తండ్రి యోగ్ రాజ్ సింగ్  షాక్ ఇచ్చాడు. ఈ నెల 30న పంజాబ్ లోని  ఫతేగఢ్ సాహిబ్  గురుద్వారాలో జరగనున్న తన కొడకు వివాహానికి తాను హాజరుకాబోనని చెప్పాడు. కొన్ని సంవత్సరాల క్రితం యువరాజ్ సింగ్ తల్లి షబ్నమ్,  తండ్రి యోగరాజ్ విడిపోయారు కాబట్టి ఆయన ఈ వివాహానికి హాజరుకావడం లేదా..? అని అనుకుంటున్నారా..? అయితే మీరు పోరబడ్డారు.

సంప్రదాయ బద్ధంగా జరుగుతున్న తన కుమారుడు యువరాజ్ సింగ్ పెళ్లికి రానని యువరాజ్ తల్లికి ముందే సమాచారం ఇచ్చానని వివరించారు. ఇది తన దురదృష్టమనీ యోగరాజ్ వ్యాఖ్యానించారు. మరెందుకు యోగ్ రాజ్ సింగ్ తన కొడుకు వివాహానికి హాజరుకావడం లేదో తెలుసా..? ఆయనకు దేవుడి మీద భక్తి ఉన్నప్పటికీ, మత గురువుల మీద నమ్మకం లేదట అందుకనే మతపెద్దల సమక్షంలో గురుద్వారాలో జరుగుతున్న ఈ పెళ్లికి తాను హాజరుకాబోనని ఆయన తేల్చిచెప్పారు. విధి అలావుందని.. కాకపోతే, యువరాజ్ కోరిక మేరకు నవంబరు 29 న హోటల్ లలిత్  వద్ద జరిగే  మెహిందీ  ఫంక్షన్ కు హాజరవుతానని చెప్పారు.

అయితే యువరాజ్ కాబోయే  భార్య హాజెల్ ను మాత్రం  ఆయన ప్రశంసలతో  ముంచెత్తారు. ఆమె   దేవతలాంటిదన్నారు. పాశ్చాత్య సంస్కృతిలో పెరిగినా   సంప్రదాయ విలువలకు, పద్ధతులకు ప్రాముఖ్యత  ఇస్తుందని  చెప్పారు. తమ    ఆమె కుటుంబంలో సానుకూల మార్పులు తీసుకొస్తుందని నమ్ముతున్నానన్నారు.  ఇతర సోదరీ మణులును ఒక చోటుకి చేరుస్తుందనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.  అలాగే యువరాజ్ , హాజెల్  దంపతులు కుటుంబంలోని మిగిలిన పిల్లలకు తల్లిదండ్రుల్లా వ్యవహరించాలని కోరుకుంటున్నానంటూ ముగించారు. అందరూ చట్టబద్ధ వివాహాలకు ప్రాధాన్యత ఇవ్వాలని, విలాసవంతమైన వివాహాలకు స్వస్తి పలకాలని  సూచించారు. పెళ్లళ్లలో  కోట్లాది  రూపాయల వృధా ఖర్చులకు అందరూ దూరంగా ఉండాలని యోగరాజ్ సింగ్ కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Yograj Singh  Yuvraj Singh  hazel keech  wedding  Fatehgarh Sahib gurdwara  punjab  

Other Articles