ప్రియుడితో ‘‘పాత బాకీ’’ తీర్చుకున్న ప్రియురాలు.. Woman spots ex-lover in bank queue gets him thrashed

Woman settles old score with ex lover after spotting him in bank queue

queue outside a bank, Jilted lover, Girlfriend, Ex-Lover, demonetization, boyfriend, Trimbak Road, Nashik, missing lover found in bank queue, Union government, Currency exchange, demonetisation, RBI, rbi demonetisation, atm demonetisation, atm withdrawal charges, india news

A 27-year-old former girlfriend, spotted her ex-boyfriend, who ditched her after proposing marriage years back, in a serpentine queue outside a bank in Nashik settles old scores with him.

బ్యాంకు క్యూలో అదృశ్యమైన ప్రియుడు.. ‘‘పాత బాకీ’’ తీర్చుకున్న ప్రియురాలు..

Posted: 11/25/2016 01:32 PM IST
Woman settles old score with ex lover after spotting him in bank queue

ఎవరు చేసిన కర్మ వారనుభవించక ఎవరికైనా తప్పదన్నా! అన్న తత్త్వగీతం ముమ్మాటికీ నిజమని, దానిని నుంచి ఎవరూ తప్పించుకోలేరని కూడా ఈ ఘటన రూడీ చేస్తోంది. పెద్దలు చెప్పినట్లు విధి రాతను ఎవరూ తప్పించలేరన్నది కాదనలేని నిజం. ఇలా విధి రాతను తప్పించుకుందామని నాలుగేళ్ల పాటు ప్రయత్నం చేసినా.. చివరకు కర్మను అనుభవించక తప్పలేదు ఆ ప్రియుడికి. అందులో భాగంగా అస్పత్రిపాలై చికిత్స పోందుతున్నాడు. ఏమిటీ విధి విచిత్రం, కర్మ ఫలం అంటారా..?

మ్యాటర్ లోకి ఎంటైరయితే.. ఓ అమ్మాయిని తన మాయమాటలతో వలలో వేసుకన్నాడు. ప్రేమించానన్నాడు.. నువ్వు లేకుండా ఉండలేనన్నాడు.. పెళ్లి చేసుకుంటానన్నాడు.. యువతి తరపు పెద్దలు కూడా అంగీకారం తెలిపి.. యువకుడి పెద్దలతో మాట్లాడుతామని చెప్పారు. అంతే అప్పటి నుంచి ఆ యువకుడు అదృశ్యమయ్యాడు. ఏంటీ తన ప్రియుడికి ఏమైంది.. అన్న అందోళన యువతిలో కనిపించింది. తమ కుటుంబసభ్యల సహాయంతో యువతి పోలిస్ స్టేషన్ లో కూడా పిర్యాదు చేసింది.


ఇలా రమారమి ఐదేళ్లు గడిచింది. పాత పెద్ద నోట్ల రద్దు నేపథ్యంలో వాటిని మార్చుకుందామని యువతి నాసిక్ లోని త్రయంబకేశ్వర్ రోడ్డులోని బ్యాంకు అప్ ఇండియా బ్యాంకు వచ్చి క్యూ లైన్లో నిలబడింది. అక్కడ ఎవరో యువకుడ్ని చూసి అచ్చం తన ప్రియుడి లాగే వున్నాడని అనుకుంది. వెంటనే క్యూ లైను నుంచి తప్పుకుని చాటుగా వచ్చి యువకుడ్ని కొంత దూరంగా పరిశీలించింది. అవును అతను ముమ్మాటికీ తన ప్రియుడేనని నిర్థారించుకుంది.

అంతే అతను లైను నుంచి వెళ్లిపోకుండా ఓ కంట కనిపెడుతూనే.. మరో వైపు తన తండ్రికి, సోదరుడికి ఫోన్ చేసింది. అమె కుటుంబసభ్యులు వచ్చి రావడంతోనే యువకుడిపై దాడికి చేశారు. చావ చితకోట్టి పోలిస్ స్టేషన్ కు తీసుకెళ్లారు. కేసును నమోదు చేసుకున్న పోలీసులు.. తీవ్రంగా గాయపడిన యువకుడిని చికిత్స నిమిత్తం అస్పత్రికి తరలించారు. అయితే పెద్ద నోట్లు రద్దుతో తప్పించుకుని తిరుగుతున్న మాయల మారాఠీలు కూడా దోరుకుతున్నారని పురజనులు వ్యాఖ్యానించుకుంటున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles