మోదీ, జైట్లీకి అంత సీన్ లేదు.. ముమ్మాటికీ తప్పు ఆయనదే | Bank officers union calls for Urjit Patel's resignation.

Rbi governor to resign for demonetisation

RBI Governor, Urjit Patel, Bank Officers' Union, D Thomas Franco, Urjit Patel D Thomas Franco

Bank Officers' Union Wants RBI Governor Urjit Patel To Resign For Demonetisation.

నోట్ల నేరం ఇప్పుడు ఆయన మెడకు చుట్టుకుంది

Posted: 11/22/2016 10:02 AM IST
Rbi governor to resign for demonetisation

కరెన్సీ వ్యవహారం అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు ఆర్బీఐ గవర్నర్ ఉర్జిత్ పటేల్ మెడకు చిక్కుకుంది. ముందు చూపు లేకుండా తీసుకున్న నిర్ణయం, తద్వారా జరగుతున్న పరిణామాలకు కారకుడు ఉర్జిత్ పటేల్ అంటూ ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఆయన తక్షణమే రాజీనామా చేయాలన్న డిమాండ్ కూడా బలంగా వినిపిస్తోంది.

డబ్బులు మార్చుకునేందుకు లైన్ లో నిల్చుని జనాలు మాత్రమే చనిపోవటం లేదు, ఈ పని ఒత్తిడితో ఇప్పటిదాకా 11 మంది బ్యాంకు ఉద్యోగులు కూడా చనిపోయారని ఆల్ ఇండియా బ్యాంకర్ల సమాఖ్య ఉపాధ్యక్షుడు డాక్టర్ థామస్ ఫ్రాంకో తెలిపారు.

ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీలు ఆర్థిక వేత్తలు కారని, ఓ ఆర్థికవేత్తగా ప్రస్తుత ఆర్బీఐ గవర్నర్‌ ఉర్జిత పటేల్‌, నోట్ల రద్దు వంటి అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకోవడంలో ఘోరంగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. రద్దు చేసే ముందు రోడ్‌ మ్యాప్‌ కరవైందని, ప్రస్తుతం ఆర్థిక వ్యవస్థలో కొనసాగుతున్న గందరగోళానికి, సామాన్య ప్రజల ఆందోళన, మరణాలకూ ఇదే కారణమని ఆయన అన్నారు.

రూ. 500 నోట్లు లేకుండా రూ. 2 వేల నోట్ల విడుదల నిర్ణయం అత్యంత తప్పిదమని చెప్పిన ఫ్రాంక్, రూ. 2 వేల నోట్లు సిద్ధం చేసే బదులు రూ. 500 నోట్లను, రూ. 100 నోట్లను రెడీ చేసివుంటే పరిస్థితి ఈ స్థాయికి దిగజారేది కాదని అంచనా వేశారు. నోట్ల సైజు తగ్గించాలని భావించినప్పుడు ఏటీఎంలలో వాటిని సర్దుబాటు చేసే అంశం గుర్తుకు రాకపోవడం వింతగా ఉందని ఫ్రాంకో వ్యాఖ్యానించారు. ఆపై పొంతన లేని ప్రకటనలు రోజుకొకటి చేస్తూ, ప్రజలను ఆర్థిక శాఖ, ఆర్బీఐ తీవ్ర గందరగోళంలోకి నెడుతున్నాయని, అన్నింటికీ బాధ్యత వహించి ఉర్జిత్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

కాగా, గత శుక్రవారం ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరులో ఓ ఎస్బీఐ బ్యాంక్ ఉద్యోగి(46 ఏళ్లు) నోట్లు మార్చుకునేందుకు వచ్చిన క్యూని పర్యవేక్షించే క్రమంలో ప్రాణాలు వదిలాడు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Urjit Patel  D Thomas Franco  Demonstration  Resignation  

Other Articles