సిమ్ కార్డుతో ప్రియుడి ప్రాణాలు పోతాయి | SIM card war kills lover in Warangal.

Sim card kills lover in warangal

Warangal couples, SIM card war, SIM card kills lover, Hanmakonda lover SIM card, SIM card lovers, Lovers clash

SIM card war between lovers, man dies after fall in water.

సిమ్ కార్డుతో లవర్ ప్రాణాలు పోయాయి

Posted: 11/17/2016 11:47 AM IST
Sim card kills lover in warangal

క్షణికావేశంలో తీసుకునే నిర్ణయాలు ఒక్కోసారి విపరీతానర్థాలకు దారితీస్తుంటాయి. అలాంటి సమయంలో ఓపిక వహించాలే కానీ, తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు. ఇక్కడ చిన్న పొరపచ్చుతో ఓ ప్రేమికుడు తీసుకున్న నిర్ణయం అతని ప్రాణాలనే అనంతవాయువుల్లో కలిపేసింది. ఓ సిమ్‌కార్డ్ విషయమై జంట మధ్య చెలరేగిన గొడవ ప్రేమికుడి ప్రాణం తీసింది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లా నారాయణగిరికి చెందిన కల్పనకు మహబూబాబాద్‌ జిల్లా గార్లకు చెందిన ఇందర్‌సింగ్‌కు ఫేస్‌ బుక్‌ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం ప్రేమకు దారితీసింది. డిగ్రీ పూర్తి చేసిన ఇందర్‌సింగ్‌కు గత జనవరిలోనే కల్పనతో పరిచయమైంది. ఇద్దరు తరచూ వరంగల్ లోనే కలుసుకునేవారు. రెండు రోజుల క్రితం పద్మాక్షీ గుండం దగ్గర మెట్లపై కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్న సమయంలో సిమ్ ఎందుకు మారుస్తున్నావంటూ కల్పనతో ఇందర్ గొడవకు దిగాడు.

ఆమె సిమ్ కార్డును లాక్కోని నీటిలో పడేస్తానంటూ బెదిరించి, ఆ ప్రయత్నంలో నీళ్లలో పడిపోయాడు. ఇత రాకపోవటంతో ప్రాణాల కోసం కొట్టుకుండగా, ప్రేయసి సాయం కోసం అరిచిన చుట్టుపక్కల ఎవరూ లేకపోవటంతో అతని ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Warangal  Lovers  SIM card war  kills youth  

Other Articles