త్వరలో రూ.1000కే రిలయన్స్ జియో 4జీ ఫోన్.. Jio To Launch Cheapest 4G Smartphones

Reliance jio to launch cheapest 4g smartphones priced around rs 1 000

Reliance Jio 4g smart phones, Reliance Jio cheapest 4g phones, Jio 4g smart phones, Jio cheapest 4g phones, unlimited voice, video calling, Jio Broadband services, Jio fiber optic cables, Jio FTTH, Jio Mediashare, Jio TV, Reliance Jio internet, reliance, jio, smartphones, mobiles, 4g

Reliance Jio is soon to hit the smartphone market by bringing about the cheapest 4G enable smartphones, priced at just Rs. 1,000 by early 2017.

త్వరలో రూ.1000కే రిలయన్స్ జియో 4జీ ఫోన్..

Posted: 11/16/2016 06:02 PM IST
Reliance jio to launch cheapest 4g smartphones priced around rs 1 000

4జీ మొబైల్‌ సర్వీసులతో భారత టెలికం ఇండస్ట్రీ రంగాన్ని ఒక కుదుపు కుదిపేసిన రిలయన్స్ జియో.. మరో సంచలనానికి కూడా తెరలేపనుంది. ఇప్పటికే ఉచిత కాల్స్, ఉచిత డేటాతో ఒక్కసారిగా పోటీదారులకు కునుకును కరువు చేసిన రిలయన్స్‌ మరో విప్లవాత్మక మార్పుకు సన్ధం అవుతోంది. దేశంలోని ఇప్పటికీ 2జీ ఫోన్లును వినియోగిస్తున్న ప్రజలను కూడా తన వైపు తిప్పుకునేందుకు రెడీ అవుతుంది. సరికోత్త 4జీ ఫోన్లను అత్యంత చౌకైన ధరకు అందించనుంది. వచ్చే ఏడాది తొలినాళ్లలోనే వీటిని ప్రజల అందుబాటులోకి తీసుకురానుంది.

దీంతో కొత్త కేటగిరీ ప్రజలను సొంతంచేసుకుని, లక్షల కొలదీ కస్టమర్లను ఆకట్టుకోవడానికి ఫీచర్ ఫోన్ల లాంచింగ్ ఎంతో సహకరిస్తుందని ఈ టెలికాం వెంచర్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ భావిస్తోంది. మార్కెట్లోకి తీసుకురాబోతున్న ఈ కొత్త తరం డివైజ్లలో రెండు వేరియంట్లను తీసుకురానుంది. వీటి ధర కూడా చాలా చౌకగా రూ.1000, రూ.1500గా ఉండనుందని, అయితే వీటిలో అపరిమితమైన వాయిస్ , వీడియో కాలింగ్, డిజిటల్ కంటెంట్ ఉంటాయని సమాచారం. ఎల్టీఈ, వాయిస్ ఓవర్ ఎల్టీఈ టెక్నాలజీతో ఫీచర్లు ఫోన్లను తీసుకొస్తుందని, ఈ ఫోన్లు ఎక్కువగా కాల్స్ కోసం వాయిస్ కాలింగ్ కోసం వాడే పేదలు, పెద్దలు, గ్రామీణ ప్రాంత కస్టమర్లను ఆకట్టుకుంటాయని పేర్కొంటున్నాయి.
 
అన్ని వర్గాల ప్రజలను తమ కస్టమర్లుగా మార్చుకోవడమే జియో ఉద్దేశ్యమని, మొదటిసారి డేటా వాడే కస్టమర్లను టార్గెట్ చేసుకుని ఈ డివైజ్లు మార్కెట్లోకి వస్తున్నాయని సంస్థ వర్గాలు పేర్కొన్నారు. కానీ రిలయన్స్ జియో తీసుకొచ్చే ఫీచర్ ఫోన్లోనూ ఇక ఈ టెక్నాలజీ అందుబాటులోకి రానుంది. ఈ సరికోత్త ఫోన్లను జనవరి-మార్చిలో లాంచ్ చేసే అవకాశాలున్నాయి. వాటిలో టచ్ స్క్రీన్ మాత్రం వుండదని సమాచారం. ఈ తరుణంలో ఈ ఫోన్లు లాంచ్ అయితే దేశంలో ఎలాంటి విప్లవాత్మక మార్పులు వస్తాయన్నది వేచి చూడాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles