మైక్రో ఏటీయంలు అంటే ఏమిటీ..? ఎలా పనిచేస్తాయి.? Micro ATMs Help Solve the Cash Crunch?

What are micro atms and can they help solve the cash crunch

micro atms, demonitisation of notes, cash dispensing, rural parts of india, card swiping machines, bank correspondence, Secretary Shaktikanta Das, RBI, new Rs 500 notes, Nashik press, Currency Ban, notes ban, Rs 2,000 note, PM Modi, Narendra Modi, Prime Minister, Facebook, Twitter, War on Black Money, BJP, ATM queues, Bank queue, New Currency Notes, Exchange Old Currency Notes

What exactly are micro ATMs and how will they help people in areas that are hard to reach?

మైక్రో ఏటీయంలు అంటే ఏమిటీ..? ఎలా పనిచేస్తాయి.?

Posted: 11/14/2016 08:15 PM IST
What are micro atms and can they help solve the cash crunch

పెద్ద నోట్ల రద్దుతో దేశంలో ఏర్పడిన ఇబ్బందులను తొలగించేందుకు త్వరలోనే భారీ సంఖ్యలో మైక్రో ఏటీఎంలను ప్రవేశపెడతామని కేంద్రం స్పష్టం చేసిన నేపథ్యంలో అసలు ఈ మైక్రో ఏటీయంల పనితీరు ఎలా వుండబోతుందన్న సందేహాలు ప్రజల్లో రేకెత్తుతున్నాయి. అసలు మైక్రో ఏటీఎంలు అంటే ఏమిటీ..? అవి ఎలా పనిచేస్తాయి..? డబ్బులెలా వస్తాయి..? అన్న సందేహాలను నివృత్తికి ఇదిగో సమాధానం. నిజానికి మైక్రో ఏటీఎం అంటే.. కార్డు స్వైప్ చేసే పోర్టబుల్ యంత్రాలు. ఇన్నాళ్లు నగరంలోని పెట్రోల్ బంకులు, పెద్ద షాఫింగ్ మాల్ తదితర ప్రాంతాల్లో డబ్బులకు బదులు కార్డులతో పనికానిచుస్తుంటాయి,

ఈ కార్డు స్వైపింగ్ యంత్రాలకు జీపీఆర్ఎస్ కనెక్షన్ ఉంటుంది కాబట్టి.. డెబిట్ కార్డు స్వైప్ చేయగానే సంబంధిత బ్యాంకు నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవుతుంది. అందులో ఎంత బ్యాలెన్స్ ఉందో డిస్‌ప్లే అవుతుంది. అప్పుడు పరిమితిని బట్టి ఎంత మొత్తం విత్‌డ్రా చేయాలో అందులో ఎంటర్ చేసిన తర్వాత, అకౌంటు లోంచి ఆ మొత్తం తగ్గుతుంది. అప్పుడు ఆ పోర్టబుల్ యంత్రాన్ని తీసుకొచ్చిన వ్యక్తి.. ఆ మొత్తాన్ని తీసి ఇస్తాడన్న మాట. సాధారణంగా ఈ యంత్రాలను బిజినెస్ కరస్పాండెంట్లు తీసుకెళ్తారు.
 
సాధారణంగా ఒక ఏటీఎంలో రోజుకు 80-100 వరకు లావాదేవీలు జరుగుతాయి. వాటి నిర్వహణకు నెలకు దాదాపు రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. అద్దె, టెలికం చార్జీలు, వార్షిక నిర్వహణ, విద్యుత్ ఖర్చులు, సెక్యూరిటీ గార్డు వేతనం అన్నీ ఇందులో ఉంటాయి. అదే మైక్రో ఏటీఎం అయితే యంత్రం ఖరీదు రూ. 20వేల లోపే ఉంటుంది. దాన్ని చేత్తో తీసుకెళ్లిపోయే అవకాశం ఉంది కాబట్టి నిర్వహణ వ్యయం అంటూ ఏమీ ఉండదు. కేవలం చార్జింగ్ చేసుకుంటే సరిపోతుంది. దీన్ని జీఎస్ఎం సిమ్ కార్డుతో కూడా కనెక్ట్ చేసేందుకు వీలుంటుంది కాబట్టి, సిగ్నల్ వచ్చే ప్రతి ప్రాంతానికీ పంపొచ్చు.

అయితే, ఏటీయం కేంద్రాలలో డబ్బు ఉన్నంత వరకే వాటిని నుంచి డబ్బు విత్ డ్రా అయ్యే అవకాశం వున్నట్లే.. ఇక్కడ కూడా సంబంధిత బిజినెస్ కరస్పాండెంట్ (స్థానిక వ్యాపారులు, వేరే ఎవరైనా) వద్ద ఎంత మొత్తం ఉంటే అంతవరకు మాత్రమే ఇవ్వగలరు.  బ్రాంచిల నుంచి దూరంగా ఉండే ప్రాంతాలకు చెందిన కస్టమర్లకు కూడా బ్యాంకు సేవలు అందేందుకు వీలుగా వీటిని తొలుత ప్రవేశపెట్టారు. ముందు ఇందులో డిపాజిట్ల స్వీకరణకు వీలు కల్పించారు. ఇప్పుడు అవసరాన్ని బట్టి పాతనోట్ల స్వీకరణ, కొత్త నోట్లు ఇవ్వడం లాంటి లావాదేవీలు కూడా నిర్వహించేందుకు అవకాశం ఉంటుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles