ట్రంప్ గెలిస్తే.. వారెందుకు తట్టా,బుట్టా సర్ధుకుంటున్నారు.. Canada's immigration website crashes as Trump's election lead grows

Immigration website crashes as donald trump romps home to election victory

Hillary Clinton, Hillary first win, US Presidential Elections, election results, 45th president, canada immigration, canada, canada website, trump victory, America, democratic, republican, donald trump presidnet of US. american president donald trump

Data from Google suggests searches for ‘move to Canada’ spiked significantly during the night as Trump victories unfolded in key battleground states

అప్పుడు జోకులు వేసుకున్నారు.. మరి ఇప్పుడు..?!

Posted: 11/09/2016 08:57 PM IST
Immigration website crashes as donald trump romps home to election victory

అగ్రరాజ్యం అధ్యక్షుడిగా మరి కొన్ని రోజుల్లోనే పగ్గాలను అందుకోనున్న రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ అమెరికా ఎన్నికలకు ముందు చెప్పింది చెప్పినట్లుగా చేసిచూపాడు. ఈ నేపథ్యంలో ఎన్నికల సంగ్రామం మొదలైన నాటి నుంచి నిన్నటి రాత్రి వరకు జోకులు వేసుకున్న వారు ఇప్పుడు అందోళనకు గురవుతున్నారు. ఇక ట్రంప్ పై ఘాటు వ్యాఖ్యలు చేసిన వారు తట్టా, బుట్టా సర్ధుకుని వేరే దేశానికి పలాయనం అవుతున్నారు. వీరిలో ముఖ్యంగా విదేశీ ఉద్యోగులు పొరుగున వున్న కెనడాకు పయనం అవ్వాలని మొగ్గుచూపుతున్నారు. అగ్రరాజ్యం ఎన్నికలలో డెమొక్రటిక్ అభ్యర్థి హిల్లరీ గెలుస్తుందని అమె తరపున ప్రచారం ప్రత్యక్ష, పరోక్ష ప్రచారాన్ని నిర్వహించిన వాళ్లకు ఇప్పుడు నోట్లో పచ్చి వెలక్కాయ పడినట్లు అయ్యింది.

దీంతో వారు అమెరికా పోరుగున వున్న కెనడాకు పయనం కావాలని ప్రయత్నాలను ప్రారంభించారు. అయితే వారి ప్రయత్నాలకు అక్కడ కూడా చేధు అనుభవం ఎదురైంది. కెనడాకు వెళ్లాలన్న ప్రయత్నాలను కొనసాగిస్తున్న వారి సంఖ్య అసంఖ్యాకంగా మారడంతో.. కెనడా ఇమిగ్రేషన్ వెబ్ సైట్ క్రాష్ అయినట్టు తెలుస్తోంది. www.cic.gc.ca/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలని చూస్తుంటే, ఎర్రర్ మెసేజ్ వస్తోందని ప్రముఖ వార్తా సంస్థ రాయిటర్స్ పేర్కొంది. అమెరికా, ఆసియాలతో పాటు కెనడా యూజర్లకూ 'ఇంటర్నల్ సర్వీస్ ఎర్రర్' అన్న మెసేజ్ కనిపిస్తోందని పేర్కొంది.

ట్రంప్ టోర్నడో ఎఫెక్ట్ కెనడాపై కనిపిస్తోందని నిపుణులు వ్యాఖ్యానించారు. కాగా, వైట్ హౌస్ లో ట్రంప్ కాలుపెడితే, తాము కెనడాకు పారిపోతామని గతంలో పలువురు విదేశీ నిపుణులు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు, ట్వీట్లతో జోకుల మీద జోకులు వేసుకున్న సంగతి తెలిసిందే. ట్రంప్ గెలిస్తే, అమెరికన్లు సైతం కేప్ బ్రిటన్ ద్వీపానికి శరణార్థులుగా వెళ్లిపోవాలని కూడా వ్యాఖ్యలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే వీరందరి విమర్శలపై ప్రస్తత దేశ అధ్యక్షుడు ఏమైనా చర్యలు తీసుకుంటారా అన్న అందోళనతో వీరంతా దేశం విడిచి వెళ్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Hillary Clinton  donald trump  US Presidential Elections  45th president  America  

Other Articles