ప్రత్యేక హోదా మాకోద్దు అంటున్న ఏపీ వాసులు..congress praja ballot results on AP special status

Congress praja ballot results on ap special stauts

Raghuveera Reddy, Praja Ballot, Results, APPCC, special status, Andhra pradesh special status, congress praja ballot, chiranjeevi, congress

Andhra pradesh pcc president raghuveera reddy announces the results of praja ballot in ths state, says it is the priority of people of the state.

ప్రత్యేక హోదాను వద్దంటున్న ఏపీ వాసులు..

Posted: 11/08/2016 02:57 PM IST
Congress praja ballot results on ap special stauts

సార్వత్రిక ఎన్నికలకు ముందు నవ్యాంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలంటే తమ కూటమికే ఓటు వేయాలని, హోదాను సాధించాలంటే అది తమకే సాధ్యమని చెప్పకోచ్చని పార్టీలు అధికార పీఠమెక్కగానే స్వరం మార్చాయి. హోదా ఒక్కటే సంజీవని కాదు.. హోదా కన్నా ప్యాకేజీయే ముఖ్యమని, హోదాతో చేకూరని లబ్ది కూడా ప్యాకేజీతో చేకూరుతుందని మాయమాటలు చెబుతున్నారు. అయితే హోదా మా హక్కు అంటూ నినదిస్తున్న విపక్షాలను అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్రంలోని అధికార పక్షం కాని పట్టించుకున్న దాఖలాలు లేవు.

అయితే ప్రత్యేక హోదాపై పునర్విభజన సమయంలో పార్లమెంటులో వెంకయ్యనాయుడు, ఎన్నికల సమయంలో చంద్రబాబులు, ప్రచారంలో ప్రధాని నరేంద్రమోడీలు ఎం చేప్పారన్న విషయాలను ప్రజల్లోకి తీసుకెళ్లినా.. దానిని అటకెక్కించే ప్రయత్నంలో మాత్రం చంద్రబాబు సక్సెస్ అయ్యాడు. హోదాకు ప్యాకేజీని లింకు పెట్టి అంతకన్నా అధిక లభ్ది అని చాటడంలో సక్సెస్ అయ్యాడు. దీంతో రంగంలోకి దిగిన కాంగ్రెస్.. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ప్రజా బ్యాలెట్ నిర్వహించింది.

ప్రజా బ్యాలెట్ ఫలితాలను ఇవాళ ఏపీపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి వెల్లడించారు. ఏపీకి ప్రత్యేక హోదా అనే విషయంలో ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన పోలింగ్ లో పాల్గొన్న వారిలో 18693 మంది ఏపీకి ప్రత్యేక హోదా కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. కాగా 28 మంది తమకు ప్రత్యేక హోదా వద్దని ఓటు వేశారు. అయితే ప్రత్యేక హోదాతో ఏపీకి నష్టమేమిటన్నన విషయాన్ని మాత్రం వారు వెల్లడించలేదనిమాత్రమే హోదా వద్దు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారట. ఇదే క్రమంలో టీడీపీ ఎన్నికల హామీల విషయంలో... 18311 మంది హామీలు నెరవేరలేదని చెప్పగా 32 మంది మాత్రం హామీలు నెరవేరాయని ఓటేశారని ఆయన వివరించారు.

దీంతో ప్రత్యేక హోదాతోనే నవ్యాంధ్ర అభివృద్ధి చెందుతుందని ప్రజలు విశ్వసిస్తున్నారని రఘువీరారెడ్డి అన్నారు. తాము నిర్వహించిన ప్రజా బ్యాలెట్ తో ప్రజాభిప్రాయం స్పష్టంగా ప్రస్పుటించిందన్నారు. ఇప్పటికే ఏపీకి ప్రత్యేక హోదా ముగిసిన అధ్యాయం అని ప్రకటించి, సన్మానాలు చేసుకుంటున్న కేంద్ర మంత్రి వెంకయ్య, అంతకన్నా అధిక లబ్దిని చేకూర్చుతున్న ప్యాకేజీలకు బదులు తమ ప్రభుత్వ హయాంలో ప్రకటించిన హోదాను ఏపీకి వర్తింపజేయాలని డిమాండ్ చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Raghuveera Reddy  Praja Ballot  Results  APPCC  special status  

Other Articles