అన్నాడీఎంకే కార్యకర్తలకు మరో తీపి కబురు.. Jayalalithaa may be discharged in 15 days, given physiotherapy

Jayalalithaa may be discharged in 15 days given physiotherapy

jayalalithaa, tamilnadu chief minister, chennai apollo hospital, discharge, C Ponnaiyan, AIADMK

Tamil Nadu chief minister J Jayalalithaa may be discharged from Apollo Hospitals in less than 15 days, AIADMK spokesperson C Ponnaiyan said.

అన్నాడీఎంకే కార్యకర్తలకు మరో తీపి కబురు..

Posted: 11/08/2016 12:28 PM IST
Jayalalithaa may be discharged in 15 days given physiotherapy

జ్వరం, ఊపిరితిత్తులలో ఇన్ఫక్షన్ సోకడంతో సెప్టెంబర్ 22న చెన్నైలోని అపోలో అస్పత్రిలో చేరి.. సుమారు 49 రోజులుగా చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అరోగ్యం విషయమై అందోళన చెందిన అన్నాడీఎంకే వర్గాలకు మరో తీపి కబరు అందింది. మరో పక్షం రోజుల్లో అమ్మ ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యి.. ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమ్మ అరోగ్య విషయమై ఎలాంటి అందోళన అవసరం లేదని, అమె సాధారణ స్థితికి చేరుకుంటున్నారని అన్నాడీఎంకే వర్గాలు స్పష్టం చేశాయి. దీంతో పార్టీ కార్యకర్తలు, శ్రేణులు సంబరంలో మునిగారు.

ప్రస్తుతం వైద్యులు అమ్మకు ఫిజియోథెరపీ చేస్తున్నారని, మరో పక్షం రోజులు క్రమం తప్పకుండా దానిని నిర్వహించాల్సిన కారణంగా అమె 15 రోజుల తరువాత ఇంటికి చేరుకుంటారని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సి. పొన్నియన్ చెప్పారు. సీసీయూ నుంచి రూమ్‌లోకి మార్చే విషయంపై ఆయన సమాధానమిస్తూ.. అత్యవసర పరికరాలు లేనందున అమ్మను అస్పత్రి వర్గాలు సిసియులోనే వుంచాయన్నారు. అపోలో ఆస్పత్రుల చైర్మన్ ప్రతాప్ సి. రెడ్డి ప్రకటనపై కూడా స్పందించిన ఆయన.. పూర్తిస్థాయిలో అమ్మ కోలుకుని, మామూలు మనిషి అయిన తర్వాత మాత్రమే ఇంటికి వెళ్లాలని జయలలిత భావిస్తున్నట్లు పొన్నియన్ తెలిపారు.
 
అమ్మ ఆస్పత్రిలోనే మరికొన్ని రోజులు ఉంటే మంచిదని, బయట వాతావరణంలోకి వస్తే మళ్లీ ఇన్ఫెక్షన్లు వ్యాపించే ప్రమాదం ఉందని. ఈ క్రమంలో మళ్లీ వ్యాధి తిరగమోత పెట్టే ప్రమాదం కూడా వుంటుందని భావించి మరికోన్ని రోజుల అమ్మ అసుపత్రిలోనే వుంటే మంచిదని తాము బావిస్తున్నామని అయన చెప్పారు. ఇంటికి వెళ్లారంటే జయలలిత ఊరికే ఉండరని, మళ్లీ పూర్తిగా పనుల్లో నిమగ్నం అవుతారని, అందువల్ల ఆమె అలసిపోయే అవకాశం ఉన్నందున మరికొన్నాళ్ల పాటు ఆస్పత్రిలోనే విశ్రాంతి తీసుకుంటే మంచిదని పొన్నియన్ అన్నారు. అయితే అమ్మను కలిసేందుకు ఎవరినీ అనుమతించడం లేదని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jayalalithaa  tamilnadu chief minister  chennai apollo hospital  discharge  C Ponnaiyan  AIADMK  

Other Articles