‘జై జవాన్, జె కిసాన్’ ఆస్తి రాసిచ్చిన ఖేల్కర్.. Pune man pledges entire wealth to armed forces, farmers

Pune man pledges entire wealth to armed forces farmers

pune, pune man, pune mans will, pune man property, prakash kelkar, cotton expert, wealth, pune man will armed forces, pune man will farmers, donate property, farmers, maharastra news, india news

a 73-year-old retired cotton expert has pledged to give away his entire wealth to nation for the welfare of armed forces and farmers by executing a joint will with his wife.

‘జై జవాన్, జె కిసాన్’ ఆస్తి రాసిచ్చిన ఖేల్కర్..

Posted: 11/04/2016 01:29 PM IST
Pune man pledges entire wealth to armed forces farmers

ప్రార్థించే పెదల కన్నా సాయం చేసే చేతులు మిన్న అన్న నానుడి గ్రహించాడో.. లేక తాను తన దేశం కోసం ఏం చేశానని ప్రశ్నించుకున్నాడో తెలియదు కానీ.. ఓ 73 భారతీయుడు.. పత్తి నిఫుణిడిగా పనిచేసి పదవీ విరమణ పోందిన ప్రకాష్ ఖేల్కర్ అనే పెద్దాయన.. తనకు దేశం చాలా ఇచ్చిందని, తాను దేశానికి తనకున్నంతలో ఇలా చేస్తున్నాన్న సందేశాన్ని దేశప్రలకు ఇచ్చి అధర్శంగా నిలిచాడు. తన దేశం గర్వించేలా నిర్ణయాన్ని తీసుకున్నాడు. గల్లి స్థాయి నేతల నుంచి ఢిల్లీ స్థాయి నేతల వరకు అందరూ.. ప్రసంగాలకు పరిమితం కాగా, తాను మాటలు చెప్పను.. కేవలం చేతల్లోనే చూపుతాను అని తన నిర్ణయాన్ని తన సహధర్మచారిణితో కలసి సంయుక్తంగా ప్రకటించారు. ఈ మేరకు ఒట్టి మాటలే కాకుండా ఏకంగా వీలునామా కూడా రాశారు.

తన ఆస్తిలో ముప్పై శాతం వాటా ప్రధాన మంత్రి రిలీఫ్ ఫండ్ కోసం వినియోగించేందుకు రాస్తున్నామని, మరో 30 శాతం రైతుల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధికి అందజేస్తున్నామని, మిగిలిన 30 శఆతం వాటాను భారత్ సైనికులకు కోసం వినియోగించాలని, ఆ తరువాత మిగిలిన పది శాతం సమాజంలో మంచి పనులు చేస్తున్న ఐదు ఎన్జీఓ సంఘాలకు వినియోగించాలని కోరుతూ వీలునామ రాశాడు. వివాహాలు చేసుకుని తమ భర్తలతో కలపి బాగా స్థిరపడిన తన ఇద్దరు అంగీకారంతోనే తాను ఈ నిర్ణయం తీసుకున్నానని, తన భార్య దీపాతో చర్చించిన పిమ్మట ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు తనకు చాలా సంతోషంగా వుందాన్నారు.

తన పదవీ విరమణ తరువాత అనేక దాతృత్వ కార్యక్రమాలలో ఆయన పాల్గోన్నాడు. ఇప్పడికే మహారాష్ట్రలో కరువు తాండివించిన ప్రాంతాలలో ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబాల నుంచి 40 మంది అభాగినులను ఎంపిక చేసి వారికి తన వంతు సాయంగా స్వచ్చధంగా విరాళాన్ని అందించాడు. వీటితో పాటుగా ఆయన పూణేలో ట్రాఫిక్ సమయాల్లో రోడ్డుపై నిల్చుని ట్రాపిక్ సజావుగా వెళ్లేందుకు వీలుగా కూడా సహాయం చేస్తున్నాడు. అయితే ఈయనకు 2013లోనే తన ఆస్తిని భారతీయ జవాన్లకు, రైతులకు రాసివ్వాలని అలోచన వచ్చిందని, ఈ విషయంలో నెలకొన్న పలు సందేహాలను నివృత్తి చేసుకునేందుకు తాను స్వయంగా కేంద్ర ఆర్థిక శాఖ, రక్షణ శాఖ సహా ప్రధానమంత్రి కార్యాలయం అధికారులను కలిసిన తరువాత వీలునామాను రాసిన్నట్లు ఖేల్కర్ చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : pune man  will  property  prakash kelkar  armed forces  farmers  maharastra news  

Other Articles