ఇళ్లు వదలి గ్రామస్థులు పరార్.. మనుషులూ.. నేర్చుకోరూ..! Two elephants fall in well as their herd of 120 surround the area

Two elephants fall in well as their herd of 120 surround the area

elephant fell in well, lalka hamlet, west midnapore, 120 elephants, elephant accident, pets and environment, viral and trending

Two elephants fell into a well at Lalka hamlet in West Midnapore district tonight, following which a herd of around 120 pachyderms cordoned off the area.

ఇళ్లు వదలి గ్రామస్థులు పరార్.. మనుషులూ.. నేర్చుకోరూ..!

Posted: 11/02/2016 11:05 AM IST
Two elephants fall in well as their herd of 120 surround the area

మనిషి మేధస్సుకు ప్రపంచంలో కొలమానమే లేకుండా అద్భుతాలు చేస్తున్న తరుణంలో తమ కళ్ల ముందు ఏదైనా ఓ ఘటన జరిగితే.. అందుబాటులోకి వచ్చిన సాంకేతిక విఫ్లవం నేపథ్యంలో స్మార్ట్ ఫోన్లలలో నిక్షిప్తం చేయడానికే అధిక ప్రాధాన్యత లభిస్తుంది తప్ప.. అపదలో వున్న వారిని అదుకోవాలన్న మనుషులలోని మానవత్వం మంటగలిసిపోతుంది. హైదరాబాద్ హైటెక్ సిటీ వద్ద తన కారు ప్రమాదానికి గురైన సందర్భంలోనూ అక్కడి సాప్ట్ వేర్ ప్రోఫెషనల్స్ వ్యవహరించి తీరు కూడా సరిగ్గా ఇదే.

తనకు ఎదురైన వింత అనుభవానికి నటుడు ప్రకాష్ రాజ్ విస్మయం వ్యక్తం చేశారు. ఏమిటీ.. మనుషుల.. అపన్నహస్తం అందించేందుకు బదులు తమ ఫోన్లు తీసి జరిగిన ఘటనను తమ సెల్ ఫోన్లలో చిత్రీకరించి.. వాటిని సోషల్ మీడియాలో పెట్టేందుకు పోటీపడుతున్నారని ఒకింత అసంతృప్తిని వ్యక్తం చేశాడు. ఇటీవల ఢిల్లీలో ఓ మనిషి ప్రమాదానికి గురై రక్తపు మడుగులో వుండి తనకు సాయం అందించే అపన్న హస్తం కోసం రమారమి ఆరు గంటలపాటు వేచి చూసినా.. సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారే తప్ప.. అదుకునే నాథుడే కరువయ్యాడు.

అయితే సాంకేతిక విప్లవం, ఆధునాత పరిజ్ఞానం మనుషుల అవసరాలను తీర్చుకుని మరింత అధికంగా ఒకరి సాయంగా నిలిచేందుకే తప్ప.. వారి ప్రాణంలో పోతున్న సమయంలో వారు విలవిలలాడుతున్న పట్టించుకోకుండా నిచేష్టులుగా, మరమనుషులు తమ పనులు తాము చేసుకుపోవడానికి మాత్రం కాదు. ఎలాంటి సాంకేతికత లేకపోయినా.. బుద్దే కాదు, మాటలు కూడా రాని మూగజీవాలు వున్నపాటి ఐక్యత, సానుభూతి, అండగా నిలిచేందుకు అవి పడే పాట్లు అనేక సందర్భాలలో మనం చూస్తునే వున్నాం.

తాజాగా అడవి మార్గంలో సంచరిస్తూ రెండు ఏనుగులు మంద నుంచి విడిపోయి గ్రామాలపైపుకు వచ్చాయి. అనుకోకుండా అవి బావిలో పడ్డాయి. వాటి అరుపులతో సమాచారాన్ని అందుకున్న ఏనుగులు మంద అక్కడికి చేరుకుంది. వాటికి అండగా నిలిచాయి. మంద అంటే ఒకటో, రెండో ఏనుగులు కాదు ఏకంగా 120 ఏనుగులు బావి చుట్టూ నిల్చుని వాటికి మేమున్నాం మీకేం కాదు అన్న దైర్యాన్ని ఇచ్చాయి.

వవరాల్లోకి వెళ్తే.. పశ్చిమబెంగాల్ పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని లల్కా గ్రామ శివార్లలోని ఓ బావిలో రాత్రి 8గంటల సమయంలో రెండు ఏనుగులు ప్రమాదవశాత్తు పడిపోయాయి. ఈ విషయాన్ని గ్రహించిన ఏనుగులు ఆ గ్రామంపైకి దాడికి వచ్చాయి. అయితే బావిలో పడిని రెండింటిలో ఒక ఏనుగు అప్పుడే ప్రసవించడంతో.. ఏనుగుల మంద బావి చుట్టూ రక్షణ వలయంగా కాపాలా కాస్తూ నిల్చున్నాయని, దీంతో వాటిని బయటకు తీయలేకపోయినట్టు డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రవీంద్రనాథ్ సహ తెలిపారు. ఏనుగుల గుంపు గ్రామంపైబడి దాడులకు యత్నించవచ్చన ఆందోళనకు గురైన పరిసర ఏజెన్సీల ప్రజలు ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వలసపోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : elephant fell in well  lalka hamlet  west midnapore  120 elephants  viral and trending  

Other Articles