విమానంలో యువతిని తాకినందుకు.. Indian-Origin Man Jailed For Sexually Assaulting Sleeping Teen

Indian origin man jailed for sexually assaulting sleeping teen on uk flight

Suman das, indian businessman, manchester, britain, Teen sexual assault, Britain flight, Uk flight assault, indian sentenced in britian, indian businessman sentenced, indian sexual assult case, britain, molestatation, crime news

An Indian-origin businessman Suman Das, from Qatar, has been found guilty of sexually assaulting a teenage girl during a flight to the UK and jailed for 20 weeks.

విమానంలో యువతిని తాకినందుకు..

Posted: 10/29/2016 12:14 PM IST
Indian origin man jailed for sexually assaulting sleeping teen on uk flight

దేశంకాని దేశంలో స్థిరపడి వ్యాపారవేత్తగా ఎదిగిన వ్యక్తం.. దేశం పరువును బజారుపాలు చేసేలా వ్యవహరించి.. కటకటాల వెనక్కి వెళ్లాడు. సప్తసముద్రాలు దాటి వలస వచ్చామన్న ఇంకితాన్ని మర్చి.. విమానంలో నిద్రిస్తున్న యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. తనను లైంగికంగా వేధించడం పట్ల యువతి ఏకంగా కేసు పెట్టగా, విచారించిన న్యాయస్థానం భారత సంతతి వ్యాపారవేత్త దోషిగా తేల్చింది. అతనికి బ్రిటన్‌ కోర్టు 20 వారాల జైలుశిక్ష విధించింది.

వివరాల్లోకి వెళ్తే.. గత జూలైలో కతార్‌కు చెందిన వ్యాపారవేత్త అయిన సుమన్‌ దాస్‌ (46) బ్రిటన్‌కు చేరుకున్నాడు. అదే విమానంలో తన పక్క సీటులో కూర్చున్న యువతిపై లైంగికదాడికి పాల్పడ్డాడు. అమె నిద్రిస్తున్న సమయంలో అసభ్యరీతిలో తాకి.. వెకిలిగా ప్రవర్తించాడు. ఈ మేరకు 18 ఏళ్ల యువతి సుమన్ దాస్ పై పిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుమన్ దాన్ ను మాంచెస్టర్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్నారు. అయితే యువతి ఆరోపణల్ని సుమన్‌ తోసిపుచ్చారు. తాను అనుకోకుండా ఆమెను తాకి ఉండొచ్చునని, కానీ ఉద్దేశపూరితంగా తాకలేదని చెప్పుకొచ్చాడు.

బాధిత యువతి మాత్రం సుమన్ దాస్ నిద్రపోవడం లేదని, అతను తనను చూస్తున్నాడని. అతను తనను చూడటం కూడా తాను చేశానని కోర్టుకు తెలిపింది. అంతేకాదు తాను మేలుకువ ఉన్నానో లేదా తెలుసుకోవడానికి తనను చూస్తూనే అసభ్యంగా ప్రవర్తించాడని వాపోయింది. తాను మేలుకున్నానని తెలియగానే అతను వెంటనే పక్కకు కదిలాడని పేర్కొంది. బాధిత యువతి వ్యాఖ్యాలను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం దోషిగా తేలిన సుమన్ దాస్ కు 20 వారాల శిక్షను విధించింది. బ్రిటన్‌ వాసి కాకపోవడంతో అతనికి కమ్యూనిటీ సర్వీస్‌లాంటి తేలికైన శిక్ష విధించకుండా.. 20 వారాల జైలుశిక్షను కోర్టు విధించింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Suman das  indian businessman  manchester  britain  molestatation  crime news  

Other Articles