ప్రియాంక ఎదుగుదలపై అగ్రరాజ్య దురహారం: మండిపడుతున్న ఫాన్స్ Priyanka-Chelsea Handler controversy: Who messed up? Twitter knows

Chat show host asks priyanka if she knew english when she came to the us

Priyanka Chopra, Chelsea Handler, PeeCee, priyanka chopra baywatch, the ellen degeneres show, priyanka chopra awards, chelsea handler, priyanka chopra hollywood, priyanka chopra talk show, priyanka chopra magazine, priyanka chopra baywatch, priyanka chopra video, priyanka chopra films, bollywood, entertainment news

Priyanka Chopra made us proud yet again when she appeared on comedian and actress Chelsea Handler's talk show recently, and amazed everyone with her perfect responses.

ప్రియాంక ఎదుగుదలపై అగ్రరాజ్య దురఃహారం: మండిపడుతున్న ఫాన్స్

Posted: 10/29/2016 10:37 AM IST
Chat show host asks priyanka if she knew english when she came to the us

రానున్న మరో దశాబ్దకాలంలో ప్రపంచాన్ని శాసించేది భారతీయులేనన్న వాస్తవికతకు నిదర్శనంగా నిలుస్తున్న ఇండియన్ స్టార్ ప్రియాంకా చోప్రాపై అగ్రరాజ్యం దురహాకారాన్ని ప్రదర్శించింది. ఓ టీవీ లైవ్ షోలో అమెను టకీలా కోట్టించిన టీవీ యాంకర్ పరోక్షంగా అమెను అవమానించేలా చులకన చేసి మాట్లాడటంపై అమె అభిమానులు అగ్రహంతో మండిపడుతున్నారు.

బాలీవుడ్‌లో సత్తా చాటి ఇటీవలే హాలీవుడ్‌కు వెళ్లిన ప్రియాంక చోప్రా అనతికాలంలో అత్యంత అధికంగా ఆర్జిస్తున్న టీవీ స్టార్ గా ఎదిగింది. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతూనే తన టాలెంట్‌తో అమెరికన్ టీవీ సిరీస్ ‘క్వాంటికో’ సూపర్ హిట్ కావడంతో, క్వాంటికో-2లో కూడా అమె నటిచేందుకు ఎంపికైంది. మరోవైపు ‘బేవాచ్’ అనే హాలీవుడ్ మూవీలో డ్వేన్ జాన్సన్(ది రాక్)తో కలిసి ప్రతినాయిక పాత్రలో నటిస్తోంది.
ఈ సందర్భంగా హాలీవుడ్ సెలబ్రిటీలను, ఇంటర్నేషనల్ ప్రముఖులతో మాత్రమే చాట్ షో చేసే చాల్సీ హండ్లర్ అనే యాంకర్, ప్రియాంకను తన షోకు ఆహ్వానించింది. అయితే ప్రియాంకతో ఎలెన్ ప్రవర్తించిన తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఈ షోలో ప్రియాంకతో చెల్సీ వ్యవహరించిన తీరుపై అమెతో అభిమానులు మండిపడుతున్నారు. ఈ షోలో గతంలో హాజరైన ఏ అతిధుల పట్ల వ్యవహరించని రీతిలో అమె ప్రియాంకతో వ్యవహరించారని నెట్ జనులు కూడా మండిపడుతున్నారు.

ప్రియాంక మిస్‌ వరల్డ్‌ అయ్యాక అభివాదం చేసినప్పుడు అదేదో విద్యుత్‌ బల్బు తీస్తున్నట్లు చెయ్యి ఊపారెందుకని వెటకారంగా మాట్లాడి అవమానపర్చింది చాల్సీ.. అది చాలదన్నట్లు మీరు ఇక్కడి వచ్చిన కొత్తలో మీకు ఇంగ్లీషు వచ్చా అని కూడా వెటకారంగా వ్యాఖ్యానించింది. అంతటితో ఆగని ఎలెన్ ప్రియాంకపై మరో కౌంటర్ వేసింది. ‘మీరు ఇప్పుడు వరల్డ్ స్టార్‌ అయిపోయారు. మీ బ్యూటీ, మీ పెర్ఫార్మెన్స్ అందరూ ఇష్టపడుతున్నారు.’ అని అనగా ప్రియాంక అమె వ్యాఖ్యలతో ఏకీభవించలేదు.

దీంతో చాల్సీ హాండ్లర్ కి ఎక్కడో కాలింది. టీవీ షోలో అమె మాత్రమే అందరికీ కౌంటర్లు వేయాలని భావించే చాల్సికి.. భిన్నమైన సమాధానాలు రావడంతో తనలోని అహం దెబ్బతినింది. అంతే కొద్ది సేపు నోట మాటరాని చాల్సీ ఏదో మిమ్మల్ని పొగడాలి కాబట్టి అలా అన్నాను అంటూ వెటకారంగా సమాధానం ఇచ్చింది. దీంతో చాల్సీ వ్యవహరించిన తీరుపై ప్రీయాంక అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Priyanka Chopra  Chelsea Handler  PeeCee  bollywood  entertainment news  

Other Articles