మొండి ములాయం ఆ పెద్దాయనకి వణికిపోతాడు | Yadav SP chief Mulayam and family listen to darshan word

Yadav sp chief mulayam and family listen to darshan word

Saifai pradhan Darshan singh yadav, who put end Yadav Family Clash, Who behind put end for Yadav family clash, person behind solving Yadav Clash, Mulayam family listen this person words

Saifai pradhan Darshan singh yadav was mediator in akhilesh and shivpal yadav row.

ఆ ఒక్కడి మాటకే ములాయం అండ్ కో మూసుకున్నారా?

Posted: 10/28/2016 09:59 AM IST
Yadav sp chief mulayam and family listen to darshan word

దేశం మొత్తం కుదిపేసిన యూపీ అధికార పార్టీ ఎస్పీ అధినేత ములాయం సింగ్ ఇంటి వ్యవహారం ఇప్పుడిప్పేలా కాస్తంత చల్లబడింది. తండ్రితో విబేధించి సొంత పార్టీ కోసం అఖిలేష్ పావులు కదపటం అంటే పరిస్థితి ఎందాకా వచ్చిందో అర్థం చేసుకోవచ్చు. బహిరంగ సభలో బాబాయ్ చేసిన విమర్శలతో దాదాపు విడిపోయినంత పని చేసిన కొడుకు తిరిగి తండ్రి మాటకు ఎలా తలొగ్గాడనే ఇక్కడ అసలు ట్విస్ట్. అయితే దీని వెనుక దౌత్యం నడిపిన కీలక వ్యక్తి ఒకరు ఉన్నారన్న వార్త బయటికి పొక్కింది.

ఓ జాతీయ పత్రిక కథనం ప్రకారం... ములాయం సింగ్ యాదవ్ స్వగ్రామం సైపై ప్రధాన్ దర్శన్ సింగ్ యాదవ్ పేరు చెబుతున్నారు. పెద్ద పెద్ద తోపులకే సాధ్యం కానీ పనిని ఇతగాడు ఎలా చేశారంటారా? , ఆయనేం అల్లా టప్పా వ్యక్తి కాదు. దర్శన్ సింగ్ యాదవ్ ఇటావా జిల్లా సైఫై గ్రామ ప్రధాన్. ములాయం రాజకీయాలకు రాకముందు(1967కి ముందు) అక్కడ స్కూల్లో టీచర్ గా పని చేశారు. ఆ సమయంలో కొత్తగా వచ్చినప్పుడు ఓ దళితుడిచ్చిన మంచి నీళ్లు ములాయం తాగారు. దీంతో గ్రామస్థులంతా ఆచారం మంటగలిపాడంటూ ములాయంను కొట్టేందుకు ముందుకు వచ్చారు. ఆ సమయంలో ములాయం వండిన బంగాళాదుంప కూర తిన్న గ్రామంలోని మరో వ్యక్తి దర్శన్ సింగ్ యాదవ్... ములాయం అమంగళమైతే ఆయన వండిన కూర తిన్న తాను కూడా అపవిత్రుడినైనట్టేనని, అతని కంటే ముందు తనను శిక్షించాలంటూ గ్రామస్థులకు ఎదురెళ్లారు. దీంతో గ్రామస్థులు మౌనం వహించారు.

అప్పటి నుంచి సైపై గ్రామానికి ఆయనే ప్రధాన్, ఆయన మాటంటే ములాయంకి, ఆయన కుటుంబానికి వేదవాక్కు. దీంతో ఇంటి సమస్యను పరిష్కరించుకునేందుకు తమ్ముడు, కుమారుడితో కలిసి ఆయన సోమవారం సైపై గ్రామానికి వెళ్లారు. గ్రామ మధ్యలో ఓ రచ్చబండ దగ్గర ప్రధాన్ దర్శన్ సింగ్ యాదవ్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మీలో మీరే కలహించుకుంటే ప్రజలు, కార్యకర్తల్లోకి ఏ సందేశం వెళ్తుందని ప్రశ్నించారు. అలాగే ఒకరి నిర్ణయాలు ఒకరు గౌరవించుకుని ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు. దీంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన ములాయం కుటుంబ సభ్యులు ఎవరి పనిలో వారు మునిగిపోయారు.

థర్డ్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా ములాయం తమ్ముడు ఢిల్లీ వెళ్లగా, రాష్ట్ర వ్యాప్తంగా భారీ ర్యాలీ నిర్వహించేందుకు ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ సిద్ధమవుతున్నారు. పార్టీ వ్యవహారాల్లో ములాయం సింగ్ యాదవ్ తలమునకలైపోయారు. అన్నదమ్ములే నోరు మెదపని ములాయం ముందు ఇలా దర్శన్ తన ఒక్క మాటతో ఇంత పెద్ద సమస్యను ముగించాడన్న మాట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mulayam Singh yadav  Family clash  Saifi village pradhan  Darshan singh yadav  

Other Articles