ఆ ఉద్విగ్నక్షణంలో ‘యడ్డీ’ నోట సత్యమేవ జయతే..! Yeddyurappa acquitted mining bribery case

Bs yeddyurappa acquitted in rs 40 crore mining bribery case says satyameva jayate

B.S. Yeddyurappa, cbi special court, Lok Ayukta, former justice Santosh Hegde., Judge RB Dharmagouder, bribery case, bellary mining case

In a huge relief to BS Yeddyurappa, a CBI special court acquitted the former Karnataka CM of charges of accepting bribes in a Rs 40 crore illegal mining case.

ఆ ఉద్విగ్నక్షణంలో ‘యడ్డీ’ నోట సత్యమేవ జయతే..!

Posted: 10/26/2016 02:58 PM IST
Bs yeddyurappa acquitted in rs 40 crore mining bribery case says satyameva jayate

కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ యడ్యూరప్పకు బళ్లారి మైనింగ్ అక్రమార్కుల నుంచి లభ్ది పోందారన్న కేసులోఊరట లభించింది. సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ఆయనను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెల్లడించింది. ఆ తీర్పును విన్న ఉద్విగ్న క్షణంలో ఉద్వేగానికి లోనై కోర్టు బయటకు వచ్చిన యడ్యూరప్ప తన అనుచరుల సమక్షంలో సత్యమేవ జయతే అంటూ నినదించారు. ఈ కేసులో యడ్యూరప్పతో పాటు అయన ఇద్దరు కుమారులు, అల్లుడు, వారి కుటుంభసభ్యుల నేతృత్వంలో నడుస్తున్న ఓ స్వచ్చంధ సంస్థ, బెళ్లారిలోని ఓ ప్రైవేటు స్టీల్ కంపెనీ మొత్తంగా తోమ్మిది మందిని నిర్దోషులుగా న్యాయస్థానం ప్రకటించింది.

యడ్డూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించి జిందాల్ సంస్థకు లబ్ధి చేకూర్చారని, దీని వల్ల దాదాపు రూ.40 కోట్లు ముడుపులు అందాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఈ విషయమై నమోదైన కేసులో అప్పటి లోకాయుక్త జస్టిస్ సంతోష్ హెడ్గే ముఖ్యమంత్రిని పదవిలోంచి దిగిపోవాల్సిందిగా అదేశించారు. అయితే ఈ కేసులో సుమారు మూడు వారతల పాటు జైలు జీవితం గడిపిన ఆయన.. ఆ తరువాత న్యాయస్థానం బెయిల్ జారీచేయడంతో విడుదలయ్యారు. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించిన వాదనలు పూర్తి కాగా యడ్యూరప్ప సహా నలుగురిని నిర్దోషులుగా సీబీఐ కోర్టు ఇవాళ తీర్పునిచ్చింది.

యడ్యూరప్ప నిర్ధోషి అని న్యాయస్థానం తీర్పును వెలువరించడంపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య స్పందించారు. న్యాయస్థానం నిర్దోషి అని తీర్పునిచ్చినంత మాత్రాన యడ్యూరప్ప తప్పు చేయలేదని చెప్పలేమన్నారు. ఈ కేసులో యడ్యూరప్ప తప్పులు చేశారు కాబట్టే అభియోగాలు నమోదయ్యాయని, అయితే వాటికి తగ్గ సాక్ష్యాధారాలు లభ్యం కాకపోవడం వల్లనే అయనను న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించిందని చెప్పారు. కాగా త్వరలో రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారన్న అంశంపై అడిగిన ప్రశ్నకు బదులు ప్రజలే సమాధానమిస్తారని చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles