లిఫ్టు హ్యాండించినా.. ఐ యాప్ సేఫ్ అంటున్న నిమ్మకాయల Chinna Rajappa suffers injuries in lift mishap

Chinna rajappa suffers injuries in lift mishap

Chinna Rajappa, Ap DY Chief Minister, Nimmakayala Chinna Rajappa, Sanjeevani Hospital, Prawns-cleaning Factory, Kattamuri, Peddapuram Mandal, Injury, Lift Falls, Kakinada, West Godavari, Andhra Pradesh

AP Home Minister-cum-Deputy CM Nimmakayala Chinna Rajappa suffered injuries after the lift mishap at Sanjeevani Hospital in Kakinada.

లిఫ్టు హ్యాండిచ్చినా.. ‘ఐ యాం సేఫ్’ అంటున్న నిమ్మకాయల

Posted: 10/25/2016 11:32 AM IST
Chinna rajappa suffers injuries in lift mishap

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, హోం శాఖామాత్యులు నిమ్మకాయల చిన్నరాజప్ప ఇవాల ప్రమాదానికి గురైయ్యారు. పెద్దపురం మండలంలోని కట్టమూరి గ్రామంలోనెలకొన్న రోయ్యాల పరిశ్రమ బాధితులను పరామర్శించేందుకు తూర్పు గోదావరి జిల్లా కాకినాడలోని సంజీవని ఆసుపత్రికి వచ్చిన అయన బాధితులను పరామర్శించి.. తిరిగివెళ్తున్న సమయంలో ప్రమాధానిక గురయ్యారు. మూడో అంత‌స్తు నుంచి లిఫ్టులో కిందకు వస్తుండగా లిఫ్టు వైరు ఒక్కసారిగా తెగిపడ‌డంతో చినరాజ‌ప్ప అందులోనే ప‌డిపోయారు.

హుటాహుటిన స్పందిచిన అస్పత్రి సిబ్బంది ఆయనను ఐసీయూలో చేర్చి చికిత్సనందిస్తున్నారు. ఆయనకు నడుము భాగంలో గాయాల‌య్యాయని వైద్యులు తెలిపారు. ప్రమాధం సంభవించిన సమయంలో లిప్టులో చిన‌రాజ‌ప్పతో పాటు ఓ కానిస్టేబుల్‌, ఇద్దరు మీడియా ప్రతినిధుల‌కు కూడా వున్నారని వారికి కూడా గాయాల‌య్యాయని అస్పత్రి వర్గాలు చెప్పాయి. రొయ్యల శుద్ధి పరిశ్రమలో అస్వస్థతకు గురైన బాధితులను పరామర్శించిన అనంతరం ఘటన జరిగింది.

అయితే నిమ్మకాయల చిన్నరాజప్పకు ప్రమాదం సంభవించిందన్న వార్తలు ఒక్కసారిగా పార్టీ వర్గాలను, రాష్ట్ర ప్రజలను కలవరానికి గురిచేశాయి. దీంతో ఆయన తనకు ఏమీ కాలేదని, ప్రమాదం సంభవించిన మాట వాస్తవమని, అయితే.. తనకు గాయాలయ్యాయని వస్తున్న వార్తలు అవాస్తవమని చెప్పారు. తనకేమీ జరగలేదని తాను బాగానే వున్ననని మీడియాతో చెప్పారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Chinna Rajappa  Ap DY Chief Minister  Injury  Lift Falls  Kakinada  East Godavari  Andhra Pradesh  

Other Articles